BigTV English

ACB Raids Telangana: పైకి ముత్యం, లోపల స్వాతిముత్యం.. కాళేశ్వరం ఇంజినీర్ల లీలలు

ACB Raids Telangana: పైకి ముత్యం, లోపల స్వాతిముత్యం.. కాళేశ్వరం ఇంజినీర్ల లీలలు

ACB Raids Telangana: ఏ గవర్నమెంట్ ఆఫీసుకు వెళ్లినా ఏమున్నది గర్వకారణం? పైకి ఒకరు ఆణిముత్యం.. ఇంకొకరు స్వాతిముత్యం అన్నట్లుగా సీన్లు ఉన్నాయి. జీతాలు లక్షల్లో వస్తున్నా, టీఏ, డీఏలు దండిగా ఇస్తున్నా.. లోలోపల మాత్రం లంచాలకే బాగా మరుగుతున్నారు. పైసా చేతుల్లో పడందే ఫైల్ ముందుకు కదలట్లేదు. ప్రజలకు ఫ్రీగా పని చేస్తే మనకేం వస్తుందనుకుంటున్నారు. చేయి చాచి లంచం డబ్బులు అడుక్కుంటున్నారు. కొందరైతే డిమాండ్ చేస్తున్నారు. ప్రతి పనికి లంచం లంచం లంచం. ఎవరికీ దొరకం అనుకుంటున్నారా? బరి తెగిస్తున్నారా? తెలంగాణలో ఏసీబీ కేసుల లెక్కేంటి? మేతగాళ్లు ఎలా ట్రాప్ లో ఇరుక్కుంటున్నారు? ట్రాప్ ఆపరేషన్స్ ను ఏసీబీ ఎలా చేసింది? ఇటీవల సంచలనం సృష్టించిన ఏసీబీ కేసులేంటి? ఓ లుక్కేయండి.


ఆరు నెలల్లో 122 అవినీతి కేసులు

తెలంగాణ ఏసీబీ ఈ ఏడాది ఆరు నెలల్లో 122 కేసులు నమోదు చేసింది. గతేడాది కంటే ఈ నెంబర్ చాలా ఎక్కువ. GHMC, ఇరిగేషన్ డిపార్ట్‌మెంట్ అధికారులపై ట్రాప్ కేసులే ఎక్కువ. ఓవరాల్ గా చూస్తే ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ ఇంజినీర్లు, అందులోనూ కాళేశ్వరం పనులు చూసుకున్న వాళ్లు, ఇటు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ డిపార్ట్ మెంట్లలో ఆఫీసర్ల పంట పండింది. సీన్ కట్ చేస్తే ఏసీబీ ఎంట్రీతో ఇప్పుడు బెండు మిగిలింది. అదీ సంగతి.


గాయత్రి పంప్ హౌస్ ఇంఛార్జ్ నూనె శ్రీధర్

ఈయన పేరు నూనె శ్రీధర్. కాళేశ్వరం ప్రాజెక్టులోని గాయత్రి పంప్ హౌస్ ​కు ఇన్ ​చార్జిగా వ్యవహరించిన ఇరిగేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన భారీ ప్రాజెక్టుల్లో అవినీతికి పాల్పడినట్టు కంప్లైంట్స్ రావడంతో ఆయనపై ఏసీబీ అధికారులు కేసు ఫైల్ చేశారు. ఇప్పుడు ఆస్తుల చిట్టా విప్పితే అస్సలు తేలట్లేదు. లిస్టు భారీగానే ఉంది. ఏసీబీ ఆఫీసర్ల కళ్లు బైర్లు కమ్ముతున్నాయ్. బంగారం, డైమండ్లు, ప్లాటినం ఆభరణాలు, కార్లు, ఆస్తి పత్రాలు, వాటి మార్కెట్ వాల్యూ ఇవన్నీ లెక్కేయడం కొందరితో అవ్వట్లేదు. అదీ కథ. ఓవరాల్ గా చూస్తే 200 కోట్లకు పైనే ఆస్తులున్నట్లు లెక్క తేలింది. ఇదంతా కాళేశ్వరం మహిమే మరి.

