School holiday: తెలంగాణలో ఫిబ్రవరి 14 శుక్రవారం రోజున పలు జిల్లాల లోని స్కూళ్లకు సెలవు ఇవ్వనున్నారు. మామూలుగా ఫిబ్రవరి 14న ఆప్షనల్ హాలిడే కాబట్టి అన్ని పాఠశాలలు సెలవు ప్రకటించవు. కొన్ని విద్యా సంస్థలు మాత్రమే శుక్రవారం రోజున సెలవును ప్రకటించనున్నాయి. షబ్ ఏ బరాత్ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ఆ రోజున సెలవును ప్రకటించింది. ఇస్లామిక్ క్యాలెండర్‌లో 8వ నెల అయిన షాబాన్ 15వ తేదీన జరుపుకునే షబ్ ఏ బరాత్ వేడుకకు తెలంగాణ ప్రభుత్వం సెలవు ఇచ్చింది.
అయితే ప్రభుత్వం షబ్ ఏ బరాత్ కు సెలవు ప్రకటించినప్పటికీ.. ఇది సాధారణ సెలవు దినంలాగా కాకుండా ఆప్షనల్ హాలీ డే కింద చేర్చారు. తెలంగాణలో హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాల్లోని మరి కొన్ని పాఠశాలలకు సెలవు ఇచ్చారు.
షబ్ ఏ బరాత్ ను ‘క్షమాపణ రాత్రి’ లేదా ‘ప్రాయశ్చిత్త రాత్రి ’ అని కూడా పిలుస్తారు. ఈ వేడుకును ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా జరుపుకుంటారు. ఫిబ్రవరి 14న మసీదులను దీపాలతో ముస్తాబు చేస్తారు. రాత్రి వేళ జాగారాలు చేస్తూ ప్రార్థనలు చేస్తారు. ఫిబ్రవరి 14 సాయంత్రం వేళ తమ ప్రియమైన వారిని గుర్తు చేసుకుంటూ సమాధులను సందర్శిస్తారు. కొందరు ఆ రోజంతా ఉపవాసంలో మునిగి తేలుతారు. మామూలుగా.. తెలంగాణ రాష్ట్రంలో మైనారిటీ విద్యా సంస్థలు మాత్రమే షబ్ ఏ బరాత్ వేడుక రోజులు సెలవు దినాన్ని ప్రకటించాయి.
షబ్ ఏ బరాత్ వేడుక సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కొన్ని స్కూళ్లు మాత్రమే హాలీడే ప్రకటిస్తున్నాయి. రాష్ట్రంతో హైదరాబాద్ తో పాటు ఇతర జిల్లాల్లో కూడా కొన్ని పాఠశాలలు ఇప్పటికే సెలవును కూడా ప్రకటించాయి. ఫిబ్రవరి నెలలో రాష్ట్ర ప్రభుత్వం మూడు సెలవులను ప్రకటించింది. అందులో ఒకటి సాధారణ హాలీ డే కాగా.. మరో రెండు ఆప్షనల్ హాలీ డే కింద చేర్చింది. ఫిబ్రవరి 3న వసంతి పంచమి, ఫిబ్రవరి 14 న షబ్ ఏ బరాత్, ఫిబ్రవరి 26న మహాశివ రాత్రి సందర్భంగా ఒక సాధారణ హాలీ డే ప్రకటించింది.