Big Stories

Volunteer War in AP: వాలంటీర్లపై వేటు..! వాళ్ళకి అంత పవరుందా..?

Volunteer War

- Advertisement -
- Advertisement -

ఇలా ప్రతి అంశం వివాదస్పదమే. ఇంతకీ ఈ పంచాయతీ ఎప్పుడు మొదలైంది. నిజానికి విలేజ్ వాలంటీర్స్‌ సిస్టమ్ అనేది జగన్ సర్కార్ తీసుకొచ్చిన అతి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఒకటి.. గవర్నమెంట్ ఇంప్లిమెంట్ చేస్తున్న అన్ని వెల్ఫేర్ స్కీమ్‌ను వాలంటీర్ సిస్టమ్ ద్వారా.. ప్రజలంతా ఇంటి దగ్గరే పొందే ఏర్పాటు చేశారు..పెన్షన్స్, రేషన్, ప్రభుత్వ పథకాలు పొందేందుకు సహాయం చేయడం.. ఇలా ప్రతి విషయంలో వీరి ఇన్వాల్వ్‌మెంట్ ఉంటుంది. ఇలా పనిచేసే వాలంటీర్లకు మంత్లీ ఫైవ్ థౌసెండ్ ఇస్తోంది జగన్ సర్కార్..ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. మొదట్లో ఈ వ్యవస్థపై ప్రశంసల వర్షం కురిసింది. కానీ వాలంటీర్లుగా ఎవరిని అపాయింట్ చేస్తున్నారు? వాళ్లకిచ్చే సాలరీ ఎంత? నిజంగా ఆ సాలరీ కోసమే వాళ్లు పనిచేస్తున్నారా?

వాలంటీర్‌ కావాలంటే వైసీపీ కార్యకర్త కావాల్సిందేనా? అనే ప్రశ్నలు ఎప్పుడైతే తెరపైకి వచ్చాయో ఈ సిస్టమ్‌పై అనుమానాలు మొదలయ్యాయి..ఆ తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ చేసిన విమర్శలతో..వాలంటీర్ల వివాదం పీక్స్‌కు చేరింది..

Also Read: నార్త్‌లో సై అంటే సై అనే పొజిషన్‌లో ఉన్న బీజేపీ.. మోడీ వ్యూహం ఇదేనా!?

వాలంటీర్లు అంటే సీఎం జగన్‌ ప్రైవేట్ సైన్యం అంటూ విపక్షాల విమర్శలు మొదలయ్యాయి..ప్రతి ఇంట్లో ఉన్న డేటా వైసీపీకి చేరిపోతుంది. ఎవరు ఎక్కడికి వెళ్తున్నారో ఎప్పటికప్పుడు గమనిస్తున్నారు..ఆడపిల్లలున్న తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి..ఒంటరి, వితంతు, భర్తలతో విడిపోయిన మహిళలు జాగ్రత్త? అంటూ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో పెద్ద దుమారాన్నే లేపాయి.. దీంతో ఏపీ వ్యాప్తంగా వాలంటీర్లు నిరసనలు చేపట్టారు.. ధర్నాలు చేశారు.. అయితే వారికి క్షమాపణలు చెబుతూనే.. వాలంటీర్ల వ్యవస్థపై మళ్లీ విమర్శలు చేశారు పవన్.. వాలంటీర్ల వ్యవస్థ అనేదిసమాంతర రాజకీయ వ్యవస్థ.. సమాంతర పోలీస్ వ్యవస్థ..సమాంతర పరిపాలన వ్యవస్థ.. అంటూ విరుచుకుపడ్డారు..

ఇదంతా పాస్ట్.. కానీ ప్రజెంట్ ఈ వివాదం మరింత ముదిరింది. ప్రస్తుతమున్న వాలంటీర్లంతా వైసీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు అనేదే ఇక్కడ తీవ్ర ఆరోపణ..వాలంటీర్ల వద్ద ఉన్న ట్యాబ్‌ల్లో కీలక సమాచారం ఉంది. ఆ డేటాను వైసీపీకి అనుకూలంగా ఉపయోగిస్తున్నారు..సంక్షేమ పథకాల పేరుతో గ్రామాల్లో వైసీపీ తరపున ప్రచారం చేస్తున్నారు.. సో వారిని ఎన్నికల విధుల నుంచి తప్పించాల్సిందే అని అటు టీడీపీ, ఇటు జనసేన ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదులు చేశాయి..

