E-Paper
Advertisement

Brahmamudi Serial Today Episode July 31st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖకు వార్నింగ్ ఇచ్చిన ఐశ్వర్య

Brahmamudi Serial Today Episode July 31st ‘బ్రహ్మముడి’ సీరియల్‌: రేఖకు వార్నింగ్ ఇచ్చిన ఐశ్వర్య
Advertisement

Brahmamudi serial today Episode: రాజు భోజనం చేస్తుంటే.. ఇందు వడ్డిస్తుంది. పక్కనే కూర్చుని అపర్ణ అప్యాయంగా చూస్తుంటుంది. ఎందుకు అమ్మమ్మ అలా చూస్తున్నారు మీరు తినండి అని రాజు చెబితే ఇందు మనసులో సారీ నాన్నమ్మ రాజు మీ సొంత మనవడు అన్న విషయం బయటకు చెప్పలేని పరిస్థితి నన్ను క్షమించు నాన్నమ్మ అనుకుంటుంది. అప్పుడే వచ్చిన స్వాతి అక్కా నువ్వు చెప్పినా వినకుండా ఐశ్వర్య బయటకు వెళ్లిపోయింది అని చెప్పగానే.. కారు కీస్‌ ఇందు తీసుకుంది కదా ఎలా వెళ్లిపోయింది అని అపర్ణ అడగ్గానే.. లక్కీ బైక్‌ మీద వెళ్లిపోయిందని స్వాతి చెప్తుంది. దీంతో రాజు షాక్‌ అవుతాడు.. ఒరేయ్‌ లక్కీకి ఎంత పని చేశావురా..? ఇప్పుడు ఇందు నన్ను అంటుంది అని మనసులో అనుకుంటూ భయపడుతుంటాడు.

ఇందు కోపంగా రాజును చూస్తూ.. నీ ఫ్రెండ్‌ ఐషును తీసుకెళ్లడం ఏంటి..? అని అడిగితే ఏముంది తను లిఫ్ట్‌ అడిగి ఉంటుంది.. వీడు లిఫ్ట్‌ ఇచ్చి ఉంటాడు అని రాజు చెబితే.. నేనేమో తనను కంట్రోల్‌ చేయాలని చూస్తుంటే.. నీ ఫ్రెండ్‌ ఇలా బయటకు తీసుకెళ్లడం ఏంటి.? అని ప్రశ్నిస్తే.. అయితే ఇప్పుడు నా ప్రెండ్‌ది తప్పా.. నువ్వు ఎంత చెప్పినా వినకుండా బయటకు వెళ్లిన ఐషును వదిలేసి నా ప్రెండ్‌ను అంటావేంటి..? వెళ్లాలి అనుకున్నప్పుడు ఎలాగైనా వెళ్తుంది అంతే కదా అమ్మమ్మ అంటాడు రాజు. అపర్ణ కూడా అవును ఇందు తను వెళ్లాలనుకుంటే ఎలాగైనా వెళ్తుంది. ఆ రేఖ పెంపకంలో అది బాగా దారి తప్పింది అంటూ తిడుతుంటే.. అవును నాన్నమ్మ తను ఎలాగైనా మార్చాలి అని ఇందు చెప్తుంటే.. రాజు నవ్వుతుంటాడు. ఎందుకు నవ్వుతున్నావు అంటే రాజు తను డబ్బుల కోసం నిన్న నాతో కిడ్నాప్‌ చేయించిన విషయం చెబితే ఎంత షాక్‌ అవుతారో అని మనసులో అనుకుని భోజనం దగ్గర నుంచి లేచి వెళ్లిపోతాడు రాజు.

Advertisement

శశి, ఐశ్వర్య కోసం వెయిట్‌ చేస్తుంటాడు. ఇంకా రాలేదు కొంపదీసి హ్యాండ్‌ ఇస్తుందా ఏంటి..? అని అనుకుంటుండగానే.. లక్కీ ఐశ్వర్యను తీసుకొస్తాడు. ఐశ్వర్య వెళ్లి శశిని పలకరిస్తూ.. హగ్‌ చేసుకుంటుంది. అది చూసిన లక్కీ షాక్‌ అవుతాడు. నా పిల్లను వీడు బేబీ అంటున్నాడు.. అసలు ఎవడు వీడు.. అని తిట్టుకుంటూ.. వీడికి హగ్‌ ఇవ్వడం కోసమే దీన్ని ఇక్కడకు తీసుకొచ్చింది అని మనసులో బాధపడుతుంటాడు. కట్‌ చేస్తే అర్ధరాత్రి పుల్లుగా తాగి ఐశ్వర్య ఇంటికి వస్తుంది. గట్టిగా అరుస్తూ.. ఓసేయ్‌ ఇందు ఎక్కడున్నావు కిందకు రావే అంటూ అరుస్తుంది. లక్కీ ఐషు కామ్‌గా ఉండు.. అందరూ వస్తారు అంటూ చెప్తుంటాడు. ఇంతలో ఐశ్వర్య సౌండ్‌కు అందరూ కిందకు వస్తారు. అందరినీ చూసి ఐశ్వర్య నేను ఇందును పిలిస్తే అందరూ వచ్చారా..? అయితే రండి.. ఏయ్‌ ఇందు ఇంతకీ నన్ను ఏం చేస్తున్నావే.. నువ్వు.. అంటూ అల్లరి చేస్తుంటే..

