SRH- Praful Hinge: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Indian Premier League 2026 Tournament) చాలా రసవత్తరంగా కొనసాగుతున్న నేపథ్యంలో కొత్త కుర్రాళ్ళు తెరపైకి వస్తున్నారు. ఇప్పటికే 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ లాంటి ఎంతోమంది బ్యాటర్లు ఈ టోర్నమెంట్ లో అద్భుతంగా రాణిస్తున్నారు. అయితే లేటెస్ట్ గా ప్రఫుల్ హింజ్ ( Praful Hinge ) సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున అద్భుతంగా రాణించాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Sunrisers Hyderabad vs Rajasthan Royals ) మధ్య ఉప్పల్ వేదికగా సోమవారం జరిగిన మ్యాచ్ లో 18 పరుగులు ఇచ్చిన నాలుగు వికెట్లు తీశాడు ప్రఫుల్ హింజ్. దీంతో ఎవరీ ప్రఫుల్ హింజ్ ?, ఎక్కడి నుంచి వచ్చాడు ? అంటూ సోషల్ మీడియాలో జనాలు వెతకడం మొదలుపెట్టారు. ఈ దెబ్బకు ప్రఫుల్ హింజ్ పేరు సోషల్ మీడియాలో మారుమోగుతోంది.
Also Read: Rohit VS Bumrah: ముంబైలో చీలిక..రోహిత్ శర్మను బండ బూతులు తిట్టిన బుమ్రా, రూ.50 లక్షల ఫైన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2026 టోర్నమెంట్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ ( Sunrisers Hyderabad vs Rajasthan Royals ) మధ్య జరిగిన మ్యాచ్ సందర్భంగా ప్రఫుల్ హింజ్ ( Praful Hinge ) అద్భుతంగా బౌలింగ్ చేశాడు. మొన్నటి వరకు సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు బౌలర్లు లేరని అభిమానులు ఎంతో నిరాశ చెందిన సమయంలో.. రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మ్యాచ్ సందర్భంగా బరిలోకి దిగాడు ప్రఫుల్ హింజ్. ఈ క్రమంలో రాజస్థాన్ రాయల్స్ టాపార్డర్ మొత్తం కుప్పకూల్చాడు. ఈ క్రమంలోనే నాలుగు వికెట్లు పడగొట్టాడు. దీంతో ప్రఫుల్ హింజ్ గురించి సోషల్ మీడియాలో జనాలందరూ వెతకడం మొదలుపెట్టారు.
మహారాష్ట్రలోని నాగపూర్ లో 2002లో జన్మించాడు ఈ హైదరాబాద్ ఆటగాడు ప్రఫుల్ హింజ్. ఈ క్రమంలోనే క్రికెట్ పైన ఇంట్రెస్ట్ తో ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. ఇందులో 10 మ్యాచ్ లు ఆడిన ప్రఫుల్ హింజ్, 27 వికెట్లు పడగొట్టాడు. విదర్భ జట్టులో ప్రఫుల్ హింజ్ కీలక ప్లేయర్ అని చెబుతున్నారు. వికెట్ టు వికెట్ బౌలింగ్ చేయడంలో ఈ కుర్రాడు ఆదరహో అంటున్నారు. అయితే అలాంటి ప్రఫుల్ హింజ్ కు చాలా రోజుల నుంచి ఐపీఎల్ లో ఆడే అవకాశం రాలేదు. కానీ మొన్న జరిగిన మినీ వేలంలో ఈ 24 ఏళ్ల ఈ ఫాస్ట్ బౌలర్ ప్రఫుల్ హింజ్ ను మాస్టర్ మైండ్ తో కావ్య పాప ( Kavya maran) కొనుగోలు చేసింది. కేవలం 30 లక్షలకు మాత్రమే ఈ బౌలర్ ను కొన్న కావ్య పాప, ఇవాళ్టి మ్యాచ్ లో అతన్ని బరిలోకి దింపింది. కీలక సమయంలో మ్యాచ్ ఆడిన ప్రఫుల్ హింజ్, హైదరాబాద్ జట్టుకు బౌలింగ్ సమస్యను తీర్చేశాడు.
Also Read: ఐపీఎల్ నుంచి PSLలోకి రావడానికి సిగ్గు అనిపించలేదా ? కుశాల్ మెండిస్ పరువు తీసిన పాక్ రిపోర్టర్