E-Paper
Advertisement

8.20 శాతం వడ్డీ రేటు… ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే అధిక వడ్డీ ఇచ్చే ఈ 7 పథకాల గురించి తెలుసా ?

8.20 శాతం వడ్డీ రేటు… ఫిక్స్‌డ్ డిపాజిట్ల కంటే అధిక వడ్డీ ఇచ్చే ఈ 7 పథకాల గురించి తెలుసా ?
Advertisement

Best Government Saving Schemes: ప్రతి ఒక్కరూ తమ పొదుపు మొత్తంపై మంచి వడ్డీ రావాలని కోరుకుంటారు. చేతిలో కొంత డబ్బు ఉన్నప్పుడు దాన్ని ఎక్కడ పెట్టుబడి పెడితే మంచి వడ్డీ వస్తుందా అని చాలామంది ఆలోచిస్తుంటారు. ఎక్కువ రాబడి కోసం రిస్క్ తీసుకోవడం ఇష్టం లేని వాళ్లకు పోస్టాఫీస్, ప్రభుత్వ పొదుపు పథకాలు మంచి ఆప్షన్లుగా ఉంటాయి. వీటిలో కొన్ని పథకాలు ఏడాదికి 8.20 శాతం వరకు వడ్డీని అందిస్తున్నాయి. సీనియర్ సిటిజన్ల నుంచి ఆడపిల్లల భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనుకునే తల్లిదండ్రుల వరకు వేర్వేరు అవసరాలకు తగ్గట్టుగా ఈ పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఆ ఏడు పథకాల గురించి ఇప్పడు తెలుసుకుందాం. తెలుసుకోవడమే కాదు వీటిలో ఇన్వెస్ట్ చేసినా భద్రత కూడా గట్టిగా ఉంటుంది.

1. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ (SCSS)

60 ఏళ్లు దాటిన వారి కోసం కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని అందిస్తోంది. ప్రస్తుతం ఇందులో ఏడాదికి 8.20 శాతం వడ్డీ వస్తోంది. ఐదేళ్ల పాటు డబ్బును పెట్టుబడిగా ఉంచాలి. కావాలనుకుంటే మరో మూడేళ్లు పొడిగించుకోవచ్చు. గరిష్టంగా రూ.30 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఇందులో వచ్చే వడ్డీని ప్రతి మూడు నెలలకోసారి చెల్లిస్తారు. రిటైర్మెంట్ తర్వాత క్రమం తప్పకుండా ఆదాయం కావాలనుకునే వారికి ఇది ఉపయోగపడుతుంది.

2. సుకన్య సమృద్ధి యోజన (SSY)

Advertisement

ఇంట్లో ఆడపిల్ల ఉంటే ఆమె భవిష్యత్తు కోసం ఈ పథకంలో పొదుపు చేయొచ్చు. పదేళ్లలోపు వయసున్న కుమార్తె పేరు మీద ఖాతా తెరవవచ్చు. ఏడాదికి కనీసం రూ.250 నుంచి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు డబ్బు జమ చేయవచ్చు. ప్రస్తుతం 8.20 శాతం వడ్డీ లభిస్తోంది. భవిష్యత్తులో అమ్మాయి చదువు, పెళ్లి ఖర్చులకు ఉపయోగపడేలా దీర్ఘకాలికంగా డబ్బు కూడబెట్టుకోవచ్చు. ఇప్పుడు పెద, మధ్యతరగతి వాళ్ళు ఆడపిల్లల భవిష్యత్తు కోసం ఎక్కువగా ఇందులోనే ఇన్వెస్ట్ చేస్తున్నారు.

3. ఆర్‌బీఐ ఫ్లోటింగ్ రేట్ సేవింగ్స్ బాండ్స్

రిజర్వ్ బ్యాంక్ అందించే ఈ బాండ్లపై ప్రస్తుతం 8.05 శాతం వడ్డీ వస్తోంది. అయితే ఈ వడ్డీ రేటు ఎప్పుడూ ఒకేలా ఉండదు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి మారే అవకాశం ఉంటుంది. ఇందులో పెట్టుబడి పెడితే ఏడేళ్ల వరకు డబ్బును ఉంచాలి. వడ్డీ మాత్రం ఆరు నెలలకోసారి చేతికి అందుతుంది. మధ్యలో డబ్బు తీసుకోవాలంటే కొన్ని నిబంధనలు పాటించాలి.

4. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (NSC)

Advertisement

పోస్టాఫీస్‌లో అందుబాటులో ఉండే ఈ పథకంలో 7.70 శాతం వడ్డీ లభిస్తోంది. ఐదేళ్ల పాటు పెట్టుబడి కొనసాగించాలి. కేవలం రూ.1,000తోనే ప్రారంభించవచ్చు. గరిష్ట పెట్టుబడి పరిమితి లేదు. ఇందులో వచ్చే వడ్డీకి చక్రవడ్డీ కలుస్తుంది. మెచ్యూరిటీ సమయంలో మొత్తం డబ్బు చేతికి అందుతుంది. అర్హత ఉన్న పెట్టుబడులకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80C కింద మినహాయింపు కూడా ఉంటుంది.