అపర్ణ కోపంగా ఐశ్వర్య తాగి వచ్చి ఇంటి పరువు తీస్తున్నావా..? అంటూ తిట్టగానే.. నీ మనవరాలు ఏం చేస్తుంది..? నీ మనవరాలి వల్ల ఏం కావడం లేదా..? అంటూ ప్రశ్నిస్తుంటే.. ఇందు కోపంగా ఏయ్‌ ఐషు ఏంటిది ఎందుకు ఇలా తాగావు అంటూ అడగ్గానే.. అవును తాగాను.. ఇంట్లో వాళ్ల పేరు చెప్పి ఒక్కోక్కరి పేరు మీద ఒక్కోక్క పెగ్గు తాగాను అంటుంది ఐశ్వర్య అసలు నన్ను తాగొద్దు అని చెప్పడానికి నువ్వెవరు చెప్పవే అంటూ నిలదీస్తుంది.  రేఖ అడ్డు వస్తే.. రేఖను తిడుతుంది ఐశ్వర్య. అలాగే రాజును తిడుతుంది. ఇందును కిడ్నాప్‌ చేసినట్టు నాటకం ఆడావని.. నీ ఆటలో వీళ్లందరూ   పావులు అవుతున్నారు.. అంటూ కింద పడబోతుంటే.. స్వాతి, ఇందు కలిసి ఐశ్వర్యను రూంలోకి తీసుకెళ్తారు.

Advertisement

తర్వాత భ్రమరాంబ, శేషు, భూషణ్‌ ముగ్గురు కలిసి రేఖ దగ్గరకు వెళ్లి రేఖ మేము నిజం ఏంటో పసిగట్టేశాము అని చెప్పగానే.. రేఖ మనసులో లక్కీ నా కొడుకు అన్న నిజం వీళ్లకు తెలిసిందా..? ఏంటి..? అనుకుంటూ..  కంగారుగా మీరు ఏమనుకుంటున్నారో అది నిజం కాదు.. అంటుంది. అసలు మేము ఏమీ అనుకోకుండానే నిజం కాదని ఎలా అనుకుంటావు అని ప్రశ్నిస్తే.. రేఖ మాట మారుస్తుంది. తనేదో చెప్పి టాఫిక్‌ డైవర్ట్‌ చేస్తుంది. దీంతో ఇందు, రాజుల పెళ్లి గురించి అందరూ అనుమానం వ్యక్తం చేస్తే.. ఈ విషయం గురించి వదిలేయండి అంటూ రేఖ చెబితే నా అనుమానం తీరేవరకు నేనో పట్టాన ఉండను నిజం ఏదో అబద్దం ఏదో తెలుసుకుని రేఖకు సాక్ష్యాలతో నిరూపిస్తానని భ్రమరాంబ మనసులో అనుకుంటుంది.

రూంలో ఉన్న రాజుతో ఐషు ఇంతకు ముందు రాజు, లక్కీ తాగి నిజం మాట్లాడినప్పుడు తీసిన వీడియో గురించి చెప్తుంది ఇందు. ఇంకోసారి అలా జరగకుండా జాగ్రత్తగా ఉండమంటుంది. సరే జాగ్రత్తగానే ఉంటానులే అంటాడు రాజు. తర్వాత ఐషు తాగిన విషయం చెప్పి ఇందు బాధపడుతుంది. ఇంతలో ఈరోజు బ్రహ్మముడి సీరియల్‌ ఎపిసోడ్‌ అయిపోతుంది.

ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Nuvvu leka Nenu lenu : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. షాకిచ్చిన హీరోయిన్..

Gundeninda GudiGantalu Today episode: తాగొచ్చి రచ్చ చేసిన బాలు.. మీనా సీరియస్.. బాలుకు దిమ్మతిరిగే షాక్..

Podarillu Today Episode : పెళ్లి క్యాన్సిల్ చేసేందుకు ప్లాన్..? నారాయణ పెర్ఫార్మన్స్ అదుర్స్.. మాధవ్ నిజం తెలుస్తుందా..?

Illu Illalu Pillalu Today Episodes: ప్రేమకు దిమ్మతిరిగే షాక్.. మాటిచ్చిన ప్రేమ.. తిరుపతి ఎంట్రీతో భాగ్యంకు షాక్..

Ninnu kori Serial Today Episode September 15th ‘నిన్ను కోరి’ సీరియల్‌: విరాట్ చంపేస్తున్న రౌడీలు – అడ్డుపడిన మదన్  

Intinti Ramayanam Today Episode: పల్లవి ప్లాన్ సక్సెస్.. కన్నీళ్లు పెట్టించే సీన్.. అయ్యో పాపం పార్వతి..

Tuesday Movies in Tv : మంగళవారం టీవీల్లోకి హిట్ సినిమాలు.. ఆ ఒక్కటి మస్ట్ వాచ్..

కొట్టుకునే వరకు వెళ్లిన షాలిని, వర్షిణి!

Big Stories

Advertisement
×