నూనె శ్రీధర్‌‌‌‌ ‌‌‌‌చొప్పదండి సీఏడీ డివిజన్‌‌‌‌ 8 ఈఈగా బాధ్యత

శ్రీధర్‌‌‌‌ ప్రస్తుతం ‌‌‌‌చొప్పదండిలోని ఎస్సారెస్పీ క్యాంప్‌‌‌‌ ఇరిగేషన్‌‌‌‌ సీఏడీ డివిజన్‌‌‌‌ 8 ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌‌‌‌ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. టైగర్‌‌‌‌‌‌‌‌ అనే ఇంజినీర్ల సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈనయకు కాళేశ్వరం ప్రాజెక్ట్‌‌‌‌ నిర్మాణం ఆయనకు బాగా కలిసొచ్చిందంటున్నారు. గాయత్రి పంప్‌‌‌‌హౌస్‌‌‌‌ ఇన్​చార్జిగా అక్రమాలకు పాల్పడ్డట్లు ఏసీబీకి ఫిర్యాదులు అందాయి. వచ్చిన డబ్బులతో హైదరాబాద్‌‌‌‌, కరీంనగర్‌‌‌‌‌‌‌‌, వరంగల్‌‌‌‌లో పెట్టుబడులు పెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. మలక్‌‌‌‌పేట్‌‌‌‌లో 4 అంతస్తుల బిల్డింగ్‌‌‌‌, షేక్‌‌‌‌పేట్‌‌‌‌లోని స్కై హై అపార్ట్‌‌‌‌ మెంట్స్‌‌‌‌ లో 4,500 SFT విస్తీర్ణంలో లగ్జరీ ఫ్లాట్‌‌‌‌, తెల్లాపూర్‌‌‌‌‌‌‌‌లోని ఉర్జిత్‌‌‌‌ గేటెడ్ ఎన్‌‌‌‌క్లేవ్‌‌‌‌లో విల్లా, అమీర్‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌లో కమర్షియల్‌‌‌‌ స్పేస్‌‌‌‌, వరంగల్ లో జీ ప్లస్ 3 బిల్డింగ్, కరీంనగర్‌‌‌‌‌‌‌‌లో 3 ఫ్లాట్లు, ఇండిపెండెంట్‌‌‌‌ బిల్డింగ్‌‌‌‌ సహా 16 ఎకరాల వ్యవసాయ భూమి, కరీంనగర్ లోని పలు ప్రముఖ హోటళ్లలో పార్ట్ నర్ షిప్ ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.

ప్రతినెలా నూనె శ్రీధర్ కు రూ.50 లక్షలకు పైగా రెంటల్ ఇన్ కం

హైదరాబాద్‌‌‌‌ అమీర్‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌లోని కమర్షియల్‌‌‌‌స్పేస్‌‌‌‌లో ప్రతినెలా నూనె శ్రీధర్ కు 50 లక్షలకు పైగా ఆదాయం వస్తున్నట్టు ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ అక్రమ సంపాదనతో తన కుమారుడి పెళ్లి థాయ్‌‌‌‌లాండ్‌‌‌‌లో ఘనంగా నిర్వహించినట్లు ఏసీబీ గుర్తించింది. పెళ్లి కోసం బంధుమిత్రులకు ప్రత్యేకంగా ఫ్లైట్ బుక్ చేసినట్లు కూడా ఐడెంటిఫై చేశారు. ఇప్పుడు నూనె శ్రీధర్ బినామీల వివరాలు బయటకు తీస్తున్నారు. ఇదంతా ఒక్క ఆఫీసర్ పని తనమే.

