BigTV English

Shiva Balakrishna : శివబాలకృష్ణపై ఏసీబీ కస్టడీ పిటిషన్‌.. నేడు నాంపల్లి కోర్టులో విచారణ..

Shiva Balakrishna : శివబాలకృష్ణపై ఏసీబీ కస్టడీ పిటిషన్‌.. నేడు నాంపల్లి కోర్టులో విచారణ..

Shiva Balakrishna : ఆదాయానికి మించి ఆస్తుల కేసులో అరెస్ట్‌ అయిన HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఏసీబీ కోరింది. కస్టడీ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. బాలకృష్ణను కస్టడీకి తీసుకుని విచారిస్తే మరిన్ని బినామీ ఆస్తులు బయటపడే అవకాశంమున్నట్లు అధికారులు భావిస్తున్నారు. శివబాలకృష్ణ పేరుపై నాలుగు అకౌంట్స్ SBI బ్యాంక్ లో ఉన్నట్టు గుర్తించిన ఏసీబీ అధికారులు గుర్తించారు. కస్టడీకి కోర్టు అనుమతిస్తే.. శివబాలకృష్ణ లాకర్స్ తెరచేందుకు ఏసీబీ అధికారులు యత్నిస్తున్నారు. శివబాలకృష్ణ ఆమోదించిన ఫైల్స్, బినామీ ఆస్థులపై ఏసీబీ ఫోకస్ చేసి.. విస్తృతంగా సోదాలు చేసింది. ఆయన అరెస్టుతో HMDAలో పనిచేస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారుల్లో ఆందోళన మొదలైంది.


మరోవైపు.. శివబాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో ఏసీబీ అధికారులు సంచలన విషయాలు వెల్లడించారు. 45 పేజీల రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు బయటపడ్డాయి. విచారణకు.. శివబాలకృష్ణ ఏమాత్రం సహకరించలేదని ఏసీబీ పేర్కొంది. 1994లో గ్రూప్ వన్‌ క్యాడర్‌లో సర్వీస్‌లోకి వచ్చిన శివబాలకృష్ణ.. అనంతపురం, గుంటూరు, వైజాగ్, జీహెచఎంసీ, మున్సిపల్ శాఖల్లో కీలక పదవులు చేపట్టారు. 2021 నుండి 2023 వరకు హెచ్‌ఎండీఏ డైరెక్టర్‌గా శివబాలకృష్ణ విధులు నిర్వహించారు.

లేఅవుట్ అనుమతుల కోసం శివబాలకృష్ణ భారీగా లంచాలు డిమాండ్ చేసినట్లు రిమాండ్ రిపోర్ట్ పేర్కొన్నారు. అప్లికేషన్లలో తప్పులు ఉన్నాయంటూ శివబాలకృష్ణ లాభాలు పొందినట్లు తెలిపారు. ప్లాట్‌లలో, నిర్మాణాల్లో, విల్లాలను కూడా లంచంగా తీసుకున్నాడు. శివబాలకృష్ణ ఆధ్వర్యంలో హెచ్‌ఎండీఏ, రెరాలో భారీగా అక్రమాలు జరిగాయని.. హెచ్‌ఎండీలోని మూడు జోన్లపై శివబాలకృష్ణకు మంచిపట్టు ఉందని గుర్తించినట్లు తెలిపారు. శివబాలకృష్ణ సుదీర్ఘంగా కీలక పోస్ట్‌లో పనిచేశాడు. మరోవైపు శివబాలకృష్ణను కస్టడీలోకి తీసుకున్నాక బ్యాంక్ లాకర్లను ఏసీబీ తెరిచే అవకాశం ఉంది. బాలకృష్ణకు సహకరించిన అధికారులపై కూడా ఏబీసీ విచారణ జరుపనుంది.


ఈ నేపథ్యంలో శివబాలకృష్ణను కస్టడీకి ఇస్తే.. మరిన్ని కీలక విషయాలను రాబట్టే అవకాశం ఉందన ఏసీబీ భావిస్తోంది.

Related News

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Rain Alert: ఓర్నాయనో.. ఇంకా 3 రోజులు వానలే వానలు.. ఈ జిల్లాల్లో పిడుగుల పడే అవకాశం

Telangana News: బీఆర్ఎస్‌లో కవితపై కుట్రలు.. ఆయన పనేనా?

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసు.. విచారణకు కేంద్రమంత్రి సంజయ్, ఆ తర్వాత బాబు-పవన్?

Himayatsagar: నిండుకుండలా హిమాయత్ సాగర్.. గేటు ఎత్తి నీటి విడుదల, అధికారుల హెచ్చరిక

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Big Stories

×