Also Read: Vijayawada West: పవన్ కళ్యాణ్ పై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు.. పొత్తులో త్యాగాలు సహజమే

మరి ఈసీ ఫిర్యాదులు తీసుకొని పక్కన పడేసిందా? లేదు.. వాలంటీర్లకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని ఆదేశించింది. మరోవైపు ఈ వివాదం కోర్టుకు కూడా చేరింది. కోర్టు కూడా సేమ్ ఇలాంటి ఆర్డర్సే ఇచ్చింది. అటు ఈసీ, ఇటు హైకోర్టు సూచనలతో ఏపీ సర్కార్‌ కీలక ఆదేశాలు జారీ చేసింది. కోడ్ అమల్లోకి రాకముందే.. వాలంటీర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించింది. కనీసం పోలింగ్ ఏజెంట్లుగా ఉండేందుకు కూడా వారికి అనుమతి లేదని తెలిపింది..
సచివాలయ సిబ్బందిని కూడా కేవలం వేలికి ఇంక్‌ రాసే పని తప్ప..ఇతర ఇంపార్టెంట్ పనులు అప్పగించద్దని తెలిపింది..

ఆదేశాలు ఇవ్వడమే కాదు.. తమకు అందిన 40 కంప్లైంట్స్‌పై విచారణ జరిపింది. నిబంధనలు ఉల్లంఘించిన 46 మంది వాలంటీర్లపై ఇప్పటికే వేటు వేసింది ఈసీ.. వీరంతా వైసీపీకి అనుకూలంగా ప్రచారం చేస్తున్నారు అనే ఆరోపణలపైనే చర్యలు తీసుకుంది..చెప్పింది వినకపోతే.. యాక్షన్ తప్పదని ఈసీ చెప్పకనే చెబుతూ మిగతా వాలంటీర్లకు వార్నింగ్ ఇచ్చినట్టైంది..

ఇవన్నీ ఇలా ఉంటే వైసీపీ వర్షన్ మాత్రం మరోలా ఉంది. వాలంటీర్లు సమాజం కోసం సేవ చేసేందుకు ముందుకు వచ్చిన యువత అంటున్నారు నేతలు.. ప్రజలకు ఏదో చేయాలన్న తపన ఉన్నవారు మాత్రమే వాలంటీర్లుగా వస్తున్నారని..
వారంతా ప్రజలకు ప్రభుత్వానికి మధ్య అనుసంధానకర్తలని చెబుతున్నారు.. ఈ వ్యవస్థను తప్పు పట్టడం సరైంది కాదన్నది వారి వాదన.

Also Read: TDP ALLEGED POLL CODE VIOLATION BY YSRCP GOVT: ఏపీలో అధికార పార్టీకి నో కోడ్.. మౌనంగా పోలీసులు

అయితే పూర్తిగా వాలంటీర్ వ్యవస్థను విమర్శిస్తే నష్టపోతామని తెలుసుకున్నాయి విపక్షాలు..ఎందుకంటే 2 లక్షల 55 వేల 464 మంది వాలంటీర్లు ఉన్నారు.. ఒక్కో వాలంటీర్ 50 మందిని ప్రభావితం చేసినా.. అసలుకే మోసం వస్తుందని గ్రహించాయి..

అందుకే రీసెంట్‌గా వాలంటీర్లపై టోన్ మార్చాయి.. ఇళ్లల్లోని మహిళలకు వాలంటీర్ల వల్ల రక్షణ లేదన్న నేతలే.. ఇప్పుడు తాము ప్రభుత్వంలోకి వస్తే వారిని కొనసాగిస్తామని హామీలు ఇస్తున్నారు.. వాలంటీర్లంతా ప్రభుత్వానికి పనిచేయాల్సిన అవసరం లేదని..
వారిని తమవైపుకు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారు..

అధికార, విపక్షాల చర్యలు చూస్తుంటే..నిజంగానే వాలంటీర్ల వ్యవస్థ గ్రామాల్లో ప్రభావం చూపే అంశంగానే కనిపిస్తోంది. అందుకే వారిని ఎన్నికల విధులకు దూరం చేయడంలో పోరాడి సక్సెస్ సాధించాయి.. వాలంటీర్లంతా బీజేపీ-టీడీపీ-జనసేన కూటమికి వ్యతిరకేంగా పనిచేస్తే ఏం జరుగుతుంది? ఇప్పుడు వారిని మచ్చిక చేసుకునేందుకు చేసే ప్రయత్నాలు ఎంత వరకు సక్సెస్ అవుతాయి..?

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News