Yashvir Goud Clarified Celebrations In Front Of Hamza: ఆసియా కప్ అండర్ 19 2026 టోర్నమెంట్ ఫైనల్ మ్యాచ్ లో (Under-19 Asia Cup 2026 Tournament Finals) టీమిండియా విక్టరీ అందుకుంది. ఈ క్రమంలో టీమిండియా కుర్రాళ్ళు అగ్రిసివ్ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ముఖ్యంగా పాకిస్తాన్ వికెట్ కీపర్ హంజా జహూర్ (Hamza Zahoor) ముందు యశ్వీర్ గౌడ్ (Yashveer Goud) హద్దులు దాటి ప్రవర్తించాడు. దీనిపై సోషల్ మీడియాలో విపరీతంగా విమర్శలు వస్తున్నాయి. ఈ క్రమంలో స్వయంగా యశ్వీర్ గౌడ్ తన సెలబ్రేషన్స్ పై రియాక్ట్ అయ్యాడు. దీపావళి రోజున టీమిండియాను ఓడించి హంజా జహూర్ ఇతర పాకిస్తాన్ క్రికెటర్లు తమను రెచ్చగొట్టారని వెల్లడించాడు.
గ్రూప్ స్టేజ్ లో తమ జట్టును ఓడించిన తర్వాత పాకిస్తాన్ ఆటగాళ్లు ఎగతాళి చేసి మాట్లాడారని యశ్వీర్ గౌడ్ (Yashveer Goud) గుర్తు చేశాడు. అసభ్య పదజాలం ఉపయోగించి తమను బూతులు తిట్టినట్టు వెల్లడించాడు. ఆ సమయంలో భారత్ జట్టు ఓడిపోయిందని ఓపిక పట్టినట్టు వ్యాఖ్యానించాడు. అయితే ఫైనల్ గెలిచిన తర్వాత తమ ప్రతాపం చూపించామని సంచలన వ్యాఖ్యలు చేశాడు. గ్రూప్ స్టేజ్ లో వాళ్ళు ఏం చేశారో.. తాము ఫైనల్ గెలిచాక అదే చేశామని స్పష్టం చేశాడు. దెబ్బకు దెబ్బ కొట్టి చూపించామని.. ఇందులో తమ తప్పేం లేదని షాపింగ్ స్టేట్మెంట్ ఇచ్చాడు.