E-Paper
Advertisement

Medak : ఇద్దరి మధ్య ఘర్షణ.. ఏ సంబంధం లేని యువతి మృతి ..

Medak : ఇద్దరి మధ్య ఘర్షణ.. ఏ సంబంధం లేని యువతి మృతి ..
Advertisement

Medak : ఇద్దరి మధ్య జరిగిన ఘర్షణ ఏ సంబంధం లేని ఓ యువతి ప్రాణాలు తీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లికి చెందిన ఉప్పు నరేందర్ , స్వామి అనే ఇద్దరి వ్యక్తుల మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో నరేందర్ , స్వామిని నెట్టివేశాడు. కిందపడిన స్వామిని అక్కడున్న స్థానికులు పక్కకు తీసుకువెళ్లారు. దీంతో కోపంతో రగిలిపోయిన నరేందర్ తన థార్ కారుతో దూసుకొచ్చాడు.

పెళ్లి కూతురిని ఊరేగింపుగా మెట్టినింటికి పంపిస్తున్న బృందంపైకి దూసుకొచ్చాడు. ఈ ఘటనలో రమ్య(23) అనే యువతి తీవ్రంగా గాయపడింది. పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. రమ్యను హైదరాబాద్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ప్రాణాలు కోల్పోయింది. నిందితుడు పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×