BigTV English

Ind Vs Eng 2nd Test : జైస్వాల్ డబుల్ సెంచరీ.. టీమిండియా ఆలౌట్..

Ind Vs Eng 2nd Test : జైస్వాల్ డబుల్ సెంచరీ.. టీమిండియా ఆలౌట్..

Ind Vs Eng 2nd Test : విశాఖపట్నం టెస్టులో యశస్వి జైస్వాల్ అద్భుతంగా ఆడాడు. డబుల్ సెంచరీతో అదరగొట్టాడు. 209 పరుగులు చేసి జట్టు స్కోర్ 383 పరుగుల వద్ద 8వ వికెట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత మరో 13 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయ్యింది. భారత్ జట్టు తొలి ఇన్నింగ్స్ 396 పరుగుల వద్ద ముగిసింది.


ఓవర్ నైట్ స్కోర్ 336/6తో రెండోరోజు తొలి ఇన్నింగ్స్ ను కొనసాగించిన భారత్ తొలుత రవిచంద్రన్ అశ్విన్ (20) వికెట్ ను కోల్పోయింది. 7వ వికెట్ కు జైస్వాల్ , అశ్విన్ 34 పరుగులు జోడించారు. 8వ వికెట్ కు 19 పరుగులు జోడించిన తర్వాత జైస్వాల్ పోరాటం ముగించింది. ఆ తర్వాత మరో 12 పరుగులు జోడించిన తర్వాత బుమ్రా (6) అవుట్ అయ్యాడు. వెంటనే ముఖేశ్ కుమార్ (0) డకౌట్ అయ్యాడు. కులీదీప్ యాదవ్ (8 నాటౌట్) అజేయంగా నిలిచాడు.

ఇంగ్లాండ్ బౌలర్లలో వెటరన్ పేసర్ జేమ్స్ అండర్సన్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. 40 ఏళ్లు దాటినా సత్తా చాటుతున్నాడు. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 3 వికెట్లు పడగొట్టాడు. అరంగేట్రం స్పిన్నర్ షోయబ్ బషీర్ 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నాడు. మరో యువ స్పిన్నర్ రెహాన్ అహ్మద్ కూడా 3 వికెట్లు పడగొట్టాడు. తొలి టెస్టులో అద్భుతంగా బౌలింగ్ చేసిన టాప్ హర్ట్ లీకి మాత్రం ఒక వికెటే దక్కింది.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×