E-Paper
Advertisement

నిమ్స్‌లో అవినీతి దందా.. రోగి చనిపోయిన 3 నెలల తర్వాత కూడా బిల్లుల ప్రాసెసింగ్!

నిమ్స్‌లో అవినీతి దందా.. రోగి చనిపోయిన 3 నెలల తర్వాత కూడా బిల్లుల ప్రాసెసింగ్!
Advertisement

NIMS Hospital: హైదరాబాద్‌లోని ప్రతిష్టాత్మక నిమ్స్ ఆసుపత్రిలో ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అక్టోబర్ 29, నవంబర్ 2 తేదీల్లో ఫుడ్ సేఫ్టీ, డ్రగ్ కంట్రోల్, లేబర్ శాఖల అధికారులతో కలిసి ఏసీబీ బృందాలు సోదాలు చేశాయి. ఈ తనిఖీల్లో బయటపడ్డ అక్రమాలు చూసి అధికారులే ఆశ్చర్యపోయారు.

ఆపరేషన్ థియేటర్లలో రూ.25 కోట్ల ఇంప్లాంట్ల దందా

Advertisement

ఆసుపత్రిలోని ఐదు ఆపరేషన్ థియేటర్లు, అల్మారాలను తనిఖీ చేయగా రూ.25 కోట్ల విలువైన ఇంప్లాంట్లు, వైద్య పరికరాలు అనధికారికంగా నిల్వ చేసి ఉండటం బయటపడింది. మెయిన్ స్టోర్‌కు కనీసం ఇండెంట్ పెట్టకుండానే సిబ్బంది నేరుగా వెండర్ల నుంచి వీటిని తెప్పించుకుని వాడేస్తున్నారు. పైగా, ఆరోగ్యశ్రీ రోగుల చికిత్సల్లోనే ఈ గోల్‌మాల్ ఎక్కువగా జరిగింది. ఒకే రోగికి వారంలో ఏకంగా 800 గ్లౌజులు వాడినట్లు రికార్డులు సృష్టించడం, రోగులు డిశ్చార్జ్ అయ్యాక రూ.66 లక్షల బిల్లులు వేయడం గమనార్హం. మరీ దారుణంగా, ఓ రోగి చనిపోయిన మూడు నెలల తర్వాత కూడా బిల్లులు ప్రాసెస్ చేశారు.

క్యాంటీన్, మెడికల్ షాపుల్లో నిర్లక్ష్యం

Advertisement

రోగులకు ఆహారం అందించే ప్రధాన క్యాంటీన్‌లో కనీసం ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ (FSSAI) రిజిస్ట్రేషన్ లేకపోగా, గడువు ముగిసిన ఆహార పదార్థాలు, అపరిశుభ్ర వాతావరణం కనిపించింది. ఇక మెడికల్ షాపుల్లో రిజిస్ట్రేషన్ లేని సిబ్బంది పనిచేస్తుండటంతో పాటు, సేల్స్ రికార్డులను కూడా సరిగ్గా నిర్వహించడం లేదు.

టెండర్లలోనూ చేతివాటం

2019–2025 మధ్య మ్యాన్‌పవర్ టెండర్లు పూర్తి చేయకుండానే నియామకాలు జరిపారు. సెక్యూరిటీ కాంట్రాక్టులను పదేపదే పొడిగించడమే కాకుండా, డిఫాల్ట్ అయిన ఏజెన్సీకి చెందిన రూ.28.13 లక్షల బ్యాంక్ గ్యారెంటీని కూడా అధికారులు జప్తు చేయలేదు. ప్రస్తుతం ఏసీబీ కీలక ఫైళ్లను స్వాధీనం చేసుకుని లోతుగా విచారిస్తోంది.

Also Read:ఎలాంటి నిర్ణయం లేకుండా ముగిసిన KRMB భేటీ.. కృష్ణా డెల్టాకు చుక్క నీరు ఇవ్వం: తెలంగాణ ENC

Tags

Related News

ఇది నిరూపిస్తే నేను రాజీనామాకు సిద్దం.. సీఎం రేవంత్‌కు కౌశిక్ రెడ్డి సవాల్!

రేవంత్ రెడ్డి నిస్సహాయతపై ప్రజల్లో ఆగ్రహం.. బాబుకు కవిత కీలక విజ్ఞప్తి

ఓట్లు మాకే ఉన్నాయి.. చోరీ మీదే.. రాహుల్‌కు నితిన్ నబీన్ స్ట్రాంగ్ కౌంటర్

మాకో న్యాయం.. వారికో న్యాయమా.. ఆందోళనలో తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు

గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం చేయండి.. నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు: సీఎం రేవంత్ రెడ్డి

దేశంలోనే టీజీఎస్ఆర్టీసీ సంచలన రికార్డు.. ఆ ఒక్క టెక్నాలజీతో రూ.36 కోట్లు ఆదా..?

ఏ పార్టీకైనా క్రమశిక్షణే ముఖ్యం.. కాంగ్రెస్‌లో అది బాగానే ఉంది: భట్టి విక్రమార్క

Big Stories

Advertisement
×