రూ. 200 కోట్లకుపైగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు గుర్తింపు

ఇక ఈయన కాళేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ చీఫ్ ENC హరి రామ్. 200 కోట్లకుపైగా అక్రమ ఆస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏక కాలంలో 14 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించగా కళ్లు బైర్లు కమ్మే ఆస్తులు బయటపడ్డాయి. గజ్వేల్‌లో భారీగా అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. మార్కుక్ లో 28 ఎకరాల భూమి, కొండాపూర్, షేక్ పేట్, శ్రీనగర్, మాదాపూర్ ప్రాంతాల్లో ఖరీదైన ఫ్లాట్లు, విల్లాలను ఏసీబీ అధికారులు గుర్తించారు. పటాన్ చెరువులో 20 గుంటల భూమి, ఆరెకరాల మామిడి తోట, ఫామ్ హౌస్‌ ఉన్నట్లు తేల్చారు. ఫైనల్ గా ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్ట్ అయ్యారు. హరిరామ్‌కు మాజీ సీఎం కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌ ఉన్న మర్కూక్‌ మండలంలోనే 28 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. తవ్వుతూ వెళ్తే అవినీతి ఆఫీసర్లకు ఎవరికెన్ని ఆస్తులు ఉన్నాయో ఏసీబీ అధికారులకు లెక్కించడానికే నెలల టైం పట్టేట్లు కనిపిస్తోంది. ఎందుకంటే అన్ని డిపార్ట్ మెంట్లలో మేతగాళ్లు అలా తయారయ్యారు మరి.

గోల్నాక వార్డు ఆఫీస్ లో రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న ఏసీబీ

ఈవిడ పేరు మనీషా. జీహెచ్‌ఎంసీ ఇంజనీరింగ్‌ విభాగం ఏఈ. ఓ కాంట్రాక్టర్‌ దగ్గర లంచం తీసుకుంటూ జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ – 16 పరిధిలోని గోల్నాక వార్డు ఆఫీస్ లో ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. నల్లకుంట డివిజన్‌ ఏఈగా కొంత కాలం పని చేసి ప్రస్తుతం గోల్నాక డివిజన్‌లో విధులు నిర్వహిస్తున్నారు. డివిజన్‌ పరిధిలోని ఓ పనిని పూర్తి చేసిన కాంట్రాక్టర్‌ ఆ బిల్లు కోసం ఏఈని అడగగా.. ఆమె 15 వేలు లంచం డిమాండ్‌ చేసింది. దీంతో కాంట్రాక్టర్‌ మొదటి విడతగా 5 వేలు ఇచ్చాడు. రెండో విడత అందించేందుకు ముందు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

సర్కిల్‌ 16 పరిధిలో అధికారులపై అవినీతి ఆరోపణలు

గోల్నాక వార్డ్ ఆఫీస్ లో లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ఏఈ మనీషా ఏసీబీకి పట్టుబడక ముందు అభివృద్ధిపై ఎమ్మెల్యే నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. సమీక్షా సమావేశం పూర్తి కాకముందే పర్మిషన్ తీసుకుని బయటకు వచ్చి మరీ ఏసీబీకి పట్టబడడం మరో హైలెట్. ఈ ఘటన జూన్ 23న జరిగింది. జీహెచ్‌ఎంసీ అంబర్‌పేట సర్కిల్‌ 16 పరిధిలో పనిచేస్తున్న ఇంజనీరింగ్‌ విభాగం అధికారులపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి.

ఏసీబీకి చిక్కిన ఇంజినీరింగ్ ఏఈ స్వరూప

ఈ ఆఫీసర్ పేరు స్వరూప. ఇంజినీరింగ్ ఏఈ. చర్లపల్లి డివిజన్‌ పరిధిలో సీసీ రోడ్డు పనులు పూర్తి చేసిన కాంట్రాక్టర్‌ రామిరెడ్డి నుంచి 1.20 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడింది. చర్లపల్లి డివిజన్‌ పరిధిలో 28.50 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు వేశారు. తొలుత 26 లక్షలు మంజూరయ్యాయి. మిగతా 2.50 లక్షల కోసం తిరిగితే 1.20 లక్షలు ఇస్తే బిల్లు ప్రాసెస్‌ చేస్తానని స్వరూప చెప్పడంతో గత్యంతరం లేని కాంట్రాక్టర్‌ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ ఘటన జూన్ 17న జరిగింది. గతంలో కూడా ఈవిడ లంచాలు భారీగా డిమాండ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి.

