E-Paper
Advertisement

Buddhist Monks: నేడు హైద‌రాబాద్‌కు 3వ ద‌మ్మ యాత్ర‌.. స్వాగ‌తం ప‌ల‌క‌నున్న మంత్రి జూప‌ల్లి!

Buddhist Monks: నేడు హైద‌రాబాద్‌కు 3వ ద‌మ్మ యాత్ర‌.. స్వాగ‌తం ప‌ల‌క‌నున్న మంత్రి జూప‌ల్లి!
Advertisement

Buddhist Monks: లోక కల్యాణం, ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ థాయిలాండ్, భార‌త‌దేశానికి చెందిన బౌద్ధ భిక్షువులు ‘3వ ద‌మ్మ పాదయాత్ర’ చేపట్టారు. బుధవారం మధ్యాహ్నం నగరంలోని ఐమ్యాక్స్ ప‌క్క‌న ఉన్న డా. బి.ఆర్. అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకోనుంది. ఈద‌మ్మ యాత్ర‌కు మంత్రి జూపల్లి కృష్ణారావు(Minister Jupally Krishna Rao) స్వాగతం పలకనున్నారు. గౌతమ బుద్ధుడు బోధించిన శాంతి, కరుణ సందేశాలను చాటిచెప్పే లక్ష్యంతో సాగుతున్న ఈ పాదయాత్ర కర్ణాటక(Karnataka)లోని సిద్ధార్థ బుద్ధ విహార్ నుంచి ప్రారంభమైంది.

Also Read: Srinivas Goud: కల్లుగీత కార్మికులకు రిజర్వేషన్లు పెంచండి: తలసాని శ్రీనివాస్ గౌడ్!

నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం..

Advertisement

సుమారు 400 కిలోమీటర్లకు పైగా కాలినడకన సాగే ఈ యాత్ర మార్చి 1న నాగార్జునసాగర్‌లోని బుద్ధవనం చేరుకోనుంది. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించిన అనంతరం, భిక్షువులు హుస్సేన్ సాగ‌ర్ లోని చారిత్రాత్మక బుద్ధ విగ్రహాన్ని దర్శించుకుంటారు. థాయ్‌లాండ్‌కు చెందిన ప్రా సోంగ్‌శాక్ కోవిడో నేతృత్వంలో, గగన్ మాలిక్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ యాత్ర నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 18 సాయంత్రం పాదయాత్ర మహబోధి బుద్ధ విహార్‌కు చేరుకోనుంది, భిక్షువులు ఫిబ్రవరి 19 వరకు అక్కడే విశ్రాంతి తీసుకుంటారు. అనంతరం ఉప్పల్, ఇబ్రహీంపట్నం, కొండమల్లేపల్లి మీదుగా ప్రయాణించి మార్చి 1న బుద్ధవనం వద్దకు యాత్ర చేరుకోనుంది.

Also Read: TIMS Sanathnagar: సనత్‌నగర్ టిమ్స్‌ ఆసుపత్రిలో.. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ మిషన్లు ఏర్పాటు..!

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×