Puri Jagannath: పూరి జగన్నాథ్ (Puri Jagannath)ఒకానొక సమయంలో టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్గా ఓ వెలుగు వెలిగారు. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారందరికీ కూడా బ్లాక్ బాస్టర్ హిట్ సినిమాలను అందించిన ఘనత పూరి జగన్నాథ్ కు ఉంది. అయితే ఇటీవల కాలంలో పూరి సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోతున్నాయి. దీంతో ఈయన వరుస డిజాస్టర్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంటున్నారు. ఇలా వరుస ఫ్లాప్ సినిమాలు పూరి జగన్నాథ్ ను వెంటాడటంతో ఈయనతో సినిమాలు చేయటానికి కూడా హీరోలు ముందుకు రాలేదు.
బెగ్గర్ తో పూరి హిట్ కొడతారా…
ఇటీవల పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రామ్ హీరోగా నటించిన డబల్ ఇస్మార్ట్ సినిమా కూడా అనుకున్న స్థాయిలో ప్రేక్షకాదరణ పొందలేకపోయింది. ఈ సినిమా తర్వాత పూరి పూర్తిగా ఇండస్ట్రీకి దూరమవుతారని అందరూ భావించారు కానీ ఊహించని విధంగా కోలీవుడ్ నటుడు విజయ్ సేతుపతి (Vijay Sethupathi)పూరికి అవకాశం ఇచ్చారు. ఈ సినిమాతో తనని తాను నిరూపించుకుంటేనే ఈయనకు ఇండస్ట్రీలో మనుగడ ఉంటుందని స్పష్టమవుతుంది. ఇక ఈ సినిమాలో ఒక కీలక పాత్రలో సీనియర్ నటి టబు(Tabu) నటించబోతున్న విషయం తెలిసిందే. ఈమెతో పాటు మరొక హీరోయిన్ కూడా ఈ సినిమాలో నటిస్తున్నట్టు తెలుస్తుంది.
క్యామియో పాత్రలో నాగ్…
ఇకపోతే పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి కాంబోలో రాబోతున్న ఈ సినిమాకు బెగ్గర్(Begger) అనే టైటిల్ పెట్టాలనే ఆలోచనలో చిత్ర బృందం ఉన్నట్టు తెలుస్తుంది. ఇలా ఈ టైటిల్ సినిమాపై ఎంతో క్యూరియాసిటీని పెంచేస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. జూన్ నెల నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళబోతోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించి మరొక వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతుంది. ఇటీవల కాలంలో ప్రతి సినిమాలో కూడా క్యామియో రోల్ లో స్టార్ హీరోలు నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమాలో కూడా ఒక క్యామియో పాత్ర ఉందని, ఈ పాత్ర కోసం టాలీవుడ్ స్టార్ హీరోని లైన్లో పెట్టే ఆలోచనలో పూరి ఉన్నట్టు సమాచారం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో పూరి జగన్నాథ్ కు అత్యంత సన్నిహితులైనటువంటి హీరోలలో నాగార్జున (Nagarjuna) ఒకరు. వీరిద్దరి కాంబినేషన్లో సూపర్, శివమణి వంటి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాలను అందుకున్నాయి. ఇలాంటి తరుణంలోనే బెగ్గర్ సినిమాలో క్యామియో పాత్ర కోసం పూరి నాగార్జునను సంప్రదించాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ విషయం గురించి ఏ విధమైనటువంటి అధికారక ప్రకటన లేకపోయిన ఈ వార్తలు మాత్రం హల్ చల్ చేస్తున్నాయి. మరి పూరి అడిగితే నాగ్ సమాధానం ఏంటి? క్యామియో పాత్రలో నటించడానికి నాగ్ ఒప్పుకుంటారా? ఇది సాధ్యమయ్యేనా? అనేది తెలియాల్సి ఉంది.