బ్యాండ్​ వాయించే వాళ్ల దగ్గర కూడా చేతివాటం

ఇక్కడ మీరు చూస్తున్నది జగద్గిరి గుట్ట ఎస్ఐ శంకర్. శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్నారని ఓ బ్యాండ్ ​కు చెందిన వాహనాన్ని, సామగ్రిని సీజ్​ చేశాడు. ఆ బండి బయటకు పంపాలంటే 15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేసి ఇదిగో ఇలా ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు. శుభకార్యాలకు బ్యాండ్​ వాయించే వాళ్ల దగ్గర కూడా చేతివాటానికి దిగుతున్న పరిస్థితి. మే 24న ఈ ఘటన జరిగింది. ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే. బయటకు రాని కేసులెన్నో. తమ పని అయితే చాలు.. కేసులు పెట్టిస్తే మొదటికే ఇబ్బంది అనుకునే వారు.. అవసరం లేకపోయినా డబ్బులు ఇచ్చుకుంటూ నష్టపోతున్నారు. లంచం ఇవ్వడం, తీసుకోవడం రెండూ నేరమే అని మర్చిపోతున్నారు.

సర్వీస్ లో రిమార్క్ అన్న భయం లేదు..
ఏసీబీ అంటే లెక్కలేదు..
లంచాలు తీసుకునేందుకు తగ్గేది లేదు..
అరెస్ట్ అయినా మళ్లీ మళ్లీ అవే పనులు..
ఇదీ కొందరు ప్రభుత్వ సిబ్బంది నిర్వాకం..

ఏసీబీ కేసులంటే లెక్క లేనితనం ప్రభుత్వాధికారుల్లో పెరుగుతోందా అంటే అవునన్న సమాధానమే వస్తోంది. ఈ కేసులను చాలా లైట్ తీసుకుంటున్నారు. కేసు విచారణ జరిగి ఫైనల్ గా శిక్షలు పడుతున్నవి వేళ్లపై లెక్కించవచ్చు. రెడ్ హ్యాండెడ్ గా దొరికినా సరే మళ్లీ వేగంగా పోస్టుల్లోకి వచ్చేస్తున్నారు. మళ్లీ మళ్లీ అదే లంచాలకు అలవాటుపడుతున్నారు. కొందరైతే అవినీతి ఆరోపణలపై రెండుమూడుసార్లు అరెస్ట్ అయిన వాళ్లూ ఉంటున్నారు.

ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు 112 కేసులు

ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు 112 కేసుల్ని ఏసీబీ ఫైల్ చేసింది. ఈ లెక్కలు చూస్తే చాలు అవినీతి అధికారుల్లో మార్పు రావడం లేదన్న విషయం ఈజీగా తెలుస్తుంది. పైసలు ఇవ్వనిదే పని జరగట్లేదు. దీంతో ఏసీబీకి కంప్లైంట్స్ పెరిగిపోతున్నాయి. ఈ ఏడాది 4 నెలల వ్యవధిలోనే 85 కేసులు నమోదుకాగా 92 మంది ఏసీబీకి చిక్కారు. ఏప్రిల్ లో 21 కేసులు నమోదయ్యాయి. అందులో 13 ట్రాప్‌‌‌‌ కేసులు, రెండు ఆదాయానికి మించిన ఆస్తుల కేసుల్లో 20 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి చిక్కారు. గతేడాది 152 కేసుల్లో 223 మందిని ఏసీబీ అరెస్టు చేసింది. అందులో 129 ట్రాప్‌‌‌‌ కేసుల్లో 200 మంది దొరికారు. ఇందులో 159 మంది ప్రభుత్వ ఉద్యోగులు, 41 మంది ఔట్‌‌‌‌సోర్సింగ్‌‌‌‌, ప్రైవేట్ వ్యక్తులు ఉన్నారు. 2024లో నమోదైన 152 కేసులు 2023లో నమోదైన 95 కేసులతో పోలిస్తే 60% ఎక్కువ. 2025 మొదటి ఆరు నెలల్లోనే 122 కేసులు అంటే మామూలు విషయం కాదు.

