E-Paper
Advertisement

మాకో న్యాయం.. వారికో న్యాయమా.. ఆందోళనలో తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు

మాకో న్యాయం.. వారికో న్యాయమా.. ఆందోళనలో తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు
Advertisement

Artisan Transfers: స్వేచ్చ బ్యూరో: రాష్ట్రంలోని విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్న ఆర్టీజన్లకు బదిలీల విషయంలో అన్యాయం జరుగుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు రెగ్యులర్ ఉద్యోగులకు బదిలీలు చేపట్టేందుకు యాజమాన్యాలు సిద్ధమవుతుండగా.. మరోవైపు తమకు మాత్రం ట్రాన్స్‌ఫర్ పాలసీని వర్తింపజేయకపోవడంపై ఆర్టీజన్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గతంలో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా బదిలీలకు అవకాశం కల్పించిన సంస్థలు ఇప్పుడు తమను ఎందుకు పక్కన పెడుతున్నాయని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలు గతంలో ఇచ్చిన హామీలను విస్మరించాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎస్పీడీసీఎల్ పరిధిలో..

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 19,800 మంది ఆర్టీజన్లు విద్యుత్ సంస్థల్లో సేవలందిస్తున్నారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో దాదాపు 8,470 మంది, ఎన్పీడీసీఎల్ పరిధిలో దాదాపు 5,000 మంది, జెన్కో పరిధిలో 3,500 మంది, ట్రాన్స్‌కో పరిధిలో దాదాపు 2,830 మంది ఉన్నారు. వీరిలో చాలామంది తమ సొంత ప్రాంతాలకు దూరంగా పనిచేస్తున్నారు. బదిలీలు జరిగితే కుటుంబాలకు దగ్గరగా ఉండొచ్చని, పిల్లల చదువులు, కుటుంబ బాధ్యతలను సక్రమంగా నిర్వహించుకోవచ్చని ఆశించారు. అయితే ప్రస్తుత బదిలీల ప్రక్రియలో ఆర్టీజన్లకు అవకాశం కల్పించడం లేదన్న సమాచారం వారి ఆశలపై నీళ్లు చల్లినట్లయింది.

అదే పాలసీ..

Advertisement

2021 మే నెలలో రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా ఆర్టీజన్లకు కూడా బదిలీల ప్రక్రియ చేపట్టారు. 2022లోనూ ట్రాన్స్‌ఫర్ పాలసీ ప్రకారమే బదిలీలు జరిగినట్లు ఆర్టీజన్లు చెబుతున్నారు. ఒకసారి విధానపరమైన నిర్ణయం తీసుకుని పాలసీని అమలు చేసిన తర్వాత దాన్ని కొనసాగించాల్సిన బాధ్యత యాజమాన్యాలపై ఉంటుందని వారు పేర్కొంటున్నారు. కానీ ప్రస్తుతం రెగ్యులర్ ఉద్యోగులకే బదిలీలు పరిమితం చేయాలన్న నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుండటం ఆందోళనకు కారణమవుతోంది.

Also read: సంక్రాంతి తర్వాత ఇక సమరమే.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్!

ఫీల్డ్ స్థాయిలో..

Advertisement

ఆర్టీజన్లకు మాత్రం అదే పాలసీని వర్తింపజేయకపోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆర్టీజన్లను బదిలీలకు దూరంగా ఉంచడం వెనుక సంస్థాగత అవసరాలున్నాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఫీల్డ్ స్థాయిలో పనిచేసే ఆర్టీజన్లకు ఆయా ప్రాంతాల విద్యుత్ లైన్లు, సబ్‌స్టేషన్లు, స్థానిక సమస్యలు, సాంకేతిక పరిస్థితులపై మంచి అవగాహన ఉంటుంది. వారిని యథాతథంగా అదే ప్రాంతాల్లో కొనసాగిస్తే సంస్థకు ప్రయోజనం చేకూరుతుందని యాజమాన్యాలు భావిస్తున్నట్లు సమాచారం.

సమన్వయ సమస్యలు..

ఆర్టీజన్లను ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తే కొత్త ప్రాంతంలో పనిచేసే సిబ్బందికి అక్కడి పరిస్థితులపై అవగాహన రావడానికి సమయం పడుతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఆర్టీజన్లు కూడా బదిలీ అయితే ఫీల్డ్ స్థాయిలో రెగ్యులర్ ఉద్యోగులకు పనిభారం, సమన్వయ సమస్యలు తలెత్తే అవకాశం ఉందని యాజమాన్యాలు భావిస్తున్నాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా లైన్‌మెన్ విధులకు సంబంధించిన క్షేత్రస్థాయి పనుల్లో ఆర్టీజన్ల పాత్ర కీలకంగా ఉండటంతో వారిని ప్రస్తుత స్థానాల్లోనే కొనసాగించాలన్న ఆలోచన ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

సంస్థ అవసరాల పేరుతో..

విద్యుత్ సంస్థల అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న ఆర్టీజన్లకు బదిలీల విషయంలోనూ సమాన అవకాశాలు కల్పించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సంస్థ అవసరాల పేరుతో తమ కుటుంబ, వ్యక్తిగత అవసరాలను నిర్లక్ష్యం చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. గతంలో అమలు చేసిన బదిలీల విధానాన్ని కొనసాగించడంతోపాటు, ప్రస్తుత బదిలీల ప్రక్రియలో ఆర్టీజన్లకు కూడా అవకాశం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం, విద్యుత్ సంస్థల యాజమాన్యాలు ఈ అంశంపై స్పష్టమైన నిర్ణయం తీసుకుని తమకు న్యాయం చేయాలని దాదాపు 19,800 మంది ఆర్టీజన్లు ఆశగా ఎదురుచూస్తున్నారు.

Also Read: దేశంలోనే టీజీఎస్ఆర్టీసీ సంచలన రికార్డు.. ఆ ఒక్క టెక్నాలజీతో రూ.36 కోట్లు ఆదా..?

Tags

Related News

గ్లోబల్ సమ్మిట్‌కు సర్వం సిద్ధం చేయండి.. నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు: సీఎం రేవంత్ రెడ్డి

దేశంలోనే టీజీఎస్ఆర్టీసీ సంచలన రికార్డు.. ఆ ఒక్క టెక్నాలజీతో రూ.36 కోట్లు ఆదా..?

ఏ పార్టీకైనా క్రమశిక్షణే ముఖ్యం.. కాంగ్రెస్‌లో అది బాగానే ఉంది: భట్టి విక్రమార్క

సంక్రాంతి తర్వాత ఇక సమరమే.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్!

500 కాదు 5000 రోజులైనా కేసీఆర్ సీఎం కాలేరు! కేటీఆర్‌కు ఆది శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్!

ప్రేమ అంటే ఇదేరా భయ్! యూకే అమ్మాయిని తెలుగు ఇంటి కోడలిగా తెచ్చుకున్న ఖమ్మం కుర్రాడు!

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసే పోటీ చేస్తాయి.. బిజెపి అంటేనే వాటికి భయం: బండి సంజయ్

Big Stories

Advertisement
×