E-Paper
Advertisement

TIMS Sanathnagar: సనత్‌నగర్ టిమ్స్‌ ఆసుపత్రిలో.. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ మిషన్లు ఏర్పాటు..!

TIMS Sanathnagar: సనత్‌నగర్ టిమ్స్‌ ఆసుపత్రిలో.. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ మిషన్లు ఏర్పాటు..!
Advertisement

 TIMS Sanathnagar: స్వేఛ్చ బ్యూరో: టిమ్స్ లో అడ్వాన్స్ డ్ టెక్నాలజీ మిషన్లు అందుబాటులో ఉండాల్సిందేనని హెల్త్ మినిస్టర్ దామోదర రాజనర్సింహా అధికారులకు ఆదేశాలిచ్చారు. మంగళవారం ఆయన సనత్‌నగర్ టిమ్స్ హాస్పిటల్‌ పనులను తనిఖీ చేశారు. అనంతరం మెడికల్, ఫైర్, పొల్యూషన్ కంట్రోల్, వాటర్, ఎలక్ట్రిసిటీ, ఆర్ అండ్ బీ తదితర శాఖల ఉన్నతాధికారులతో టిమ్స్ ఎమర్జెన్సీ బ్లాక్‌లో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..ఉగాది నాటికి అన్ని సౌకర్యాలతో హాస్పిటల్‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు. హాస్పిటల్‌కు నీళ్లు, పవర్ సప్లైలో ఎలాంటి ఆటంకం ఉండకూడదని, 24 గంటల సరఫరా ఉండాలని సూచించారు. ఫైర్ సేఫ్టీ విషయంలో రాజీ ఉండకూడదని, అన్ని ఫ్లోర్లలో పూర్తిస్థాయి పరిశీలన చేయాలని అగ్నిమాపక‌శాఖ అధికారులను ఆదేశించారు.

పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగా..

రిసెప్షన్ ఏరియా, హెల్ప్ డెస్క్, ఓపీ కౌంటర్లు, వెయిటింగ్ హాల్, ఓపీ కన్సల్టేషన్ రూమ్స్, డయాగ్నస్టిక్స్, ఇన్ పేషెంట్ వార్డులు, ఫార్మసీ తదితర ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. పేషెంట్ల సంఖ్యకు అనుగుణంగా ఓపీ, ఫార్మసీ కౌంటర్లు ఉండాలని అధికారులకు మంత్రి సూచించారు. సీటీ స్కాన్, ఎంఆర్‌ఐ, ఎక్స్ రే, ఆల్ట్రాసౌండ్ తదితర యంత్రాలను మంత్రి పరిశీలించారు. అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో అందుబాటులోకి తీసుకొచ్చిన ఈ యంత్రాలు పూర్తిస్థాయిలో పేషెంట్లకు ఉపయోగపడాలని, ఇందుకు అవసరమైన డాక్టర్లు, ఇతర సిబ్బందిని సిద్ధంగా ఉంచుకోవాలని ఆరోగ్యశాఖ అధికారులను మంత్రి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఆర్ అండ్ బీ స్పెషల్ సీఎస్ వికాస్ రాజ్, ఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తు, పీసీబీ మెంబర్ సెక్రటరీ రవి, వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు జేఎండీ మయాంక్ మిట్టల్, డీఎంఈ నరేంద్ర కుమార్, నిమ్స్ డైరెక్టర్ బీరప్ప తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Also Read: Hollywood OTT Releases : ఈ వారం ఓటీటీని షేక్ చేయనున్న సిరీస్ లు ఇవే… ఎప్పుడు, ఎక్కడ చూడవచ్చు అంటే

కేంద్ర మాజీ మంత్రి భేటీ..

ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ని ఝార్ఖండ్ రాష్ట్ర సీనియర్ కాంగ్రెస్ నాయకులు , కేంద్ర మాజీ మంత్రి సుబోధ్ కాంత్ సహాయ్ హైదరాబాద్ లోని మంత్రి నివాసం లో మర్యాద పూర్వకంగా భేటి అయ్యారు. రాష్ట్ర రాజకీయాలు, దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ బలోపేతం వంటి అంశాలపై డిస్కషన్ చేశారు.

Advertisement

Also Read: Crime Thriller Series OTT : వరుసగా సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ల హత్యలు.. ముందుగానే ఊహించే బాబా… క్షణ క్షణం ఉత్కంఠ

Related News

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Transfers: అటవీ శాఖ ఉద్యోగులకు బిగ్ షాక్.. ఇటీవల జరిగిన బదిలీలు రద్దు!

Telangana PCC: ఢిల్లీని షేక్ చేస్తున్న తెలంగాణ.. టీపీసీసీకి రాహుల్ గాంధీ సీక్రెట్ టాస్క్..?

Big Stories

Advertisement
×