BigTV English

Hyderabad Road Accidents : హైదరాబాద్ లో రోడ్డుప్రమాదాలు.. ముగ్గురు మృతి

Hyderabad Road Accidents : హైదరాబాద్ లో రోడ్డుప్రమాదాలు.. ముగ్గురు మృతి

Hyderabad Road Accidents(TS today news): హైదరాబాద్ లో రహదారులు నెత్తురోడాయి. వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు మృతి చెందారు. బీఎన్ రెడ్డి గుర్రంగూడ చౌరస్తా వద్ద అతివేగంగా వచ్చిన రెండు కార్లు ఒకదానినొకటి ఢీ కొన్నాయి. ప్రమాద సమయంలో కార్లలో ఉన్నవారిలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ముగ్గురికి గాయాలయ్యాయి.


Also Read : తెలంగాణకు వర్షసూచన.. హైదరాబాద్ సహా జిల్లాలకు ఎల్లో అలర్ట్

సమాచారం అందుకున్న మీర్ పేట్ పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతులను సాఫ్ట్ వేర్ ఉద్యోగులు రవి, ప్రణయ్ లుగా గుర్తించారు. వారి మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించి, కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


ఎల్బీనగర్ లో జరిగిన మరో ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించాడు. హయత్ నగర్ నుంచి మాదాపూర్ కు కారులో వెళ్తుండగా.. ఆగిఉన్న లారీని ఢీ కొట్టింది. ప్రమాదంలో హయత్ నగర్ కు చెందిన ముగ్గయ్య అనే వ్యక్తి మరణించగా.. మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడినవారిని ఆస్పత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

 

Tags

Related News

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

Big Stories

×