సర్ ప్రైజ్ చెకింగ్స్, ట్రాప్ కేసుల్లో ఏసీబీ దూకుడు

అవినీతి అధికారులపై ఏసీబీ అధికారులు కొరఢా ఝుళిపిస్తున్నారు. అవినీతిని నిర్మూలించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో ఏసీబీ డీజీ విజయ్‌‌‌‌ కుమార్‌‌‌‌ ‌‌‌‌నేతృత్వంలో స్పీడ్ పెంచారు. సర్ ప్రైజ్ చెకింగ్స్, ట్రాప్ కేసుల్లో దూకుడు పెరిగింది. అవినీతి అధికారులను వలవేసి పట్టుకుంటున్నారు. గతంతో పోలిస్తే ఇటీవల కాలంలో కంప్లైంట్స్ సంఖ్య పెరిగిపోయింది. ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్‌‌‌‌‌‌‌‌ 1064తో పాటు మెయిల్స్ ద్వారా కూడా ఆయా జిల్లాల ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు వెళ్తున్నాయి. తెలంగాణ ఏసీబీ పేరుతో ఫేస్ బుక్, ఎక్స్ ప్లాట్ ఫామ్స్ ఉండడంతో బాధితులు ఫిర్యాదు చేయడానికి చాలా ఈజీ అయింది.

ఏసీబీకి దొరుకుతున్న వారిలో పోలీస్ సిబ్బందే ఎక్కువ

ఏసీబీకి పట్టుపడుతున్న వారిలో ఎక్కువ శాతం పోలీస్ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌కు చెందిన వారే ఉంటున్నారు. లా అండ్ ఆర్డర్ అంటూనే కొందరు మనీ ఆర్డర్ చేస్తున్న పరిస్థితి. అవినీతిలో తర్వాతి స్థానాల్లో రెవెన్యూ, ఎలక్ట్రిసిటీ, ట్రాన్స్‌‌‌‌పోర్ట్‌‌‌‌, బీసీ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌, సోషల్ వెల్ఫేర్‌‌‌‌‌‌‌‌, ఫారెస్ట్‌‌‌‌, అగ్రికల్చర్, ఎడ్యుకేషన్‌‌‌‌, పంచాయతీరాజ్‌‌‌‌ రూరల్ డెవలప్‌‌‌‌మెంట్‌‌‌‌, ఆర్ అండ్ బీ, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి చెందిన ఉద్యోగులు, ఔట్‌‌‌‌సోర్సింగ్‌‌‌‌ సిబ్బంది ఉన్నారు. పోలీస్ స్టేషన్లలో పనిచేసే కింది స్థాయి సిబ్బంది నుంచి డీఎస్పీ స్థాయి అధికారి వరకు కలెక్షన్ల కోసం ప్రైవేట్ వ్యక్తులతో నెట్‌‌‌‌వర్క్‌‌‌‌ ఏర్పాటు చేసుకుంటున్నట్లు ఏసీబీ అధికారుల దర్యాప్తులో వెల్లడైంది. బాధితుల ఫిర్యాదులను ఆసరాగా చేసుకుని అందినకాడికి వసూలు చేస్తున్న పోలీసులను వలవేసిపట్టుకుంటున్నారు.

ట్రాప్ కేసులతో పాటే అక్రమాస్తులు కూడబెట్టిన వారిపై నజర్

చిన్న పనులకు సైతం లక్షల్లో లంచం డిమాండ్ చేస్తూ, ప్రజల కష్టార్జితాన్ని పిలిచి పిప్పి చేస్తున్నారు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. ప్రతి శాఖలోనూ అవినీతి అనకొండలు ఉన్నారు. వీరి భరతం పట్టేందుకు ఏసీబీ అధికారులు సైతం రెడీ ్వుతున్నారు. ఇందుకు నిదర్శనమే వరుస అరెస్టులు. పెరుగుతున్న కేసులు. కేవలం ట్రాప్ కేసులే కాదు.. విపరీతంగా ఆస్తులు సంపాదించుకున్న వారి వివరాలను తెలుసుకునే పనిలో ఏసీబీ ఉంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులు ఫైల్ చేస్తోంది. ఆస్తులన్నీ తవ్వి తీస్తోంది.

