BigTV English

Head – Abhishek : అభిషేక్ ఒకలా.. హెడ్ మరోలా.. SRH కు ఎక్కడ దొరికార్రా మీరు..

Head – Abhishek : అభిషేక్ ఒకలా.. హెడ్ మరోలా.. SRH కు ఎక్కడ దొరికార్రా మీరు..

Head – Abhishek : సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఈ జట్టు ఇప్పటికే రెండు సార్లు టైటిల్ సాధించింది. మరో రెండు సార్లు రన్నరప్ గా నిలిచింది. ముఖ్యంగా సన్ రైజర్స్ జట్టు ఓపెనర్లు ట్రావిస్ హెడ్(Travis Head), అభిషేక్ వర్మ (Abhishek Sharma) ఆట గురించి దాదాపు అందరికీ తెలిసిందే. వారిద్దరూ మంచి ఫామ్ లో ఉంటే ఏ టీమ్ కు అయినా దడ పుట్టాల్సిందే. వీరిద్దరూ ఓపెనింగ్ జోడీ 10 ఓవర్ల పాటు ఉంటే.. స్కోర్ బోర్డు పరుగులుపెడుతుంది. వీరిద్దరూ సెంచరీ చేశారంటే ఒక్కొక్కరూ ఒక్కో స్టైల్ లో సింబల్స్ చూపిస్తుంటారు. హెడ్ సెంచరీ చేస్తే అతను రెండు లెఫ్ట్ హ్యాండ్ ఫింగర్స్ తో చూపిస్తే.. అభిషేక్ శర్మ కుడిచేతితో సింబల్స్ చూపించడం విశేషం. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరిద్దరు సెంచరీలు చేసినప్పుడు ఇచ్చే సింబల్స్ గురించి వైరల్ అవుతోంది.


Also Read : Harshit Rana : గంభీర్ ఎంతకు తెగించాడు రా.. ఏకంగా హర్షిత్ రాణాకు వైస్ కెప్టెన్సీ?

ఇక విధ్వంసమే.. 


ముఖ్యంగా టీమిండియా జట్టుకి చెందిన భయంకరమైన బ్యాట్స్ మెన్ క్రికెట్ మైదానంలో ఎంత విధ్వంసం సృష్టించాడంటే ప్రత్యర్థి జట్టు బౌలర్లు కూడా దయ వేడుకునే పరిస్థితి కనిపించింది. టీ-20 క్రికెట్ లో 28 బంతుల్లోనే సెంచరీ సాధించి సంచలనం సృష్టించాడు. భారత జట్టుకు చెందిన 24 ఏళ్ల డేంజరస్ ఓపెనర్ అభిషేక్ శర్మ  టీ20 క్రికెట్‌లో ఈ గొప్ప రికార్డును సృష్టించాడు. డిసెంబర్ 5, 2024న మేఘాలయతో జరిగిన సయ్యద్ ముష్తాక్ అలీ టీ20 ట్రోఫీ 2024 టోర్నమెంట్‌లో అభిషేక్ శర్మ 28 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. అభిషేక్ శర్మ 28 బంతుల్లో సెంచరీ సాధించడం ద్వారా టీ20 క్రికెట్ చరిత్రలో ఒక భారతీయుడు చేసిన వేగవంతమైన సెంచరీ రికార్డును సమం చేశాడు. అభిషేక్ శర్మ ఈ ఘనతకు కొన్ని మ్యాచ్‌లకు ముందు, 27 నవంబర్ 2024న, గుజరాత్ బ్యాట్స్‌మన్ ఉర్విల్ పటేల్ త్రిపురపై 28 బంతుల్లో సెంచరీ సాధించాడు. ఈ మ్యాచ్‌లో ఉర్విల్ పటేల్ 35 బంతుల్లో 113 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. ఉర్విల్ పటేల్ ఇన్నింగ్స్‌లో 12 సిక్సర్లు, 7 ఫోర్లు ఉన్నాయి. ఈ కాలంలో ఉర్విల్ పటేల్ స్ట్రైక్ రేట్ 322.85గా ఉంది.

SRH ఓపెనర్స్ రికార్డు.. 

ఉర్విల్ పటేల్ చేసిన ఘనతను అభిషేక్ శర్మ పునరావృతం చేశాడు. మరోవైపు ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్ కూడా సౌతాఫ్రికా పై సంచలన రికార్డు నెలకొల్పాడు. ట్రావిస్ హెడ్ 103 బంతుల్లో 17 ఫోర్లు, 5 సిక్సులతో 142 పరుగులు చేసి చెలరేగాడు. ఓవైపు మార్ష్, మరో వైపు హెడ్ ఒకరి తరువాత మరొకరూ వంతులు వేసుకున్నట్టు వీరంగం సృష్టించారు. ఆస్ట్రేలియా తమ వన్డే చరిత్రలో రెండో అత్యధిక స్కోర్ నమోదు చేసుకుంది. ఒకే జట్టుకు చెందిన ముగ్గురు ప్లేయర్లు సెంచరీలు చేయడం వన్డేల్లో ఇది రెండో సారి మాత్రమే. హెడ్, మార్ష్ తొలి వికెట్ కి 250 పరుగులు జోడించడం విశేషం. మొత్తానికి అభిషేక్ శర్మ, ట్రావిడ్ హెడ్ సెంచరీలు చేసిన తరువాత చూపించే సింబల్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. 

Related News

AFG vs PAK: పాకిస్థాన్ కు షాక్ ఇచ్చిన అప్ఘానిస్తాన్…ద్వైపాక్షిక సిరీస్ లు ర‌ద్దు…షేక్ హ్యాండ్ లు కూడా ర‌ద్దు !

IND VS WI: 518-5 వ‌ద్ద‌ టీమిండియా డిక్లేర్డ్…గిల్ భయంక‌ర సెంచ‌రీ, WTCలో చ‌రిత్ర‌

Rohit Sharma Angry: 10 ఏళ్ల కుర్రాడిపై సెక్యూరిటీ దారుణం..కట్టలు తెంచుకున్న రోహిత్ శ‌ర్మ ఆగ్ర‌హం

Yashasvi Jaiswal Run Out: గిల్ సెల్ఫీష్‌, యశస్వి జైస్వాల్ ర‌నౌట్ పై వివాదం, నాటౌట్ అంటూ!

Eng-W vs SL-W: ఇవాళ శ్రీలంక వ‌ర్సెస్ ఇంగ్లాండ్ ఫైట్‌.. పాయింట్ల ప‌ట్టిక వివ‌రాలు ఇవే

Rohit Sharma Car: రోహిత్ శ‌ర్మ విధ్వంస‌ర బ్యాటింగ్‌..రూ.4.57 కోట్ల కారు ధ్వంసం

Hardik Pandya: ల‌వ‌ర్ ఫోటో లీక్ చేసిన హ‌ర్ధిక్ పాండ్యా…ఇంత‌కీ మహికా శర్మ బ్యాక్ గ్రౌండ్ ఏంటి?

Rohit Sharma Tesla Car: వాడ‌కం అంటే ఎలన్ మస్క్ దే…రోహిత్ శ‌ర్మ‌ కారు నంబ‌ర్ వెనుక సీక్రెట్

Big Stories

×