BigTV English

Ellyse Perry: కారు అద్దం పగులకొట్టేశారు.. రాయల్ ఛాలెంజర్స్ అద్భుత విజయం

Ellyse Perry: కారు అద్దం పగులకొట్టేశారు.. రాయల్ ఛాలెంజర్స్ అద్భుత విజయం

 


latest sports news today

Ellyse Perry smash a car window with her six in the WPL: కొడితే కొట్టాలి రా సిక్స్ కొట్టాలి…అనే పాట అందరూ వినే ఉంటారు. అలాంటి సిక్సరే ఒకటి అమ్మాయి కొట్టింది. అబ్బాయిల దిమ్మ దిరిగేలా కొట్టిన సిక్సర్ ఎళ్లెళ్లి గ్రౌండ్ లో పడింది. అయితే పడటం ఎలా పడిందంటే అక్కడ పెట్టిన కొత్త కారు అద్దంపై పడింది. దాంతో అది భళ్లుమని పగిలిపోయింది.  ఇది చూసి స్టేడియమంతా ఒకటే చప్పట్లు…హడావుడి…


ఇంతకీ సిక్సర్ కొట్టిన ఆర్సీబీ ప్లేయర్ ఎల్లీస్ పెర్రీ మాత్రం అయ్యో అని తలపట్టుకుంది. కానీ ధనాధన్ బ్యాటింగ్ తో మెరుపులు మెరిపించింది. వుమెన్స్ ప్రీమియర్ లీగ్(డబ్ల్యూపీఎల్) 2024లో భాగంగా యూపీ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎల్లిస్ పెర్రీ(37 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 58)హాఫ్ సెంచరీతో రాణించింది.

ప్రమోషన్‌లో భాగంగా టైటిల్ స్పాన్సర్ టాటా కంపెనీకి చెందిన పంచ్ కారుకు గట్టి పంచ్ పడింది. దీనిని మైదానంలో ప్రదర్శనకు పెట్టారు. దీంతో ఒక్కసారి అద్దాలు పగలడమే కాదు, కారు కి కూడా ఫ్రీ పబ్లిసిటీ వచ్చేసింది. యూపీ వారియర్స్ బౌలర్  దీప్తి శర్మ వేసిన 19వ ఓవర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ మ్యాచ్ లో ఆర్సీబీ 23 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Read More: కోచ్ అనేవాడు అలా అనకూడదు: దినేశ్ కార్తీక్

ఆర్సీబీ కెప్టెన్ స్మృతి మంధాన 50 బంతుల్లో 80 పరుగులు చేసింది. ఇందులో 10 ఫోర్లు, 3 సిక్సులు ఉన్నాయి. ఆస్ట్రేలియాకు చెందిన ఎల్లీస్ పెర్రీ, స్మృతి  ఇద్దరూ కలిసి చుక్కలు చూపించారు. దీంతో ఆర్సీబీ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది.

యూపీ బౌలర్లలో తెలుగు బౌలర్ అంజలి శర్వాణి, దీప్తి శర్మ, సోఫీ ఎక్లేస్టోన్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యఛేదనకు దిగిన యూపీ వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 175 పరుగులే చేసి ఓటమిపాలైంది.  కెప్టెన్ అలిస్సా 55 పరుగులు చేసింది. తర్వాత దీప్తి శర్మ 33, పూనమ్ 31 చేశారు గానీ ఫలితం లేకుండా పోయింది. టార్గెట్ పెరిగిపోవడంతో ఒత్తిడిలో వికెట్లు పారేసుకున్నారు.

Related News

Rahul Dravid : రాహుల్ ద్రావిడ్ ఎప్పుడైనా సిక్స్ లు కొట్టడం చూశారా.. ఇదిగో వరుసగా 6,6,6… వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే

Mohammed Siraj : ప్రియురాలితో రాఖీ కట్టించుకున్న టీమిండియా ఫాస్ట్ బౌలర్!

Free Hit : ఇకపై వైడ్ బాల్ కు కూడా Free Hit ఇవ్వాల్సిందే.. ఎప్పటినుంచి అంటే ?

Sanju Samson : ఆ 14 ఏళ్ల కుర్రాడి వల్లే….RR నుంచి సంజూ బయటకు వెళ్తున్నాడా!

Akash deep Car : రక్షాబంధన్… 50 లక్షల కారు గిఫ్ట్ ఇచ్చిన టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఆకాష్

RCB – Kohli: ఛత్తీస్‌గఢ్ బుడ్డోడికి కోహ్లీ, డివిలియర్స్ కాల్స్.. రజత్ ఫోన్ దొంగతనం చేసారా ?

Big Stories

×