BigTV English

Zampa failed: ఆడమ్ జంపా.. అనుకున్నదొకటీ, అయ్యిందొకటీ..

Zampa failed: ఆడమ్ జంపా.. అనుకున్నదొకటీ, అయ్యిందొకటీ..

Zampa failed in Mankading :ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా అభాసు పాలయ్యాడు. క్రికెట్లో అత్యంత చెత్త పద్ధతిగా భావించే మన్కడింగ్ చేసి… తాను అనుకున్నది జరక్కపోవడంతో నవ్వుల పాలయ్యాడు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బాష్ లీగ్‌లో… మెల్‌బోర్న్‌ స్టార్స్‌, మెల్‌బోర్న్‌ రెనెగేడ్స్‌ జట్లు తలపడ్డాయి. మెల్‌బోర్న్‌ స్టార్స్‌ కెప్టెన్‌ అయిన జంపా… బౌలింగ్ చేసే సమయంలో… నాన్‌స్ట్రైకర్‌ ఎండ్ వైపు ఉన్న రెనెగేడ్స్ బ్యాటర్ రోజర్స్ క్రీజు దాటి ముందుకు వెళ్లడంతో… మన్కడింగ్ చేశాడు. రోజర్స్ ఔట్ అంటూ అప్పీల్ చేశాడు. దాంతో తాను ఔట్ అయ్యానని అనుకుని… రోజర్స్ కూడా పెవిలియన్ బాట పట్టాడు. కానీ అతణ్ని అంపైర్ ఆపాడు. థర్డ్ అంపైర్‌తో చర్చించి… రోజర్స్ నాటౌట్ అని ప్రకటించాడు. దాంతో… ఆడమ్ జంపా అవాక్కయ్యాడు.


బంతిని చేతి నుంచి దాదాపు వదిలే సమయంలో హఠాత్తుగా వెనక్కి తిరిగి బెయిల్స్‌ను పడేసిన జంపా… రోజర్స్ ఔట్ అంటూ అప్పీల్ చేశాడు. కానీ అది నాటౌట్ అంటూ అంపైర్ అతనికి వివరించే ప్రయత్నం చేశాడు. కానీ జంపా వినలేదు. దాంతో థర్డ్ అంపైర్‌కు నివేదించాడు. ఆయన కూడా ఫీల్డ్ అంపైర్‌లాగే స్పందించాడు. జంపా చేయి భుజం నిట్ట నిలువు దశ నుంచి ముందుకెళ్లినందున… నిబంధనల ప్రకారం బంతి వేసినట్లే భావించాలంటూ… రోజర్స్‌ను నాటౌట్‌గా ప్రకటించాడు.

ఈ ఘటన తర్వాత జంపాపై రోజర్స్ ప్రతీకారం తీర్చుకున్నాడు. 142 పరుగుల విజయలక్ష్యంతో బ్యాటింగ్ మొదలెట్టిన మెల్‌బోర్న్‌ స్టార్స్‌ను ముప్పుతిప్పలు పెట్టాడు. 4 ఓవర్లలో 16 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ జో క్లార్క్ ను… రోజర్స్ బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత మరో ఓపెనర్, వన్ డౌన్ బ్యాటర్, ఇద్దరు మిడిలార్డర్ బ్యాటర్లు కూడా రోజర్స్ కే వికెట్లు సమర్పించుకున్నారు. అతని దెబ్బకు 108 పరుగులకే ఆలౌటైన మెల్‌బోర్న్‌ స్టార్స్‌… 33 పరుగుల తేడాతో ఓడిపోయింది.


Related News

Udaipur Files: సినిమా చూస్తూ ఒక్కసారిగా ఏడ్చిన కన్హయ్య లాల్ కుమారులు.. వీడియో వైరల్

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Big Stories

×