Formula E-Race Case: ఫార్ములా ఈ-కారు రేసులో దర్యాప్తుకు సంబంధించి ఏసీబీ దూకుడు పెంచింది. తాజాగా మరోసారి కేటీఆర్‌కు నోటీసులు జారీ చేసింది. ఈ నెల 28న విచారణకు హాజరు కావాలని ఆయనకు ఏసీబీ అధికారులు నోటీసులు పంపారు. ఇప్పటికే ఏసీబీ కేటీఆర్‌కు నోటీసులు పంపడం ఇది రెండోసారి.
స్పందించిన కేటీఆర్
దీనిపై కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా కేటీఆర్ రియాక్ట్ అయ్యారు. దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానని కేటీఆర్ ట్వీట్ చేశారు. చట్టాన్ని గౌరవించే ఓ పౌరుడిగా, కేసు అంతా పూర్తిగా రాజకీయ వేధింపు అయినప్పటికీ.. కచ్చితంగా దర్యాప్తు సంస్థలకు సహకరిస్తానని చెప్పారు.
ఇప్పటికే పలు కార్యక్రమాలకు సంబంధించి లండన్, అమెరికాకు వెళ్లాలని ప్లాన్ చేసుకున్నానని అన్నారు. ఆ ప్రోగ్రామ్స్ అన్ని పూర్తి చేసుకుని.. తిరిగి వచ్చిన వెంటనే దర్యాప్తు సంస్థల ముందు అటెండ్ అవుతానని చెప్పారు. ఏసీబీ అధికారులకు కూడా ఇదే విషయాన్ని లిఖితపూర్వకంగా తెలిపానని ఆయన ఎక్స్ లో రాసుకొచ్చారు. ఇదే సమయంలో 48 గంటల క్రితం నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి డబ్బు సరఫరా చేసినందుకు ఈడీ ఛార్జిషీట్‌లో సీఎం రేవంత్ రెడ్డి పేరు కనిపించిందని అన్నారు. మనీలాండరింగ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి ప్రమేయం ఉందని ఏ ఒక్క బీజేపీ నాయకుడు కూడా సీఎంపై ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదని కేటీఆర్ నిలదీశారు.
ALSO READ: KTR: ఆ 10 మందికి ఉపఎన్నికల్లో బుద్ది చెప్పాలి: కేటీఆర్
కవిత స్పందన..
తన సోదరుడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో విభేదాలు వచ్చాయని జరుగుతోన్న ప్రచారం నేపథ్యంలో కవిత సంచలన ట్వీట్ చేశారు. కేటీఆర్ కు ఏసీబీ నోటీసులపై కవిత తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ప్రజా సమస్యల నుంచి దృష్టి మళ్లించడానికే రేవంత్ సర్కార్ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని కవిత ఆరోపణలు చేశారు. తన సోదరుడు కేటీఆర్ కు ఏసీబీ నోటీసులు జారీ చేయడాన్ని ఖండిస్తున్నట్టు పేర్కొన్నారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకొని నిలబడిన చరిత్ర కేసీఆర్ సైనికులదని కవిత చెప్పుకొచ్చారు.