BigTV English

Cricketers : క్రికెటర్లు చేతి వేళ్లకు టేప్ ఎందుకు వేసుకుంటారు.. దీని వెనుక రహస్యం ఏంటి

Cricketers : క్రికెటర్లు చేతి వేళ్లకు టేప్ ఎందుకు వేసుకుంటారు.. దీని వెనుక రహస్యం ఏంటి

Cricketers : సాధారణంగా క్రికెట్ (Cricket) లో రకరకాల సంఘటనలు చోటు చేసుకుంటాయి. ఏ క్రికెటర్ ఎప్పుడూ ఎలా వ్యవహరిస్తారో ఊహించడం చాలా కష్టం. ప్రధానంగా క్రికెట్ ఆడేటప్పుడు ఆ క్రికెటర్ తలకు బ్యాండేజీ.. ఇంకొందరూ దస్తీ, మరికొందరూ హెల్మెంట్ వంటి ధరించడం మనం చూస్తుంటాం. ఇలా రకరకాలుగా ఆటగాళ్లు తమకు అనుకూలంగా తమకు నచ్చినట్టుగా వ్యవహరిస్తుంటారు. కొంత మంది క్రికెటర్లు చేతివేళ్లకు టేప్ వేసుకుంటారు. అయితే ఈ టేపు ఎందుకు వేసుకుంటారు..? దీని వెనుక దాగి ఉన్న రహస్యం ఏంటి..? అనేది అందరూ ఆశ్యర్యపోతారు. ఇప్పుడు మనం తెలుసుకుందాం.


Also Read :  Head – Abhishek : అభిషేక్ ఒకలా.. హెడ్ మరోలా.. SRH కు ఎక్కడ దొరికార్రా మీరు..

జాగ్రత్త తప్పని సరి.. 


ముఖ్యంగా క్రికెటర్లు (Cricketers) తమ చేతివేళ్లకు టేప్ వేసుకోవడానికి ప్రధాన కారణం గాయాల నుంచి రక్షించుకోవడం కోసమే. ప్రధానంగా క్యాచ్ లు పట్టుకునేటప్పుడు లేదా బంతిని విసిరేటప్పుడు అయ్యే నొప్పిని తగ్గించడం, కఠినమైన క్రికెట్ బంతి వల్ల చేతులకు కలిగే గాయాలు, బెణుకులు, పగుళ్లు వంటి వాటిని నివారించడానికి వేళ్లకు స్థిరత్వం కల్పించడానికి టేప్ చేస్తుంటారు. వాస్తవానికి కొన్ని సందర్భాల్లో వేళ్లకు టేప్ ధరించడం నియమాలకు విరుద్ధం కావచ్చు. నియమాలను పాటించడం ముఖ్యం అని చెప్పవచ్చు. ప్రధానంగా ట్యాపింగ్ చేతి వేళ్లకు అదనపు మద్దతును అందిస్తుంది. ఆటగాళ్ల వేళ్లను కలిపి టేప్ చేయడం ద్వారా స్థానభ్రంశం లేదా బెణుకుల ప్రమాదాన్ని తగ్గించవచ్చు. ముఖ్యంగాి అధిక వేగంతో బంతిని పట్టుకునే ఫీల్డర్లకు వేళ్ల పై ఎక్కువ ఒత్తిడిని కలిగించే బౌలర్లకు చాలా ముఖ్యం. ఇక ఈ మధ్య కాలంలో నిత్యం క్రికెటర్లు గాయాలపాలవుతున్నారు. అందుకే గాయాల బారిన పడకుండా జాగ్రత్త పడాలని ప్రతీ క్రికెటర్ ఫీల్డింగ్ చేసే సమయంలో టేప్ ధరిస్తున్నారు.

టేప్ వేసుకునేది అందుకోసమేనా..? 

ఇటీవల ఇంగ్లాండ్ పర్యటనలో టీమిండియా క్రికెటర్లు రిషబ్ పంత్, అర్ష్ దీప్ సింగ్, ఆకాశ్ దీప్ తదితర క్రికెటర్లు గాయాలపాలైన విషయం తెలిసిందే. మరోవైపు ఇంగ్లాండ్ జట్టులో కూడా బెన్ స్టోక్స్, క్రిస్ వోక్స్, ఆర్చర్ వంటి తదితర క్రికెటర్లు గాయాలపాలయ్యారు మనం చూశాం. అలా గాయాలపాలు కాకుండా కాస్త టేప్ వేసుకుంటే ఎంతో కొంత ఆసరగా ఉంటుందని ఇలా టేప్ ధరిస్తుంటారు. ఇలాంటి గాయాలబారిన పడుతారని జాగ్రత్తలు పాటిస్తున్నారు. సెప్టెంబర్ 09 నుంచి ఆసియా కప్ 2025 జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ ఆసియా కప్ లో ఇలాగే గాయాల బారిన పడుతారనే కొందరూ ప్లేయర్లను ఎమర్జెన్సీ కింద ఎక్స్ ట్రా గా ఎంపిక చేశారు. కానీ కీలక ఆటగాళ్లు కొందరినీ ఎంపిక చేయకపోవడంతో నెటిజన్లు సెలక్టర్ల పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రేయస్ అయ్యర్ వంటి కీలక బ్యాట్స్ మెన్ టీ-20 కి పనికిరాడా..? సిరాజ్, వాషింగ్టన్ సుందర్ వంటి బౌలర్లు టీ-20 క్రికెట్ కి పనికి రాారా..? అంటూ నెటిజన్లు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ పై ఫైర్ అవుతున్నారు.

?igsh=b3dvMzdtdHhyOWc=

Related News

RJ Mahvash : శ్రేయాస్ అయ్యర్ అంటే నాకు ప్రాణం.. చాహల్ కు షాక్ ఇచ్చిన RJ మహ్వాష్

Head – Abhishek : అభిషేక్ ఒకలా.. హెడ్ మరోలా.. SRH కు ఎక్కడ దొరికార్రా మీరు..

Harshit Rana : గంభీర్ ఎంతకు తెగించాడు రా.. ఏకంగా హర్షిత్ రాణాకు వైస్ కెప్టెన్సీ?

Vimal Pan Masala : టీమిండియా స్పాన్సర్ గా గుట్కా కంపెనీ.. ఆసియా కప్ కంటే ముందు కీలక పరిణామం!

Watch Video: సిక్స్ కొట్టి గుండెపోటుతో చనిపోయిన క్రికెటర్.. వీడియో చూస్తే దిమ్మతిరగాల్సిందే

Big Stories

×