Ritika Sajdeh: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కు అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది రోహిత్ శర్మ సతీమణి రితికా సజ్జే ( Ritika Sajdeh). తన మొగుడు బాగా క్రికెట్ ఆడతాడని గుర్తు చేస్తూ ఓ పోస్ట్ పెట్టింది. నీ కండ్లు దొబ్బితే, సరిగ్గా అద్దాలు పెట్టి చూసుకో అంటూ గంభీర్ కు పరోక్షంగా రితికా కౌంటర్ ఇచ్చినట్టు చెబుతున్నారు. ఇటీవల రోహిత్ శర్మను కెప్టెన్సీ నుంచి తొలగించిన నేపథ్యంలో గౌతమ్ గంభీర్ పై అనేక విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలోనే గౌతమ్ గంభీర్ కు మండిపోయేలా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది రోహిత్ శర్మ భార్య రితికా. దీంతో రితికా పెట్టిన పోస్టు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది.
Also Read: MS Dhoni: CSK ఫ్యాన్స్ కు ధోని గుడ్ న్యూస్….రూ.325 కోట్లతో భారీ స్కెచ్, కాళ్లు మొక్కిన కుర్రాడు
టీమిండియా వన్డే మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రాక్టీస్ బాగా చేస్తున్నాడు. అతి త్వరలోనే టీమిండియాలోకి సాధారణ ప్లేయర్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు రోహిత్ శర్మ. వన్డే కెప్టెన్సీ తొలగిపోయిన తర్వాత ఆస్ట్రేలియా టూర్ కు సిద్ధమవుతున్నాడు. టీమిండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య టూర్ ఈ నెల 19వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. ఇలాంటి నేపథ్యంలో నెట్స్ లో బాగా ప్రాక్టీస్ చేస్తున్నాడు. చాలా రోజుల తర్వాత బ్యాట్ పట్టిన రోహిత్ శర్మ, ఆస్ట్రేలియాకు చుక్కలు చూపేలా ప్రాక్టీస్ చేస్తున్నాడు. ముంబైలోని శివాజీ పార్క్ లో దాదాపు 5 గంటల పాటు చెమటోడ్చాడు రోహిత్ శర్మ. దీనికి సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
ముంబైలో రోహిత్ శర్మ ప్రాక్టీస్ చేస్తున్న నేపథ్యంలో సోషల్ మీడియాలో ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి. దీంతో వెంటనే యాక్టివ్ అయిన రోహిత్ శర్మ భార్య రితికా ( Ritika Sajdeh) కూడా ఆ ఫోటోలను షేర్ చేశారు. తన భర్త గ్రౌండ్ లో అద్భుతంగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాడని పోస్ట్ పెట్టింది. రోహిత్ శర్మ బ్లాక్ డ్రెస్ వేసుకొని ఆడుతున్న ఫోటోలను షేర్ చేసింది. అయితే ఇలా రోహిత్ శర్మ ప్రాక్టీస్ చాలా సార్లు చేశారు. ఎప్పుడూ ఇలా పెట్టని రితికా, ఇప్పుడు మాత్రం పోస్ట్ పెట్టి గౌతమ్ గంభీర్ కు కౌంటర్ ఇచ్చిందని అంటున్నారు. రోహిత్ శర్మ కెప్టెన్సీ తొలగించడంపై రితికా తన స్టైల్ లో స్పందించిందని కామెంట్స్ చేస్తున్నారు. నువ్వు కెప్టెన్సీ పీకి పారేస్తే, నా భర్త ఊరుకుంటాడా? ఇప్పుడు ప్రాక్టీస్ చేస్తున్నాడు. రేపు ఆస్ట్రేలియా గడ్డపై చుక్కలు చూపిస్తాడు అంటూ గంభీర్ కు పరోక్షంగా వార్నింగ్ ఇచ్చేలా రితికా పోస్ట్ పెట్టిందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: IND-W vs SA-W: కొంపముంచిన హర్మన్.. దక్షిణాఫ్రికా విక్టరీ..పాయింట్ల పట్టికలో టీమిండియా సేఫ్
RITIKA SAJDEH INSTAGRAM STORY FOR ROHIT SHARMA IN PRACTICE SESSION. ♥️🥹 pic.twitter.com/HqFTxkyRD1
— Tanuj (@ImTanujSingh) October 10, 2025