E-Paper
Advertisement

Ranji Trophy: కోచ్ అనేవాడు అలా అనకూడదు: దినేశ్ కార్తీక్

Ranji Trophy: కోచ్ అనేవాడు అలా అనకూడదు: దినేశ్ కార్తీక్
Advertisement

 

Karthik
 

Dinesh Karthik Fires on Tamil Nadu Coach: రంజీ సెమీఫైనల్ మ్యాచ్ ముంబై వర్సెస్ తమిళనాడు మధ్య జరిగిందనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇందులో తమిళనాడు ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో తమిళనాడు కోచ్ సులక్షణ్ కులకర్ణికి పట్టరాని ఆగ్రహం వచ్చింది. మ్యాచ్ లో టాస్ కీలకం అని చెబుతూనే ఉన్నాను. బొంబాయి పిచ్ సంగతి నాకు తెలుసు, చిలక్కి చెప్పినట్టు చెప్పాను, అయినా కెప్టెన్ ‘సాయి కిషోర్ వినలేదు, ఈ ఓటమికి తనదే బాధ్యతని  ఆగ్రహం వ్యక్తం చేశాడు.

Advertisement

ఈ మాటలపై మాజీ టీమ్ ఇండియా క్రికెటర్ దినేశ్ కార్తీక్ స్పందించాడు. కోచ్ అనేవాడు అలా మాట్లాడకూడదని వార్నింగ్ ఇచ్చాడు. నువ్వసలు కోచ్ వేనా? అని ప్రశ్నించాడు. కోచ్ కి ఉండాల్సిన లక్షణాలు ఒక్కటీ కూడా నీలో లేవని తెలిపాడు. ఒక కెప్టెన్ ని పట్టుకుని అన్ని మాటలంటావా? అని సీరియస్ అయ్యాడు. ఏడేళ్ల తర్వాత తమిళనాడు జట్టుని సెమీ ఫైనల్ వరకు తీసుకొచ్చిన కెప్టెన్ ని అభినందించాల్సింది పోయి, ఇలాగేనా మాట్లాడేది అని అన్నాడు.

Read more: కొత్త సీజన్.. కొత్త పాత్ర.. ధోనీ పోస్ట్ వైరల్..

Advertisement

మ్యాచ్ లో ఎన్నో జరుగుతుంటాయి. ఇది ఒక్కరి ఆట కాదు, 11మంది కలిసి ఆడాలి. ఒకవేళ నువ్వు చెప్పినట్టే మొదట బౌలింగు తీసుకుని, తర్వాత మ్యాచ్ ఓడిపోయి ఉంటే, ఏం చేసేవాడివి, అప్పుడు నిందని నీపై వేసుకునే వాడివా? అన్నాడు. నాయకుడికి నాయకత్వ లక్షణాలుండాలి. తన కింద వాళ్లు తప్పు చేస్తే, ఆ బాధ్యత తనపై వేసుకోవాలని అన్నాడు.

రంజీ సెమీస్  తొలి ఇన్నింగ్స్ లో తమిళనాడు 146 పరుగులకే ఆలౌట్ అయ్యింది. తర్వాత ముంబాయి పరిస్థితి కూడా అలాగే ఉంది కాని, టెయిల్ ఎండర్లను వీళ్లు ఆలౌట్ చేయలేకపోయారు. శార్దూల్ ఠాకూర్ సెంచరీతో బొంబాయి కోలుకుని 353 పరుగులు చేసింది.

తర్వాత తమిళనాడు రెండో ఇన్నింగ్స్ లో 164 పరుగులకే ఆలౌట్ అయ్యింది. ఫలితంగా ఇన్నింగ్స్ 70 పరుగుల తేడాతో పరాజయం పాలైంది. దీంతో హర్ట్ అయిన కోచ్ ఏం చేశాడంటే అయిపోయిన పెళ్లికి హిందుస్తాని మేళం వాయించాడు. అని నెటిజన్లు కామెంట్లు పెట్టడం మొదలెట్టారు.

Related News

ఇమామ్ ఉల్ హక్ పెద్ద ద‌ద్ద‌మ్మ‌…త‌న‌ మామ లాగా బ‌ద్ధ‌క‌స్తుడే

టీమిండియా ఓట‌మిని శాసించిన‌ సామ్‌ కర్రన్..అత‌ను వేసిన మూన్ బాల్స్ కొంప‌ముంచాయి

లార్డ్స్ వన్డేలో బాల్ టాంపరింగ్…శ్రేయస్ అయ్యర్ పై బ్యాన్?

లార్డ్స్ నుంచి అలిగి ఇంటికి వెళ్లిపోయిన గంభీర్..?

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ లో వాడిన‌ బంతుల్లో చిప్స్…షాకింగ్ వీడియో వైర‌ల్ !

టైటిల్ గెల‌వ‌గానే త‌ల‌కెక్కిన పొగ‌రు..ట్రంప్ ను తోసేసి, స్పెయిన్ ఓవ‌రాక్ష‌న్‌

గోల్ కీపర్ మార్టినెజ్ ఒక్క‌డు లేక‌పోతే…10-0 తేడాతో అర్జెంటీనా ఓడిపోయేది

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

Big Stories

Advertisement
×