గ్రౌండ్ లో కీలకంగా ఉన్న 14 మంది సెక్షన్ ఆఫీసర్ల బదిలీ

ప్రజలతో నేరుగా సంబంధాలున్న కొన్ని కీలక శాఖలు ఉంటాయి. అలాంటి చోట్ల జనాన్ని ఆఫీసర్లు జలగల్లా పీడించుకు తింటున్నారు. ఎవరినీ వదిలిపెట్టడం లేదు. కొందరైతే మాజీ ఉద్యోగులు అని కూడా కనికరం చూపకుండా పిండేస్తున్నారు. పదవీ విరమణ తర్వాత వచ్చే డబ్బుల కోసం కూడా తిప్పించుకుని లంచాలు వసూల్ చేస్తున్న పరిస్థితి. ఇలాంటి కంప్లైంట్స్ పెరుగుతుండడం, అధికారుల అవినీతి, ఏసీబీ దాడులతో GHMC పరిధిలో టౌన్ ప్లానింగ్ విభాగాన్ని పూర్తిగా ప్రక్షాళన చేయాలని జీహెచ్ంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా 13మంది అసిస్టెంట్ సిటీ ప్లానర్లను ట్రాన్స్ ఫర్ చేశారు. వీరితోపాటు టౌన్ ప్లానింగ్ విభాగంలోని గ్రౌండ్ లెవెల్ లో కీలకంగా వ్యవహరిస్తున్న 14 మంది సెక్షన్ ఆఫీసర్లను సైతం బదిలీ చేశారు. మొత్తం 27 మంది అధికారులకు స్థానం చలనం కల్పిస్తూ జూన్ 21న ఉత్తర్వులు జారీ చేశారు. అదీ పరిస్థితి. రకరకాల ఆరోపణలు రావడంతో గతేడాది జనవరిలో ఇలాగే పంజాగుట్ట పీఎస్ లో 86 మందిని ట్రాన్స్ ఫర్ చేశారు.

డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీలో ఏళ్లకేళ్లు పెండింగ్‌

ట్రాప్ కేసులు సాధారణంగా త్వరగా దర్యాప్తు అవుతాయి. ఎందుకంటే ఇవి రెడ్ హ్యాండెడ్ అరెస్టులపై ఆధారపడతాయి. ఆడియో, వీడియో ఎవిడెన్స్, ఫిర్యాదుదారుల స్టేట్‌మెంట్స్‌తో కేసు బలంగా ఉంటుంది. అయినప్పటికీ చాలా మందిలో భయం లేకుండా పోతోంది. RTI ద్వారా తెలిసిన విషయాలేటంటే.. కొన్ని కేసులు డిపార్ట్‌మెంటల్ ఎంక్వైరీకి పంపాక.. ఏళ్లకేళ్లు పెండింగ్‌లో ఉంటున్నాయి. అక్కడ తేలడం లేదు. ఇంతలో అవినీతి ఉద్యోగి సర్వీస్ కంప్లీట్ అవుతోంది. అదీ మ్యాటర్.

Story By Vidya Sagar, Bigtv Live

Related News

Formula E race case: ఫార్ములా ఈ రేస్ కేసులో సంచలన పరిణామం.. ప్రభుత్వానికి ఏసీబీకి నివేదిక

Weather update: మళ్లీ ఈ ప్రాంతాల్లో భారీ వర్షం.. ఉరుములు, మెరుపులతో కూడిన పిడుగుల వాన, జాగ్రత్త!

Warangal Incident: ‘నా భార్యతో ప్రాణహాని ఉంది’.. పోలీస్ స్టేషన్ మెట్లెక్కిన భర్త

Heavy Rains: రాష్ట్రంలో ఒకవైపు సూర్యుడి భగభగలు.. మరోవైపు భారీ వర్షాలు

TG High Court: తెలంగాణ గ్రూప్ 1 మెరిట్ లిస్ట్ రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు

CM Revanth: ముఖ్యమంత్రి ఇంటి గోడను కూల్చేసిన అధికారులు.. సీఎం రేవంత్ ఏమన్నారంటే?

×