5. కిసాన్ వికాస్ పత్ర (KVP)

పెట్టిన డబ్బు కొంతకాలానికి రెట్టింపు కావాలనుకునే వారికి ఈ పథకం ఉపయోగపడుతుంది. ప్రస్తుతం ఏడాదికి 7.50 శాతం వడ్డీ ఇస్తున్నారు. ఇందులో కనీసం రూ.1,000 పెట్టుబడి పెట్టాలి. గరిష్ట పరిమితి లేదు. ఈ పథకంలో పెట్టిన డబ్బు 115 నెలల్లో అంటే 9 సంవత్సరాల 7 నెలలకు రెట్టింపు అవుతుంది.

6. పోస్టాఫీస్ ఐదేళ్ల టైమ్ డిపాజిట్

బ్యాంకుల్లో ఎఫ్‌డీ ఎలా పనిచేస్తుందో పోస్టాఫీస్ టైమ్ డిపాజిట్ కూడా అలాగే ఉంటుంది. ఇందులో ఒకేసారి కొంత మొత్తాన్ని జమ చేసి ఐదేళ్ల పాటు ఉంచాలి. ప్రస్తుతం 7.50 శాతం వడ్డీ లభిస్తోంది. గడువు పూర్తయ్యాక అసలు డబ్బుతో పాటు వడ్డీ కూడా అందుతుంది. ఈ ఐదేళ్ల డిపాజిట్‌కు సెక్షన్ 80C కింద పన్ను మినహాయింపు పొందే అవకాశం ఉంది.

7. బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు (FD)

పోస్టాఫీస్ పథకాలతో పాటు బ్యాంకుల ఎఫ్‌డీలను కూడా పరిశీలించవచ్చు. కొన్ని బ్యాంకులు నిర్దిష్ట కాలపరిమితి డిపాజిట్లపై 7.50 శాతం వడ్డీ ఇస్తున్నాయి. అయితే అన్ని బ్యాంకుల్లోనూ ఒకే రేటు ఉండదు. ఎంతకాలం డబ్బు ఉంచుతున్నారు, ఏ బ్యాంకులో పెడుతున్నారు అనే అంశాలను బట్టి వడ్డీ మారుతుంది. ఇక సీనియర్ సిటిజన్లకు కొన్ని బ్యాంకులు అదనపు వడ్డీ కూడా ఇస్తాయి.

చివరగా పెట్టుబడి పెట్టే ముందు ఒక విషయం గుర్తుంచుకోవాలి. వడ్డీ ఎక్కువగా ఉందని మాత్రమే పథకాన్ని ఎంచుకోవద్దు. మీకు ఎప్పుడు డబ్బు అవసరం అవుతుంది, మధ్యలో తీసుకునే అవకాశం ఉందా, వచ్చే వడ్డీపై పన్ను ఎంత పడుతుంది వంటి విషయాలను కూడా చూసుకోవాలి. మీ అవసరాలకు సరిపోయే పథకంలోనే డబ్బు పెట్టుబడి పెట్టడం మంచిది.

Read Also: 20 ఏళ్ల పాటు ప్రతి నెలా 30000 విత్‌డ్రా చేసినా అకౌంట్లో 75 లక్షలు… PF ఉన్నోళ్ళకే ఈ గోల్డెన్ ఛాన్స్

Related News

20 ఏళ్ల పాటు ప్రతి నెలా 30000 విత్‌డ్రా చేసినా అకౌంట్లో 75 లక్షలు… PF ఉన్నోళ్ళకే ఈ గోల్డెన్ ఛాన్స్

కోకాపేట, నార్సింగిలో ఖాళీగా ఖరీదైన ఫ్లాట్లు.. దిగొస్తున్న బిల్డర్లు, ఇళ్లు కొనేవారికి ఇదే గోల్డెన్ ఛాన్స్!

బ్లింకిట్ డెలివరీ బాయ్ సక్సెస్ స్టోరీ.. మొదటి నెలలోనే రూ. 39 వేల సంపాదన..!

బంగారు నగలను”గులాబీ రంగు కాగితం”లోనే ఎందుకు ప్యాక్ చేస్తారో తెలుసా?

బిస్లెరీ నీరు తాగొచ్చా? వద్దా? FSSAI నివేదికపై బిస్లెరీ సంస్థ ఏం చెప్పిందంటే?

ఉక్కు రంగంలో భారీ ఒప్పందం.. ఏపీఎల్ అపోలో చేతికి టాటా స్టీల్ కీలక విభాగాలు.. డీల్ విలువ ఎంతంటే?

బంగారం ధరలు ఒక్కసారిగా ఎందుకు తగ్గిపోయాయి? ఈ భారీ పతనానికి ప్రధాన కారణాలివే

Big Stories

Advertisement
×