BigTV English

IND vs ENG 2nd Test Highlights: విశాఖ టెస్ట్ మనదేనా..? కీలకం కానున్న నేటి మ్యాచ్..!

IND vs ENG 2nd Test Highlights: విశాఖ టెస్ట్ మనదేనా..? కీలకం కానున్న నేటి మ్యాచ్..!
IND vs ENG 2nd Test

IND vs ENG 2nd Test Match Highlights:


విశాఖ టెస్ట్ మనదేనా? రెండు రోజుల ఆట చూస్తే మనోళ్లే మొనగాళ్లు అనిపిస్తోంది. బ్యాటింగ్‌లో యశస్వి జైస్వాల్‌ డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. తన కెరీర్‌లో తొలి డబుల్ సెంచరీ సాధించాడు. తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా 396 పరుగులు చేసింది. రెండోరోజు మార్నింగ్ సెషన్‌లోనే బ్యాటింగ్ మొదలు పెట్టిన ఇంగ్లండ్ టీమ్.. సాయంత్రానికే చాప చుట్టేసింది. పేస్ బౌలర్ బుమ్రా నిప్పులు చెరిగాడు. 16 ఓవర్లు వేసి ఆరు వికెట్లు పడగొట్టాడు. 114 పరుగులకు రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్.. అతి కష్టమ్మీద 253 పరుగులు మాత్రమే చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ ఓపెనర్లు.. వికెట్ పడకుండా జాగ్రత్త పడింది.

విశాఖ టెస్టులో రెండో రోజు ఆటముగిసే సమయానికి భారత్‌ 171 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లాండ్‌ ఓపేనర్‌ క్రావ్లీ 76 టాప్ స్కోరర్‌గా నిలిచారు. మిడిలార్డర్‌లో కెప్టెన్ బెన్ స్టోక్స్ 47 పరుగులు మినహా ఎవరూ పెద్దగా రాణించలేకపోయారు. భారత బౌలర్లలో బుమ్రా 6 వికెట్లు తీశాడు. తొలి ఇన్నింగ్స్ లో భారత్ కు 143 పరుగుల ఆధిక్యం లభించింది.


6 వికెట్ల నష్టానికి 336 పరుగుల ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన టీమిండియా.. మరో 60 పరుగులు మాత్రమే చేసింది. 396 పరుగులకు ఆలౌట్‌ అయింది. భారత్‌ బ్యాటర్లలో యువ క్రికెటర్ యశస్వి జైస్వాల్‌ డబుల్‌ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాట్స్‌మెన్స్ విఫలమయ్యారు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ ఆండర్సన్, షోయిబ్ బషీర్, రెహాన్ అహ్మద్ తలో మూడు వికెట్లు తీయగా టామ్‌ హార్ట్‌లీ ఒక వికెట్ తీసాడు.

వైజాగ్ టెస్టులో మూడో రోజైన ఇవాళ మన ఆటగాళ్లు ఎలా ఆడతారానేది కీలకంగా మారింది. హైదరాబాద్ టెస్ట్‌లోను తొలుత అద్భుతంగా ఆడినా.. తర్వాత చేజేతులా మ్యాచ్‌ను జారవిడుకున్నారు. అలా జరక్కుండా టీమిండియా జాగ్రత్త పడుతుందా? రెండో ఇన్నింగ్స్‌ను ఫ్రెష్‌గా మొదలుపెట్టి ఇవాళంతా ఆడితే.. భారీ స్కోర్ సాధ్యమవుతుంది. ఇప్పటికే 171 పరుగుల ఆధిక్యం ఉంది. మొత్తంగా 300 రన్స్ చేయగలిగినా.. లీడ్‌తో కలుపుకుని ఇంగ్లండ్‌పై ఒత్తిడి పెరుగుతుంది. మరో రెండు రోజుల వరకు మ్యాచ్ ఉంటుంది. పది వికెట్లు తీయడం కష్టం కాకపోవచ్చు.

Related News

Illu Illalu Pillalu Today Episode: నర్మద, ప్రేమల మధ్య శ్రీవల్లి చిచ్చు.. ప్రేమ మాటకు ధీరజ్.. మళ్లీ బుక్కయిన ఆనందరావు..

NRSC Recruitment: హైదరాబాద్‌లో ఉద్యోగ అవకాశాలు.. స్టైఫండ్ ఇచ్చి జాబ్.. ఈ క్వాలిఫికేషన్ ఉంటే ఎనఫ్..!!

Railway Jobs: ఇండియన్ రైల్వేలో 3115 అప్రెంటీస్ ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్, అప్లై చేస్తే మీదే ఉద్యోగం

Tamil Nadu Women Dies: పెళ్లిలో డ్యాన్స్ చేస్తూ.. చనిపోయిన యువతి.. కన్నీళ్లు పెట్టిస్తున్న వీడియో

OTT Movie : అందంతో రెచ్చగొట్టే ఇద్దరమ్మాయిల రచ్చ… ‘గంగూబాయి కతియావాడి’ లాంటి మెంటలెక్కించే స్టోరీ

Lice remove tips:పేలు, చుండ్రులతో ఇబ్బంది పెడుతున్నారా? అమ్మమ్మల కాలంనాటి టిప్స్ ప్రయత్నించి చూడండి

Big Stories

×