E-Paper
Advertisement

DCC Appointments: ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 70 శాతం డీసీసీలు:​ మహేష్​ కుమార్ గౌడ్

DCC Appointments: ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 70 శాతం డీసీసీలు:​ మహేష్​ కుమార్ గౌడ్
Advertisement

DCC Appointments: గతంలో ఎన్నడూ లేని విధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి 70 శాతం డీసీసీ నియామకాలు కల్పించామని టీపీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్ గౌడ్ తెలిపారు. ఆయన మాట్లాడుతూ.. ఐదుగురు ఎస్టీ నేతలకు డీసీసీ అధ్యక్ష పదవులు ఇచ్చామన్నారు. రాహుల్ గాంధీ ఆకాంక్షించిన సామాజిక న్యాయాన్ని అగ్రవర్ణానికి చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమర్థంగా అమలు చేస్తున్నారన్నారు. త్వరలోనే ఎస్టీ సమాజానికి మెజార్టీగా డైరెక్టర్ పోస్టులు ఇవ్వబోతున్నామన్నారు. ఆదివాసుల అభివృద్ధి, అటవీ హక్కులు, భూమి హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడిన పార్టీ కాంగ్రెస్ మాత్రమే అని వివరించారు.

నిర్మాణం కోసం 11 ఎకరాల భూమిని..

లంబాడీలు ఎక్కువగా ఉన్న తన స్వగ్రామంలో పాఠశాల నిర్మాణం కోసం 11 ఎకరాల భూమిని ఇచ్చానని, ఎస్టీల చదువు కోసం కాంగ్రెస్ పార్టీ, వ్యక్తిగతంగా తాను కృషి చేస్తున్నామన్నారు. ఆదివాసి హక్కుల పరిరక్షణ, వారి జీవన ప్రమాణాల మెరుగుదల కోసం కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుంటుందన్నారు. తెలంగాణలో సామాజిక న్యాయం, సమాన అవకాశాల సాధనలో ఆదివాసి సమాజం కీలక భాగస్వామ్యం కావావాల్సిన అవసరం ఉన్నదన్నారు. ఆదివాసి యువతకు విద్య, ఉపాధి అవకాశాలు పెంచేందుకు ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందన్నారు.

Advertisement

Also Read: Temple Lands: ఎండోమెంట్‌ శాఖలో చిత్ర విచిత్రం.. ప్రభుత్వం ఆదేశించిన స్పందించిన అధికారులు

75 శాతం పైగా స్థానాలు

తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలు 75 శాతం పైగా స్థానాలు గెలుచుకున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మంచి జరగాలంటే, దేశ ప్రజల సంరక్షణ కోసం రాహుల్ ప్రధాని కావాల్సిన అవసరం ఉన్నదన్నారు.

Advertisement

Also Read: Vishwambhara: ‘విశ్వంభర’ విషయంలో అసలేం జరుగుతుంది? న్యూ డౌట్స్ స్టార్ట్స్!

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×