E-Paper
Advertisement

ఏ పార్టీకైనా క్రమశిక్షణే ముఖ్యం.. కాంగ్రెస్‌లో అది బాగానే ఉంది: భట్టి విక్రమార్క

ఏ పార్టీకైనా క్రమశిక్షణే ముఖ్యం.. కాంగ్రెస్‌లో అది బాగానే ఉంది: భట్టి విక్రమార్క
Advertisement

Bhatti Vikramarka: హైదరాబాద్‌లోని గాంధీ భవన్‌లో తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర రాజకీయాలపై, ముఖ్యంగా బీఆర్ఎస్ నేత కేటీఆర్ వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో స్పందించారు. పార్టీ ఇంచార్జ్‌తో జరిగిన సమావేశం తర్వాత ఆయన మాట్లాడిన అంశాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

కేటీఆర్‌కు సోషల్ మీడియానే ప్రపంచం

Advertisement

కేటీఆర్ ఇంకా ఊహాలోకంలోనే బతుకుతున్నారని.. సోషల్ మీడియానే అసలైన ప్రపంచం అని ఆయన భ్రమపడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రంలోని ప్రభుత్వ వ్యవస్థలన్నీ పూర్తిగా కుప్పకూలిపోయాయని ఆయన ఆరోపించారు. కేవలం నాలుగు కుటుంబాలు కలిసి వ్యవస్థలను నాశనం చేశాయన్నారు. చేసిన తప్పులను కప్పిపుచ్చుకోవడానికే బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని భట్టి మండిపడ్డారు. భవిష్యత్తులో వారికి తెలంగాణలో ఎలాంటి చోటు ఉండదని ఆయన స్పష్టం చేశారు. దెబ్బతిన్న ఆ వ్యవస్థలను తమ ప్రభుత్వం తిరిగి గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తోందని తెలిపారు.

సాగునీటి ప్రాజెక్టులు కాంగ్రెస్ ఘనతే

Advertisement

తెలంగాణకు కృష్ణా, గోదావరి నదీ జలాలను అందించింది గత కాంగ్రెస్ ప్రభుత్వాలేనని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం తమ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై పార్టీ ఇంచార్జ్‌తో విస్తృతంగా చర్చించినట్లు ఆయన పేర్కొన్నారు.

కాంగ్రెస్‌లో క్రమశిక్షణకు లోటు లేదు

ఇక పార్టీ అంతర్గత వ్యవహారాల గురించి ప్రస్తావిస్తూ.. ఏ రాజకీయ పార్టీకైనా క్రమశిక్షణ అత్యంత అవసరమని భట్టి అభిప్రాయపడ్డారు. తెలంగాణ కాంగ్రెస్‌లో క్రమశిక్షణ బాగానే ఉందని, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఇంచార్జ్‌తో సమాలోచనలు జరిపామని చెప్పారు. యూత్ కాంగ్రెస్‌లో సుదీర్ఘకాలం పనిచేసిన బీఎం సందీప్ అనుభవం తెలంగాణలో పార్టీ అభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందని భట్టి విక్రమార్క తెలిపారు.

Also Read: 500 కాదు 5000 రోజులైనా కేసీఆర్ సీఎం కాలేరు! కేటీఆర్‌కు ఆది శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్!

Tags

Related News

దేశంలోనే టీజీఎస్ఆర్టీసీ సంచలన రికార్డు.. ఆ ఒక్క టెక్నాలజీతో రూ.36 కోట్లు ఆదా..?

సంక్రాంతి తర్వాత ఇక సమరమే.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ సర్కార్!

500 కాదు 5000 రోజులైనా కేసీఆర్ సీఎం కాలేరు! కేటీఆర్‌కు ఆది శ్రీనివాస్ స్ట్రాంగ్ కౌంటర్!

ప్రేమ అంటే ఇదేరా భయ్! యూకే అమ్మాయిని తెలుగు ఇంటి కోడలిగా తెచ్చుకున్న ఖమ్మం కుర్రాడు!

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసే పోటీ చేస్తాయి.. బిజెపి అంటేనే వాటికి భయం: బండి సంజయ్

తెలంగాణకు ఏం చేశారని బీజేపీ నేతలు పర్యటనకు వస్తున్నారు?- కోమటి రెడ్డి

మాట నిలబెట్టుకున్న రేవంత్.. 214 మంది మావోయిస్టులకు రూ.5.59 కోట్ల రివార్డులు!

Big Stories

Advertisement
×