Chiranjeevi: టాలీవుడ్ మెగాస్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న చిరంజీవి (Chiranjeevi ) మొన్న కేంద్ర మంత్రి అమిత్ షా (Amit shah) ను తన కొడుకు , ప్రముఖ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan) తో కలిసి భేటీ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా ఏఐ డీప్ ఫేక్, టెక్నాలజీ దుర్వినియోగం పై ఆందోళన వ్యక్తం చేస్తూ సెలబ్రిటీల సమస్యను ఆయనకు విన్నవించారు. సాంకేతికత దుర్వినియోగం, సెలబ్రిటీల హక్కులు, గౌరవం సృజనాత్మక కంటెంట్ కి తీవ్రమైన ముప్పుగా మారుతోందని వెల్లడించారు. అయితే దీనిపై స్పందించిన అమిత్ షా ఈ అంశాన్ని ప్రభుత్వం అత్యవసరంగా పరిశీలించి, మరింత పటిష్టమైన రక్షణ చర్యలు, కఠినమైన శిక్షలు అమలు చేసే దిశగా చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. అంతేకాదు ఈ అంశంపై లిఖితపూర్వక వినతి పత్రం సమర్పించాలని కూడా సూచించారు. పైగా ఈ వ్యవహారాన్ని సమన్వయం చేసే బాధ్యతను కిషన్ రెడ్డికి అప్పగించారు అమిత్ షా.
అందులో భాగంగానే ఒక లిఖితపూర్వక వినతి పత్రాన్ని నేడు మెగాస్టార్ చిరంజీవి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి సమర్పించారు. ఇక ఈ విషయాన్ని ఆయన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు.” గౌరవనీయులైన కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో నా ఇటీవల సమావేశం తర్వాత ఆయన సలహా మేరకు నేను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించాను. ఏఐ దుర్వినియోగం, డీప్ ఫేక్ డిజిటల్ నకిలీ గుర్తింపులకు వ్యతిరేకంగా మరింత పటిష్టమైన రక్షణ చర్యలు తీసుకోవాలని కోరుతూ కేంద్ర మంత్రిత్వ మరియు హోంశాఖ అలాగే సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి కిషన్ రెడ్డికి వినతి పత్రం అందించడం జరిగింది.. సంబంధిత మంత్రిత్వ శాఖలతో సమన్వయం చేసుకొని.ఈ ఆందోళనలను ముందుకు తీసుకెళ్తామని హామీ ఇచ్చిన కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు.
ప్రతి పౌరుడి భద్రతతో పాటు కళాకారుల గౌరవం, గుర్తింపు, సృజనాత్మక హక్కులను కాపాడుకోవడం మన ఉమ్మడి బాధ్యత. సాంకేతికత సృజనాత్మకతను పెంపొందించాలి. కానీ గౌరవాన్ని నాశనం చేయకూడదు అంటూ చిరంజీవి పోస్టు షేర్ చేశారు. మొత్తానికి అయితే చిరంజీవి చేసిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
also read:బిగ్ బాస్ 10 విజేత ఎవరు.. మనసులో మాట బయటపెట్టిన బాబు!
ఇదిలా ఉండగా ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లను, హీరోలను డీప్ ఫేక్ బారిన గురి చేస్తూ వారిని ఇబ్బందులకు గురిచేస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా హీరోయిన్లను అత్యంత అసభ్యకరంగా చిత్రీకరిస్తూ వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ డీప్ ఫేక్ వీడియోల వల్ల సెలబ్రిటీలు ఏ రేంజ్ లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే చాలా మంది సెలబ్రెటీలు, వ్యక్తిత్వ హక్కులను కాపాడాలి అంటూ ఢిల్లీ, తెలంగాణ హైకోర్టులను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీ పెద్దగా సెలబ్రిటీల కోసం ఒక అడుగు ముందుకు వేసి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇలాంటి వాటిని అరికట్టడానికి కంకణం కట్టుకున్నారు చిరంజీవి.. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పలువురు నెటిజన్స్, అభిమానులు చిరంజీవి పై ప్రశంసలు కురిపిస్తున్నారు.
Following my recent meeting with Hon’ble Union Home Minister Shri @AmitShah ji and as advised by him, I have submitted a memorandum to Union Minister Shri @kishanreddybjp garu, addressed to the Union Home Ministry and the Ministry of Information & Broadcasting, seeking stronger… pic.twitter.com/R2VjPufBgR
— Chiranjeevi Konidela (@KChiruTweets) November 16, 2026