E-Paper
Advertisement

Jagtial: జగిత్యాలలో ఏసీబీ పంజా.. సీఐ, టీచర్ కలిసి చేసిన దందా మామూలుగా లేదుగా!

Jagtial: జగిత్యాలలో ఏసీబీ పంజా.. సీఐ, టీచర్ కలిసి చేసిన దందా మామూలుగా లేదుగా!
Advertisement

Jagtial: జగిత్యాల జిల్లాలో అర్థరాత్రి జరిగిన ఏసీబీ సోదాలు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. కరీంనగర్ అర్బన్ ఎక్సైజ్ సీఐగా విధులు నిర్వహిస్తున్న గుండేటి రాము అక్రమ వసూళ్లకు పాల్పడుతూ ఏసీబీ అధికారులకు చిక్కారు. గతంలో ఆయన వేములవాడ ఎస్‌హెచ్‌ఓగా పనిచేసిన సమయంలో ఒక బెల్లం వ్యాపారి నుంచి పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేసి వసూలు చేసినట్లు అధికారుల విచారణలో తేలింది.

ఈ అవినీతి భాగోతంలో ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు మధ్యవర్తిగా వ్యవహరించడం గమనార్హం. జక్కని వేణు అనే ఉపాధ్యాయుడు సీఐ రాముకు సహకరిస్తూ.. అక్రమంగా వచ్చిన డబ్బును తన బ్యాంకు ఖాతా ద్వారా సీఐ కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించినట్లు ఏసీబీ గుర్తించింది. వీరిద్దరి మధ్య జరిగిన ఫోన్ సంభాషణలు, బ్యాంకు ట్రాన్సాక్షన్ల ఆధారంగా అధికారులు పక్కా ఆధారాలు సేకరించారు.

Advertisement

జగిత్యాలలోని దరూర్ క్యాంపులో ఉన్న సీఐ నివాసంలో జరిపిన సోదాల్లో భారీగా అక్రమ ఆస్తులు బయటపడ్డాయి. అధికారులు సుమారు 20 లక్షల రూపాయల నగదును, భారీ ఎత్తున బంగారు నగలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులిద్దరినీ అరెస్ట్ చేసిన ఏసీబీ బృందం వారిని కోర్టులో హాజరుపరిచింది. ప్రభుత్వ అధికారులు తమ అధికారాన్ని అడ్డం పెట్టుకుని సామాన్యులను ఇబ్బంది పెడితే కఠిన చర్యలు తప్పవని ఈ ఘటన మరోసారి నిరూపించింది.

Also Read: గన్నేరు పప్పు తిని ఎస్సై భార్య ఆత్మహత్య.. కారణం తెలిస్తే?

Advertisement

Related News

ఢిల్లీలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి అవార్డ్స్ 2026.. సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ వైరల్!

యూట్యూబ్‌లో చూసి నకిలీ నోట్ల తయారీ.. కానీ చివరికి ఎలా చిక్కాడంటే..?

హుజూరాబాద్‌లో మళ్లీ కాకరేపుతున్న రాజకీయ వేడి.. కాంగ్రెస్ వైఫల్యాలపై కౌశిక్ రెడ్డి భారీగా ధర్నా!

క్రికెట్ గ్రౌండ్ కోసం చెరువు కబ్జా చేస్తారా.. పట్టించుకోని అధికారులు!

ఆయనకు అన్నీ ఆశలు, కోరికలే ఉన్నాయి.. కేటీఆర్‌పై జగ్గారెడ్డి షాకింగ్ కామెంట్స్!

తెలంగాణలో భారీ డిఫెన్స్ ఎక్స్‌పో.. రాజ్‌నాథ్ సింగ్‌కు రేవంత్ స్పెషల్ ఇన్విటేషన్!

కుషాయిగూడ పీహెచ్‌సీలో ఊహించని పరిణామం.. డాక్టర్‌గా మారిన డీఎంహెచ్‌ఓ!

సీఎం ఛాన్స్ వస్తే.. ఆ దేవుడు కూడా ఆపలేడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Big Stories

Advertisement
×