Tanveer Ahmed on Arshad Nadeem: కామన్ వెల్త్ గేమ్స్ 2026 టోర్నమెంట్ (2026 Commonwealth Games tournament) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ టోర్నమెంట్ లో మన ఇండియన్ క్రీడాకారులు వరుసగా మెడల్స్ సంపాదిస్తుంటే.. పాకిస్తాన్ మాత్రం వెనుకబడిపోయింది. ఒక్క మెడల్ సాధించేందుకు… మూడు చెరువుల నీళ్లు తాగాల్సి వస్తోంది. ఇక లేటెస్ట్ గా జరిగిన జావెలిన్ త్రో ( Javelin throw ) విభాగంలో పాకిస్తాన్ అత్యంత దారుణమైన ప్రదర్శన కనబరిచింది.
ఈ టోర్నమెంట్ లో బల్లెం వీరుడు అర్షద్ నదీమ్ ( Arshad Nadeem) 80 మీటర్లు కూడా తన బళ్లాన్ని విసర లేకపోయాడు. ఈ క్రమంలో 9వ స్థానానికి పడిపోయి..అర్షద్ నదీమ్ ట్రోలింగుకు గురవుతున్నాడు. అయితే పాకిస్తాన్ పరువు తీసిన అర్షద్ నదీమ్ పై తన్వీర్ అహ్మద్ (Tanveer Ahmed ) తన స్టైల్ లో రియాక్ట్ అయ్యాడు. దున్నపోతుల్లా తినడం కాకుండా పాకిస్తాన్ జెండా ఎగరవేయడం నేర్చుకో ? అంటూ ఫైర్ అవుతున్నారు. నీకు చేతకాకపోతే… పాకిస్తాన్ వదిలి వెళ్ళిపో అంటూ బాంబు పేల్చారు. దీంతో అర్షద్ నదీమ్ పై తన్వీర్ అహ్మద్ చేసిన సంచలన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.
కామన్ వెల్త్ గేమ్స్ 2026 టోర్నమెంట్ నేపథ్యంలో తాజాగా జావెలిన్ త్రో ( Javelin throw ) విభాగంలో పోటీ జరిగింది. ఇందులో పాకిస్తాన్ క్రీడాకారుడు అర్షద్ నదీమ్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడు. గత ఒలంపిక్స్ లో గోల్డ్ మెడల్ కొట్టిన ఇతను.. ఈ కామన్వెల్త్ గేమ్స్ లో మాత్రం తొమ్మిదో స్థానానికి దిగజారిపోయాడు. తాజాగా జరిగిన ఈ పోటీల్లో కేవలం 77.46 మీటర్లు మాత్రమే తన బల్లాన్ని విసిరాడు. దీంతో 9వ స్థానంలో నిలిచి… పాకిస్తాన్ పరువు తీశాడు. ఈ క్రమంలో అర్షద్ నదీమ్ పైన తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి.
కామన్ వెల్త్ గేమ్స్ 2026 టోర్నమెంట్ లో అట్టర్ ఫ్లాప్ అయిన అర్షద్ నదీమ్ పై పాకిస్తాన్ మాజీ ఆటగాడు తన్వీర్ అహ్మద్ స్పందించారు. పాకిస్తాన్ నుంచి అరుదైన అవకాశం వస్తే చేజేతులా పోగొట్టుకున్నాడని అర్షద్ నదీమ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. దున్నపోతుల తినడం తప్ప… ఆడడం చేతకాదని ఫైర్ అయ్యారు. ఇలాంటి వాడిని దేశం నుంచి తరిమి వేయాల్సిందేనని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సరైన ఫిట్ నెస్ లేక, ఇలాంటి టోర్నమెంట్ లో పాల్గొంటావా ? అని సీరియస్ అవుతున్నారు. అయితే మరి కొంతమంది మాత్రం… పాకిస్తాన్ క్రీడాకారుడు అర్షద్ నదీమ్ కు సపోర్ట్ గా నిలుస్తూ కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. క్రికెట్లో చాలామంది పాకిస్తాన్ ప్లేయర్లు విఫలమవుతున్నారని… కానీ వాళ్లకు అవకాశాలు విపరీతంగా వస్తున్నాయని గుర్తు చేస్తున్నారు. ఒకసారి విఫలమైనందుకు అర్షద్ నదీమ్ పైన ఇలా మాట్లాడడం చాలా తప్పని పేర్కొంటున్నారు.