BigTV English

Virat kohli : క్రికెట్ ‘రారాజు’.. విరాట్ కోహ్లీ!

Virat kohli : క్రికెట్ ‘రారాజు’.. విరాట్ కోహ్లీ!

Virat kohli : సచిన్ క్రికెట్ దేవుడు అయితే, విరాట్ క్రికెట్ రారాజు అని చెప్పాలి. నిజమే రికార్డుల మీద రికార్డులు తిరగరాస్తూ, తనకి మాత్రమే సాధ్యమయ్యేలా, తన ప్రత్యేకతను చాటి చెబుతూ అనితర సాధ్యమైన ప్రదర్శన చేస్తున్న విరాట్ కోహ్లీకి ఆ రికార్డులే దాసోహమవుతున్నాయి. 49 వ సెంచరీ చేసి సచిన్ టెండుల్కర్ రికార్డ్ ను సమం చేసిన విరాట్ చెంత మరికొన్ని రికార్డులు వచ్చి చేరాయి. 277 వన్డే ఇంటర్నేషనల్ మ్యాచులు ఆడిన కోహ్లీ 13, 626 పరుగులు చేశాడు. ఇందులో 70 ఆఫ్ సెంచరీలు ఉన్నాయి.


వన్డే వరల్డ్ కప్ 2023లో ఆడిన 8 మ్యాచుల్లో విరాట్ 543 పరుగులు చేశాడు. ప్రస్తుతం తను రెండో స్థానంలో ఉన్నాడు. మొదటి ప్లేస్ లో డికాక్ 550 పరుగులతో ఉన్నాడు. తన  వెనుక మూడో స్థానంలో రచిన్ రవీంద్ర 523 పరుగులతో ఉన్నాడు. రోహిత్ శర్మ 442 పరుగులతో తన వెనుక ఉన్నాడు.

మొత్తమ్మీద చూస్తే వన్డే వరల్డ్ కప్ ల్లో అత్యధిక పరుగుల రికార్డ్  కూడా సచిన్ పేరు మీదే ఉంది. తను ఒక వరల్డ్ కప్ లో 673 పరుగులు చేశాడు. ఇప్పుడు విరాట్ ఇంకా దానికి 230 పరుగుల దూరంలో ఉన్నాడు. సౌతాఫ్రికాపై ఇప్పటివరకు అన్ని ఫార్మాట్లలో కలిపి 58 మ్యాచ్ లు ఆడిన కోహ్లీ (3,058) పరుగులు చేశాడు. అంటే 3వేల పరుగుల మైలు రాయిని దాటాడు. ఇందులో 8 సెంచరీలు, 14 హాఫ్ సెంచరీలు ఉన్నాయి.


అంత కఠినమైన ఈడెన్ గార్డెన్ పిచ్ మీద బాల్ మెరుపులా స్వింగ్ అవుతుంటే, తన అనుభవన్నాంత జోడించి క్రీజులో చివరివరకు ఉండి 101 పరుగులు చేసిన కోహ్లీ అజేయంగా నిలిచాడు. ఇదే పిచ్ మీద సౌతాఫ్రికా బ్యాటర్లు అందరూ కలిసి 83 పరుగులకే ఆలౌట్ అయ్యారు. అంటే పిచ్ ఎంత ప్రమాదకరంగా ఉందో అర్థమవుతోంది. అలాంటి పిచ్ పై సెంచరీ కొట్టడమంటే మామూలు విషయం కాదని, అది కింగ్ కోహ్లీకే సాధ్యమని అంతా ఆకాశానికెత్తేస్తున్నారు.

2019-22 మధ్య మూడేళ్ల కాలంలో కోహ్లీ పనైపోయిందని అంతా అనుకున్నారు. జట్టులో స్థానం ప్రశ్నార్థకమైంది. ఆ టైమ్ లోనే కెప్టెన్సీ కూడా వదిలేశాడు. దీంతోనే రిటైర్మెంట్ ఇచ్చేస్తాడని అనుకున్నారు. కానీ కోహ్లీ పట్టుదల అందరికీ తెలిసిందే. సింహం నాలుగు అడుగులు వెనక్కి వేసిందంటే అర్థం.. దాడి చేయడానికే అన్నట్టు, 2022లో జరిగిన ఆసియా కప్ టీ20లో సెంచరీ చేసి స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చాడు. ఇంక అక్కడ నుంచి నేటి వరకు మళ్లీ వెనుతిరిగి చూడటం లేదు. వైట్ బాల్ తో చూసుకుంటే 50 సెంచరీలు కొహ్లీ ఖాతాలో ఉన్నాయి. వన్డేలు 49, టీ 20 ఒకటి ఉంది. అలా వైట్ బాల్స్ తో 50 సెంచరీలు చేసిన క్రికెటర్ గా కొహ్లీ రికార్డ్ సృష్టించాడు.

Related News

Virender Sehwag: డైపర్ వేసుకొని సచిన్ సెంచరీ కొట్టాడు.. సీక్రెట్ బయటపెట్టిన సెహ్వాగ్

Watch Video : ఇదెక్కడి క్రికెట్ రా.. ఇలా ఆడితే అస్సలు రన్ అవుట్ కాబోరు

Sanju Samson : సంజూ అరాచకం.. వరుసగా 6,6,6,6,6,6

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Big Stories

×