Big Stories

IPL 2024: ఐపీఎల్ లో ఎవరున్నారు? ఎవరు వెళ్లారు?

ipl

- Advertisement -

Who will be in and out from IPL 2024: ఐపీఎల్ సీజన్ -17 ప్రారంభం కావడానికి మరొక్కరోజు మాత్రమే సమయం మిగిలి ఉంది. ప్రారంభ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య జరగనుంది. ఇంక ప్రారంభోత్సవేడుకలకు చెన్నైలోని చెపాక్ స్టేడియం అంగరంగ వైభవంగగా ముస్తాబవుతోంది.

- Advertisement -

మొత్తం 10 జట్లు ఐపీఎల్ లో ఆడనున్నాయి. ఇందులో వచ్చెదెవరు? వెళ్లెదవరు? ఉండెదెవరు? అనే సందేహాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. అసలు పేరున్న ఆటగాళ్లల్లో ఎవరు ఆడుతున్నారు? ఎవరు ఆడటం లేదు? అనే విషయాలు చూద్దాం..

కోల్ కతా నైట్ రైడర్స్ నుంచి గాయాలతో దూరమైన ఆటగాళ్లు గుస్ అట్కిన్సన్, జేసన్ రాయ్ ఉన్నారు.
అయితే జేసన్ ప్లేస్ లో ఫిల్ సాల్ట్ వచ్చాడు.

చెన్నై సూపర్ కింగ్స్ నుంచి శివమ్ దూబె, డెవాన్ కాన్వే, మతీషా పతిరన వీరంతా గాయపడ్డారు. అయినా సరే, జట్టులోనే కొనసాగుతున్నారు. మరి ఆడతారో లేదో చూడాల్సిందే.

గుజరాత్ టైటాన్స్ నుంచి మహ్మద్ షమీ, రాబిన్ మింజ్ ఇద్దరూ గాయాలతో తప్పుకున్నారు.

ఢిల్లీ క్యాపిటల్స్ నుంచి  హ్యారీ బ్రూక్, లుంగి ఎంగిడి తప్పకున్నారు. అయితే ఎంగిడి స్థానంలో ఫ్రేజర్‌ మెక్‌గర్క్ జట్టులోకి వచ్చాడు.

లక్నో సూపర్ జెయింట్స్ నుంచి మార్క్ వుడ్ దూరమైతే, అతని ప్లేస్ లో షామర్ జోసెఫ్ జట్టులోకి వచ్చాడు.

ముంబై ఇండియన్స్ జట్టు నుంచి సూర్యకుమార్ యాదవ్, జేసన్ బెరెన్‌డార్ఫ్, దిల్షన్ మధుశంక ఉన్నారు.
బెరెన్‌డార్ఫ్ స్థానంలో ల్యూక్ వుడ్ వచ్చాడు.

Also Read: ఐపీఎల్ ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?

రాజస్థాన్ రాయల్స్ నుంచి ప్రసిద్ధ్ క్రష్ణ దూరమయ్యాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్, ఆర్సీబీ, పంజాబ్ కింగ్స్ ఈ జట్ల నుంచి ఎవరూ గాయ పడలేదు.

ఇంతమంది ఇన్ని జట్ల నుంచి గాయాలతో వెళ్లినా, ఎవరూ కొత్తవారిని తీసుకోలేదు. కానీ గుజరాత్ టైటాన్స్ మాత్రం రాబిన్ మింజ్ ప్లేస్ లో సర్ఫరాజ్ ఖాన్ ని తీసుకోవాలని అనుకుంటున్నారు. ఇంకా అధికారిక ప్రకటన అయితే రాలేదు. మార్చి 22 నుంచి ఐపీఎల్ ప్రారంభోత్సవం కానున్న సంగతి అందరికీ తెలిసిందే.
- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News