E-Paper
Advertisement

Rural Development: 99 రోజుల ప్రగతి ప్రణాళికలో.. రెయిన్ సీజన్ యాక్షన్ ప్లాన్..?

Rural Development: 99 రోజుల ప్రగతి ప్రణాళికలో.. రెయిన్ సీజన్ యాక్షన్ ప్లాన్..?
Advertisement

Rural Development స్వేచ్ఛ బ్యూరో: ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమాన్ని రాష్ట్రమంతా ఊపందుకున్నాయి. సీఎం ఆదేశాల మేరకు ఆఫీసర్లంతా ఈ ప్రోగ్రామ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే ఈ దఫా రెయిన్ సీజన్ యాక్షన్ ప్లాన్ ను ముందస్తుగా అమలు చేసేందుకు ప్రభుత్వం రెడీ అయింది. 99 రోజుల కార్యక్రమంలో భాగంగానే ఈ యాక్షన్ ప్లాన్ ను ఇంప్లిమెంట్ చేయనున్నారు. మే నెలలోనే వర్షాకాలానికి ముందస్తు ప్రణాళికను గ్రామాల్లోకి తీసుకెళ్లనున్నారు.

లోతట్టు ప్రాంతాల్లో..

వర్షపు నీటి కాలువల మురుగు తొలగించడం, లోతట్టు ప్రాంతాలను మట్టి నింపడం, దోమల నివారణకు మందులు పిచికారీ చేయడం, ఫాగింగ్ డ్రై డే కార్యక్రమాలు నిర్వహించడం, మొక్కల నాటకం, న‌రేగా ప‌థ‌కం ద్వారా గుంతలు తవ్వడం, మొక్కలు నాటేందుకు ప్రదేశాలు గుర్తించడం, నాటే మొక్కలను ఎంపిక చేయడం, రోడ్లు, భవనాల సంరక్షణ, గ్రామీణ రోడ్ల మరమ్మత్తులు, డిఫెక్ట్ లయబిలిటీ పీరియడ్‌లో ఉన్న రోడ్ల సంరక్షణ, బీటీ రోడ్లను శుభ్రపరచడం, కిలోమీటర్ రాళ్లు, సమాచారం బోర్డులు, సైన్ బోర్డులు పునరుద్ధరించడం, భవనాల సంరక్షణ, పైకప్పుల పగుళ్లను సరిచేయడం, ఆయా భ‌వ‌నాల టెర్రస్ శుభ్రపరచడం, భవనాలకు పెయింటింగ్ చేయడం వంటి కార్యక్రమాలన్నీ పూర్తి చేయనున్నారు.

పల్లెపల్లెనా పారిశుధ్యం

Advertisement

ఇందులో భాగంగా పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఈ కార్యక్రమంలో కీలక పాత్ర పోషించనుంది. ఆరు స్థాయిలలో వినూత్న కార్య‌క్ర‌మాలు చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది. మొట్టమొదటగా పల్లెపల్లెనా పారిశుధ్యంపై దృష్టి పెట్ట‌నుంది. తాగు నీరు, చెత్త నిర్వ‌హ‌ణ‌, మ‌హాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, రాబోయే వ‌ర్షాకాల ముందస్తు ప‌నుల‌పై దృష్టి పెట్టే ప్ర‌ణాళిక‌ను తయారు చేసింది. ఏ రోజుకారోజు విభిన్న కార్య‌క్ర‌మాలతో జనంలోకి వెళ్లేందుకు వీలుగా షెడ్యూలు నిర్ణయించుకుంది. సుపరిపాలనతో గ్రామీణ వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసేందుకు వీలుగా ఈ ప్రత్యేక కార్యక్రమం చేపట్టింది.

Also Read; Bombs Iran Oil Depots: ఇరాన్‌ చమురు డిపోలపై వరుసగా బాంబులదాడి, ఎగిసిపడిన మంటలు

గ్రామీణ పరిశుభ్రత కార్యక్రమం..

