Jannik Sinner out from Paris Olympics 2024: పారిస్ ఒలింపిక్స్-2024 క్రీడా సంబరానికి అంతా రెడీ అయ్యింది. శుక్రవారం సాయంత్రం ప్రారంభ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు అంతా సిద్ధమైంది. ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల నుంచి దాదాపు 10 వేల మంది క్రీడాకారులు సమరానికి సై అంటున్నారు. ఇప్పటికే ఆటగాళ్లంతా పారిస్‌కు చేరుకున్నారు.
మరో రెండు రోజుల్లో పోటీలు ప్రారంభకానుండగా టెన్నిస్‌కు దూరమయ్యాడు ఇటలీకి చెందిన ప్రపంచ నెంబర్ ఆటగాడు జన్నిక్ సిన్నర్. టాన్సిల్స్ కారణంగా మెగా టోర్నీకి హాజరుకావడం లేదని ప్రకటించాడు. దీంతో టెన్నిస్ అభిమానులు షాకయ్యారు.
తన దేశం తరఫున ప్రాతినిధ్యం వహించలేకపోతున్నందుకు బాధగా ఉందన్నాడు. అంతేకాదు ఇటలీకి చెందిన అథ్లెట్లకు ఇంటి నుంచే సపోర్ట్ చేస్తానని మనసులోని మాట బయటపెట్టాడు. గురువారం నుంచి టెన్నిస్ ఆటగాళ్లకు సంబంధించి ఒలింపిక్స్‌లో డ్రా తీస్తున్నారు. సిన్నర్ ముందుగానే సమాచారం ఇచ్చాడు. ఎలాగైనా బంగారు పతకం కన్నేసిన సిన్నర్ చివరకు టోర్నీ నుంచి డ్రాపయ్యాడు.
ALSO READ: ఒలింపిక్స్ నుంచి ఈసారి మెడల్స్ తెచ్చేదెవరు.?
సిన్నర్ సింగిల్స్ మాత్రమే డబుల్స్ కూడా ఆడుతాడు. ఈ ఏడాది వింబుల్డన్ టోర్నీ క్వార్టర్ ఫైనల్‌లో రష్యాకు చెందిన మెద్విదేవ్ చేతిలో ఓటమి పాలయ్యాడు. అంతకుముందు జరిగిన ఫ్రెంచ్ ఓపెన్‌లో అల్కరాస్ చేతితో సిన్నర్ సెమీస్‌లో ఓడిపోయాడు. ఈ ఏడాది ఆరంభంలో ఆస్ట్రేలియా ఓపెన్‌లో మెద్విదేవ్‌ను ఓడించి టైటిల్ సొంతం చేసుకున్నాడు సిన్నర్.