Big Stories

Yashasvi Jaiswal : చిన్న వయసులో డబుల్ సెంచరీ చేసిన.. మూడో బ్యాటర్ జైశ్వాల్

Yashasvi Jaiswal

Yashasvi Jaiswal : యువ సంచలనం యశస్వి జైశ్వాల్ చేసిన డబుల్ సెంచరీతో ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా అతి చిన్న వయసులో డబుల్ సెంచరీ సాధించిన మూడో భారత బ్యాటర్ గా రికార్డ్ సృష్టించాడు. ఇంతకు ముందు వినోద్ కాంబ్లీ (21 ఏళ్ల 35 రోజులు), సునీల్ గవాస్కర్ (21 ఏళ్ల 283 రోజులు) ఉన్నారు. జైశ్వాల్ 22 ఏళ్ల 37 రోజుల్లో ఈ ఘనత సాధించాడు. ఇందులో వినోద్ కాంబ్లీపై రెండు డబుల్ సెంచరీలున్నాయి. 21 ఏళ్ల వయసులోనే తను వాటిని సాధించాడు.

- Advertisement -

యశస్వి సిక్సర్ తో సెంచరీ సాధిస్తే, డబుల్ సెంచరీని కూడా అదే రీతిలో సాధించాడు. 193 పరుగుల వద్ద ఒక సిక్స్ కొట్టి, వెంటనే రెండో బాల్ ఫోర్ కొట్టి, డబుల్ సెంచరీని ఘనంగా పూర్తి చేశాడు. ఇలా సిక్సర్లతో సెంచరీలు సాధించిన ఇండియన్ క్రికెటర్ల లిస్టులోకి తను కూడా చేరాడు. ఈ లిస్ట్ చాలా పెద్దదే ఉంది. దాదాపు చాలామంది సిక్సర్లతో సెంచరీలు, డబుల్ సెంచరీలు చేశారు. వీరేంద్ర సెహ్వాగ్ మాత్రం త్రిబుల్ సెంచరీని మూడు సందర్భాల్లో సిక్సర్లు, ఫోర్లతో ముగించడం విశేషం.

- Advertisement -

భారత్ నుంచి డబుల్ సెంచరీ సాధించిన ఎడమచేతి ఆటగాళ్లలో నాల్గవ వాడిగా యశస్వి ఉన్నాడు. ఇంతకు ముందు సౌరభ్ గంగూలి, వినోద్ కాంబ్లీ,  గౌతమ్ గంభీర్ తనకన్నా ముందున్నారు.

అయితే తక్కువ ఇన్నింగ్స్ లో డబుల్ సెంచరీ సాధించిన ఆరో బ్యాటర్ గా యశస్వి నిలిచాడు. తను 10వ ఇన్నింగ్స్ లోనే ఈ ఫీట్ సాధించాడు. తనకన్నా ముందు కరుణా నాయర్ మూడో ఇన్నింగ్ లోనే చేస్తే, వినోద్ కాంబ్లీ 4 ఇన్నింగ్ లో చేశాడు. గవాస్కర్, మయాంక్ అగర్వాల్ 8వ ఇన్నింగ్ లో చేస్తే, పుజారా 9వ ఇన్నింగ్ లో డబుల్ సెంచరీ మార్క్ అందుకున్నారు.

290 బంతుల్లో 19 ఫోర్లు, 7 సిక్సర్ల సాయంతో  209 పరుగులు చేసి టెస్ట్ కెరీర్ లో తొలి డబుల్ సెంచరీ అందుకున్నాడు. 

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News