Bigg Boss 9 Telugu : బిగ్ బాస్.. ఈపేరు జనాల నోటి నుంచి ఎక్కువగా వినిపిస్తుంది.. ప్రస్తుతం తెలుగులో సీజన్ 9 జరుగుతుంది. గతంలో లాగా ఒక కామన్ మ్యాన్ కాకుండా ఈసారి ఏకంగా ఆరుగురిని హౌస్ లోకి దింపారు. మొదట ఆకట్టుకున్న ఈ షో ఆ మధ్య డల్ అయ్యింది. వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి ఎప్పుడైతే కొత్త వాళ్లు వచ్చారో అప్పటినుంచి గొడవలు మొదలయ్యాయి. ఆ తర్వాత 11 వారాలు పూర్తి అయిన కూడా గొడవలు తగ్గలేదు. ప్రస్తుతం 12 వ వారంలోకి అడుగు పెట్టింది.. ఇప్పుడు సోషల్ మీడియాలో బిగ్ బాస్ గురించి కొత్త న్యూస్ ప్రచారంలో ఉంది. అదేంటంటే ఈ సీజన్ కు విన్నర్ కళ్యాణ్ అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మొన్నటివరకు పవన్ పేరు వినిపించింది. కానీ ఇప్పుడేమో ఓటింగ్ రివర్స్ అవ్వడంతో విన్నర్ మారిపోయాడు. ఇక తాజాగా మరో న్యూస్ సోషల్ మీడియాలో వినిపిస్తుంది. చివరి టాప్ లో ఉన్న ఇమ్మానుయేల్ బిగ్ బాస్ ఆఫర్ ను తీసుకున్నట్లు తెలుస్తుంది. అదేంటో వివరంగా తెలుసుకుందాం..
జాక్ పాట్ కొట్టేసిన ఇమ్మానుయేల్..
బిగ్ బాస్ చివరి దశకు వచ్చేసింది. ప్రస్తుతం హౌస్‌లో 9 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. మూడే వారాలు మిగిలింది.. దీంతో విన్నర్ ఎవరవుతారు అనే ఆసక్తి జనాల్లో పెరుగుతుంది. ఫైనల్‌గా గ్రాండ్ ఫినాలే నాటికి ఐదుగురు కంటెస్టెంట్స్ టాప్ 5కి వెళ్తారు. వాళ్లలో ఒకరు విన్నర్, ఒకరు రన్నర్ కాబోతున్నారు.. విన్నర్ కు 50 లక్షలు ప్రైజ్ మనీతో పాటుగా కొన్ని బహుమతులు కూడా ఉంటాయి. అదే విధంగా టాప్ 5 లోని ఒకరికి మనీ ఆశ చూపించి ఒకరిని బయటకు తీసుకొని వస్తారు. అలాగే ఈ సీజన్ ఇమ్మానుయేల్ జాక్ పాట్ కొట్టేసినట్లు తెలుస్తుంది. ఇమ్మానుయేల్ నామినేషన్స్‌లోకి రాకపోవడం వల్ల.. తనూజ, కళ్యాణ్‌లకంటే బెటర్‌గా పెర్ఫామ్ చేస్తున్నా మూడో స్థానంలో ఉన్నాడు. మరి అతనే ఆ ప్రైజ్ మనీని తీసుకోబోతున్నాడని టాక్. దీనిపై త్వరలోనే ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి..
బిగ్ బాస్ చివరి దశకు వచ్చేసింది. ప్రస్తుతం హౌస్‌లో 9 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. మూడే వారాలు మిగిలింది.. దాంతో విన్నర్ ఎవరు అవుతారు? రన్నర్ గా ఎవరు నిలుస్తారు అన్నది ఆసక్తిగా మారుతుంది. ఇంకా చెప్పాలంటే.. తనూజ, కళ్యాణ్.. ఈ ఇద్దరిలోనే బిగ్ బాస్ విన్నర్ ఉండబోతున్నాడనే విషయం ఇప్పటికే తేలిపోయింది. గత కొన్ని వారాలుగా చూస్తున్న ఓటింగ్ లో వీరిద్దరే టాప్ లో ఉన్నారు. అయితే కళ్యాణ్ ను గెస్తాడని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. చివరికి ఎవరు ట్రోఫీని అందుకుంటారో తెలియాలంటే చివరి ఎపిసోడ్ వరకు మిస్ అవ్వకుండా చూడాల్సిందే..
Also Read :సోహెల్ ఇజ్జత్ తీసిన బిగ్ బాస్..ఇంత కక్కుర్తి ఏంటి భయ్యా.. రచ్చ రచ్చే..
గత వారం బిగ్ బాస్ పవర్ అస్త్ర వాడటంతో నో ఎలిమినేషన్ చేశారు. 12 వ వారం మాత్రం బిగ్ బాస్ ట్విస్ట్ ఇవ్వబోతున్నాడని టాక్.. మరో ఇద్దరు ఎలిమినేట్ అవుతారని టాక్.. గత వారం సేఫ్ అయిన ఇద్దరు బయటకు రాబోతారా? వేరే వాళ్లు ఎలిమినేట్ అవుతారా చూడాలి..