Amzon Prime Video: ప్రస్తుతం ప్రపంచం అంతా ఓటీటీ హవా నడుస్తుంది. అమెజాన్ ప్రైమ్ డిసెంబర్ 2016లో మన దేశంలో ప్రారంభమైంది. అప్పటినుండి ఎంతోమంది సబ్స్క్రైబర్స్ తో సేవలను కొనసాగిస్తుంది. ప్రస్తుతం ప్రైమ్ యాడ్ ఫ్రీ మెంబర్షిప్ సంవత్సరానికి 1499 కొనసాగుతుంది. ఇప్పటివరకు ఈ సేవలో ఎటువంటి యాడ్స్ లేకుండా కొనసాగుతుంది. అమెజాన్ ప్రైమ్ ఓ ప్రకటనతో వినియోగదారులకు షాక్ ఇచ్చింది. తాజాగా అమెజాన్ ప్రైమ్ జూన్ 17 నుండి ప్రీమియం సబ్స్క్రిప్షన్ తీసుకున్న యాడ్స్ ప్లే అవుతాయంటూ ప్రకటన విడుదల చేసింది.ఆ వివరాలు లోకి వెళితే..
డబ్బులు పెట్టి సబ్స్క్రిప్షన్..
గత కొంతకాలం గా ఓటీటీలకు ప్రాధాన్యత పెరిగింది. ఎన్నో ఓటీటీలు అందుబాటులోకి వచ్చాయి. కొన్ని ప్రీమియర్ ప్లాన్స్ తో, యాడ్స్ ప్లే అవ్వకుండా సినిమాలను, షోలను, వెబ్ సిరీస్ ని చూసే అవకాశాన్ని కల్పిస్తాయి. అటువంటి ఓటీటీలో ప్రముఖ సంస్థ అమెజాన్ ప్రైమ్ ఒకటి. ఇండియాలోని తమ వినియోగదారులకు షాక్ ఇస్తూ అమెజాన్ ప్రైమ్ తాజాగా ఒక ప్రకటన విడుదల చేసింది. జూన్ 17వ తేదీ నుంచి సినిమాలు ,టీవీ షోల మధ్యలో ప్రకటనలను ప్రసారం చేయనున్నట్లుగా అమెజాన్ అధికారికంగా, సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ప్రకటన ద్వారా వచ్చే ఆదాయంలో, కొంత భాగాన్ని కంటెంట్ పై పెట్టాలన్న ఉద్దేశంతోనే సమస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు, ప్రకటించారు. అయితే ప్రకటనలు చూడడానికి ఇష్టపడని వినియోగదారుల కోసం ఓ ప్రత్యేకమైన ప్లాన్ అందుబాటులోకి తీసుకురానున్నట్లు అమెజాన్ సంస్థ తెలిపింది. ప్రస్తుతానికైతే మెంబర్షిప్ ధరల్లో ఎలాంటి మార్పు ఉండదు. ప్రస్తుతం కొనసాగుతున్న ప్లాన్ లోనే తర్వాత అయినా కొనసాగవచ్చు కానీ అప్పుడు యాడ్స్ తో కూడిన కంటెంట్ ప్లే అవుతుంది.ఇలా యాడ్స్ లేకుండా యాడ్ ఫ్రీ ప్లాన్ ను ఎంచుకోవడానికి అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఏటా 699, నెలకు 129 రూపాయలు అదనంగా పే చేస్తే యాడ్స్ లేకుండా మూవీస్ వెబ్ సిరీస్ చూసే సదుపాయాన్ని కల్పించారు. ఇలా అదనంగా మనీ చెల్లించాలనుకునే వారు జూన్ 17 నుండి మనీ చెలించాల్సి ఉంటుంది. డబ్బులు పెట్టి సబ్స్క్రిప్షన్ తీసుకోవడం ఇక దండగ అంటున్నారు వినియోగదారులు.
సడన్ షాక్ ఇచ్చిన ప్రైమ్..కారణం ఇదేనా ..
ఈ ప్రకటన చూసిన తర్వాత వినియోగదారులు ఒకింత షాక్ గురయ్యారని చెప్పొచ్చు. అమెజాన్ ఇలా ప్రకటించటానికి కారణం ఆకర్షణమైనా కంటెంట్ లో పెట్టుబడి పెట్టడానికి, దీర్ఘకాలంలో ఆ పెట్టుబడి పెంచుకోవడానికి ప్రకటనలు అవసరమవుతాయని అమెజాన్ ప్రకటించింది. మా సంస్థ లాభదాయకంగా నిర్వహించాలి అంటే వచ్చే సవాళ్లను ఎదురుకోక తప్పదు కంటెంట్, కొత్తది సృష్టించాలంటే ఖర్చులు పెరుగుతున్నాయి. ఇప్పుడు సబ్స్క్రైబర్స్ కూడా మెల్లిగా తగ్గుతూ వస్తున్నారు. ప్రకటనలు ప్రవేశపెట్టడం ద్వారా, కొత్త కొత్త లైవ్ ప్రోగ్రామ్స్ ని, ఈవెంట్ ని, ప్రముఖ షోలకు, నిధులు సమకూర్చడానికి అమెజాన్ అదనంగా ఆదాయాన్ని పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇలా ప్రతి ఓటీటీ సబ్స్క్రిప్షన్ ఫ్యాక్స్ ని మారుస్తూ ఉండడం సహజమే, నెట్ ఫ్లిక్, డిస్నీ ప్లస్ హాట్ స్టార్, ఆహా, ఈటీవీవిన్, ఇలా ప్రతి ఒక్క ఓటీటీ ప్లాట్ ఫామ్ సబ్స్క్రైబర్స్ కి తగిన ప్లాన్ ను సూచిస్తూ ఉంటుంది. కానీ వీటన్నింటిలో తక్కువ ధరకే, యాడ్స్ ఫ్రీ సబ్స్క్రిప్షన్ ప్యాక్స్ ని అందిస్తున్నాయి.