BigTV English

Rohit Sharma Injury : రోహిత్ శర్మకు గాయమా..? ఫ్యాన్స్ లో ఆందోళన..

Rohit Sharma Injury : రోహిత్ శర్మకు గాయమా..? ఫ్యాన్స్ లో ఆందోళన..

Rohit Sharma Injury: వన్డే వరల్డ్ కప్ 2023లో భారత్ ఒక్కటే.. ఏ ఓటమీ ఎరుగకుండా అప్రతిహితంగా దూసుకుపోతోంది. మరిప్పుడు ఆ దూకుడు కొనసాగిస్తుందా? లేదంటే ఇంగ్లండ్ కు తలొగ్గుతుందా? అనేది తేలిపోతుంది.


లఖ్ నవూ(లక్నో) వేదికగా జరిగే మ్యాచ్ కి ముందు ఇరుజట్లు ముమ్మర ప్రాక్టీస్ చేశాయి. ఈ సందర్భంగా కెప్టెన్ రోహిత్ శర్మ చేతికి గాయమైనట్టు వార్తలు వచ్చాయి. దీంతో తను మ్యాచ్ లో ఆడతాడా? లేకపోతే కేఎల్ రాహుల్ కెప్టెన్ గా ఉంటాడా? అన్నది తెలీదు. కెప్టెన్ కి గాయం కాగానే హడావుడిగా ఫిజియో థెరపిస్టులు వచ్చి పరీక్షలు చేశారు.

రోహిత్ మ్యాచ్ కి ఫిట్ గా ఉన్నాడా? లేదా? అనేది ఇంకా తెలీలేదు. ఇండియా మంచి దూకుడు మీద ఉండటం ఒక వైపు సంతోషంగా ఉంటే, మరోవైపు గాయాల బెడద భారత్ జట్టుని పట్టి పీడిస్తోంది. మొదట్లోనే ఓపెనర్ శుభ్ మన్ గిల్ వైరల్ ఫీవర్ తో బాధపడుతూ రెండు మ్యాచ్ లకు దూరంగా ఉండిపోయాడు. తర్వాత హార్దిక్ పాండ్యా తీవ్రంగా గాయపడటంతో తనింకా జట్టుకి దూరంగానే ఉన్నాడు.


సెమీస్ కైనా వస్తాడా? రాడా? అనేది అనుమానమేనని చెబుతున్నారు. ఇకపోతే ఇప్పుడు కెప్టెన్ రోహిత్ గాయపడ్డాడని అంటున్నారు. అదింకా కన్ ఫర్మ్ చేయలేదు. ఇకపోతే ఆల్రెడీ సూర్యకుమార్ యాదవ్ కూడా గాయపడి తిరిగి కోలుకున్నాడు. ఇంత పెద్ద మెగా టో్ర్నమెంట్ పెట్టుకుని మనవాళ్లు గాయాలబారిన పడటం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది.

వన్డే వరల్డ్ కప్ 2023లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్ ప్రదర్శన అత్యంత పేలవంగా ఉంది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానానికి వెళ్లిపోయింది. దీంతో ఆ దేశంలో ప్రజలే కాదు మాజీలు కూడా తీవ్రంగా జట్టుని దుయ్యబడుతున్నారు. మానసికంగా దెబ్బతినడం వల్లే ఆ జట్టు ప్రదర్శన ఇలా ఉందని కొందరు చెబుతున్నారు. మరి ఆ కసినంతా ఇండియా మీదగాని తీర్చుకోదు కదా.. అని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

ఏదేమైనా టోర్నమెంట్ నుంచి ఇంటికి వెళ్లడం పక్కా అయిపోయింది కాబట్టి.. ఇప్పుడు ఇంగ్లండ్ పరువు కోసం ఆడుతుంది. అందువల్ల చావో రేవో అన్నట్టే ఆడుతుంది. ఈ దశలో ఇండియాను గాయాల బెడద పట్టి పీడిస్తోంది. మరి మ్యాచ్ లో ఇండియా ఏ మేరకు రాణిస్తారో వేచి చూడాల్సిందే.

Related News

Dhoni on Virat : కోహ్లీ పెద్ద జోకర్.. ధోని హాట్ కామెంట్స్ వైరల్!

Night watchman : టెస్ట్ క్రికెట్ లో అసలు నైట్ వాచ్మెన్ అంటే ఎవరు.. వాళ్ల డ్యూటీ ఏంటి

Shreyas Iyer: శ్రేయస్‌కు మరోసారి నిరాశే.. ఆసియా కప్‌ జట్టులో నో ఛాన్స్ ?

BCCI : రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలకు BCCI బిగ్ షాక్…2027 వరల్డ్ కప్ కంటే ముందే కుట్రలు !

Sanju Samson – CSK : సంజూకు ఝలక్.. CSK లోకి అతను వచ్చేస్తున్నాడు!

Digvesh Rathi : దిగ్వేష్ ఒక్కడే పిచ్చోడు అనుకున్నాం.. కానీ వాడిని మించినోడు వచ్చాడు.. ఈ వీడియో చూస్తే పిచ్చెక్కి పోవాల్సిందే

Big Stories

×