Hardik Pandya GirlFriend: టీమిండియా డేంజర్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అద్భుతమైన ఆట ప్రదర్శనతో టీమిండియాకు ఎన్నో విజయాలు అందించిన హార్దిక్ పాండ్యా, ఇటీవల గాయం కారణంగా జట్టుకు దూరమయ్యాడు. అయితే టీమిండియాకు దూరమైన హార్దిక్ పాండ్యా తన కొత్త ప్రియురాలితో అడ్డంగా దొరికిపోయాడు. ఇప్పటికే తన భార్య నటాషా స్టాంకోవిక్ కు విడాకులు ఇచ్చిన హార్దిక్ పాండ్యా, ఈ తర్వాత మోడల్ జాస్మిన్ వాలియా అనే అమ్మాయితో తెగ తిరిగేసాడు. ఆమెను దుబాయ్‌కి కూడా తీసుకెళ్లాడు. అయితే ఏమైందో తెలియదు గానీ ఇప్పుడు ఆమెను వదిలేసి, మోడల్ మహిక శర్మతో మెరిశాడు. వీళ్ళిద్దరూ తాజాగా ముంబై విమానాశ్రయంలో కెమెరా కంటపడ్డారు. మోడల్ మహికా శర్మతో పాండ్యా చాలా క్లోజ్ గా కనిపించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. దీంతో కొత్త పిల్లను పాండ్యా పట్టాడురో అంటున్నారు నెటిజన్స్.
Also Read: IND-W vs SA-W: కొంపముంచిన హర్మన్.. దక్షిణాఫ్రికా విక్టరీ..పాయింట్ల పట్టికలో టీమిండియా సేఫ్
టీమిండియా స్టార్ క్రికెటర్ హార్దిక్ పాండ్యా గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. హార్దిక్ పాండ్యా క్రికెట్ చరిత్రలో ఎన్నో అద్భుతాలు సృష్టించాడు. క్రికెట్ పరంగా తన లైఫ్ సక్సెస్ ఫుల్ గా కొనసాగిస్తున్నాడు. ఇక హార్దిక్ పాండ్యా వ్యక్తిగత విషయానికి వచ్చినట్లయితే తన మొదటి భార్య నటాషా స్టాంకోవిక్ నుంచి విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ జంట ప్రేమించుకుని కుటుంబ సభ్యుల అంగీకారంతో అంగరంగ వైభవంగా వివాహం చేసుకున్నారు. వీరికి ఓ కుమారుడు కూడా ఉన్నాడు. అయినప్పటికీ అతి తక్కువ సమయంలోనే ఈ జంట మనస్పర్ధల కారణంగా విడిపోయారు.
విడాకుల విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రతి ఒక్కరికి షేర్ చేసుకున్నారు. విడిపోయినప్పటికీ తమ కుమారుడు అగస్త్యకు కో పేరెంట్స్ గా ఉంటామని వెల్లడించారు. విడాకుల అనంతరం తన కుమారుడిని తీసుకొని నటాషా సెర్బియాకు వెళ్ళిపోయింది. అప్పుడప్పుడు తిరిగి ఇండియాకు తిరిగి వస్తూ ఉంటుంది. ఆ సమయంలో తన కుమారుడిని హార్దిక్ పాండ్యా వద్దకు పంపుతూ ఉంటుంది. ఇక హార్దిక్ పాండ్యా విడాకుల అనంతరం కొంతమంది హీరోయిన్లతో ఎఫైర్ నడిపిస్తున్నట్లుగా అనేక రకాల రూమర్లు వచ్చాయి.
హార్దిక్ పాండ్యా తాజాగా మరో అమ్మాయితో కనిపించాడు. ఆమెతో చెట్టాపట్టాలెసుకుని తిరుగుతున్నాడు.
తన మొదటి భార్య నటాషా స్టాంకోవిక్ నుంచి విడిపోయిన తర్వాత మోడల్ జాస్మిన్ వాలియాతో హార్దిక్ రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. కొన్ని అనివార్య కారణాల వల్ల, జాస్మిన్‌తో హార్దిక్ విడిపోయినట్లు సమాచారం అందుతోంది. ఈ క్రమంలో తాజాగా మోడల్ మహికా శర్మతో కలిసి కనిపించాడు. తాజాగా ముంబై విమానాశ్రయంలో మహికాతో కనిపించడంతో ఇద్దరి మధ్య రిలేషన్ నడుస్తున్నట్లు పుకార్లు బయటకు వస్తున్నాయి.
Also Read: MS Dhoni: CSK ఫ్యాన్స్ కు ధోని గుడ్ న్యూస్….రూ.325 కోట్లతో భారీ స్కెచ్, కాళ్లు మొక్కిన కుర్రాడు
మరో అమ్మాయితో కనిపించిన హార్దిక్ పాండ్యా
మొదటి భార్య నటాషా స్టాంకోవిక్ నుంచి విడిపోయిన తర్వాత మోడల్ జాస్మిన్ వాలియాతో హార్దిక్ రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు
తాజా పరిణామాలతో జాస్మిన్‌తో హార్దిక్ విడిపోయినట్లు సమాచారం
ఈ క్రమంలో తాజాగా మోడల్ మహికా శర్మతో కలిసి కనిపించిన పాండ్యా… pic.twitter.com/kS5mufK2qN
— BIG TV Breaking News (@bigtvtelugu) October 10, 2025