Advertisement

రహదారుల శుభ్రత, కాలువల మురుగు తొలగింపు, పాఠశాలలు, అంగన్‌వాడీలు, మార్కెట్లు, హాస్టళ్లు, బస్ స్టాండ్ల శుభ్రపరచడం, రహదారుల పక్కన, ఖాళీ ప్రదేశాల్లో పొదలను తొలగించడం, ఉపయోగంలో లేని బావులను మూసివేయడం, బ్లీచింగ్ పౌడర్, సున్నం చల్లడం, ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ శుభ్రపరచడం, అవసరమైన సిబ్బంది, సామగ్రి కోసం ప్రణాళిక తయారు చేయనున్నారు. గ్రామ పంచాయితీ నిధులతో పాటు రాష్ట్ర , కేంద్ర ఆర్ధిక నిధులను వినియోగించనున్నారు. ఇక సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు గ్రామీణ ప్రాంతాల‌ అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. గ్రామాల ఆదాయం పెంపు కోసం స్థానిక పరిస్థితులు ఆధారంగా చర్యలు చేపట్టనున్నారు.

తాగునీటి సరఫరాలో చేపట్టేవి..

తాగునీటి సరఫరా ఇబ్బందుల‌ను తెలుసుకోవ‌డం, దాని పూర్తిగా పనిచేసేలా చేయడం, ముందస్తు చర్యలు, గ్రామపంచాయతీ నిధులు మరియు 15వ ఫైనాన్స్ కమిషన్ నిధులను వినియోగించడం, మార్చి 27 లోపు అవసరమైన సామగ్రిని కొనుగోలు చేయడం, చేయాల్సిన పనులు, హ్యాండ్ పంపుల మరమ్మత్తులు, సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ మోటార్ పంపుల మరమ్మత్తులు, ఓవర్ హెడ్ ట్యాంకుల మరమ్మత్తులు,కొత్త ఇళ్లకు తాగునీటి కనెక్షన్లు ఇవ్వడం వంటివి జరుగుతుంది. ఈ పనులన్నీ గ్రామపంచాయతీ స్థాయిలు, మున్సిపాలిటీల్లో అధికారులు సమన్వయంతో పనిచేసేలా ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.

Also Read: Praja Palana: 99 రోజుల ప్రణాళిక పై ఆ రోజు అందరూ లెక్క చెప్పాల్సిందే: మహేష్ కుమార్ గౌడ్

చెత్త‌ సేకరణ.. చెత్త నిర్వహణ

ప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్తను వేరుగా సేకరించడం, ప్రతి గ్రామపంచాయతీలో కంపోస్ట్ తయారు చేయడం, చెత్త నిర్వహణపై శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడం,ఈ-వేస్ట్, బయోమెడికల్ వేస్ట్, శానిటరీ వేస్ట్‌ను సురక్షితంగా సేకరించి తొలగించడం, వ్యక్తిగత మరుగుదొడ్లు, కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సులు పూర్తి చేయడం, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ యూనిట్లు ఏర్పాటు చేయడం, కమ్యూనిటీ సోక్ పిట్స్ నిర్మించడం వంటివి ఈ 99 డేస్ లో అమలు చేయనున్నారు. గ్రామాల్లో క్లీన్ అండ్ గ్రీన్ ఉండేలా ప్రభుత్వం తన కార్యచరణను మొదలు పెట్టింది. ఇక ఉపాధి హామీ పథకంలో భాగంగా నీటి సంరక్షణ పనులు, వ్యక్తిగత లబ్ధిదారుల పనులు, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులు వంటివి పూర్తి చేయనున్నారు.

యాక్షన్ ప్లాన్ ఇలా..

=గ్రామీణ పరిశుభ్రత కార్యక్రమాలు – మార్చి 6 నుంచి మార్చి 15
= గ్రామాల ఆదాయం పెంపు చర్యలు – మార్చి 16 నుంచి 31 వరకు
=తాగునీటి సరఫరా – ఏప్రిల్​ 1 నుండి ఏప్రిల్​ 15 వరకు
=చెత్త‌ తొలగింపు, చెత్త నిర్వహణ – ఏప్రిల్ 16 నుండి 30 వరకు
=మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం – మే 1 నుంచి మే 15 వరకు
=వానాకాలానికి ముందస్తు ప‌నులు – ఏర్పాట్లు – మే 16 నుంచి మే 31 వరకు

Also Read: Indiramma Houses: రాష్ట్రంలో లక్ష ఇందిర‌మ్మ ఇండ్ల గృహ ప్రవేశాలు.. డేట్ ఫిక్స్..!

Related News

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Rice Prices: ఎల్ నినో ఎఫెక్ట్.. పెరగనున్న బియ్యం ధరలు.. అంతా వారిచేతుల్లోనే..?

సీఎం ఆదేశాలతో ‘జలసిరి’కి శ్రీకారం.. ప్రతి నీటి బొట్టును ఒడిసి పడతాం.. మంత్రి సీతక్క

Big Stories

Advertisement
×