BigTV English

Addanki Dayakar: తెలంగాణ మీ జాగీరా? తప్పులు చేసి జై తెలంగాణ అంటే సరిపోతుందా?

Addanki Dayakar: తెలంగాణ మీ జాగీరా? తప్పులు చేసి జై తెలంగాణ అంటే సరిపోతుందా?

సారా అమ్ముతారు జై తెలంగాణ అంటారు!
దొంగతనం చేస్తారు జై తెలంగాణ అంటారు!
ఫోన్ ట్యాపింగ్ చేస్తారు జై తెలంగాణ అంటారు!
లక్షల కోట్ల రూపాయలు దోచుకున్న పార్టీ! దొంగ పార్టీ BRS.. అంటూ నిప్పులు చెరిగారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. తెలంగాణ అభివృద్ధిపై చర్చకోసం జరిగిన సవాళ్ల పరంపరలో ఆయన తాజాగా బీఆర్ఎస్ ని విమర్శించారు.


దమ్ముంటే అసెంబ్లీకి రండి..
ప్రెస్ క్లబ్ లో చర్చకు రావాలంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల సవాల్ విసిరారు. దీనికి కాంగ్రెస్ నేతలు ఘాటుగా బదులిచ్చారు. ప్రెస్ క్లబ్ లో చర్చలెందుకని, దమ్ముంటే కేసీఆర్ ని అసెంబ్లీకి తీసుకు రావాలన్నారు. దీనికి బదులివ్వలేని కేటీఆర్ ఈరోజు ప్రెస్ క్లబ్ దగ్గరకు వచ్చి మళ్లీ విమర్శలు మొదలు పెట్టారు. సీఎం రాలేదని, కనీసం మంత్రులు కూడా రాలేదని అన్నారు. కేటీఆర్ తాజా వ్యాఖ్యలకు కాంగ్రెస్ మరింత ఘాటుగా బదులిచ్చింది. కేటీఆర్ ఒక బచ్చా అని, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా పనిచేసే అర్హత కూడా ఆయనకు లేదని, దమ్ముంటే కేసీఆర్ తో అసెంబ్లీ సమావేశాలకోసం లేఖ రాయించాలని సూచించారు ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్. అసెంబ్లీలో చర్చకు పిలిస్తే పారిపోయే బీఆర్ఎస్ నేతలు, ప్రెస్ క్లబ్ ముందు నిల్చొని సవాళ్లు విసరడమేంటని ప్రశ్నించారు. అటు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ వద్దకు వెళ్లి నినాదాలు చేశారు. బీఆర్ఎస్ నేతలు చర్చకు రాకుండా పారిపోతున్నారని అన్నారు. రైతు భరోసా కింద 9 రోజుల్లోనే 9 వేల కోట్ల రూపాయలు లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశామని వివరించారు. తమ హయాంలో జరిగిన సంక్షేమంపై అసెంబ్లీ వేదికగా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు కాంగ్రెస్ నేతలు.

సెంటిమెంట్ రెచ్చగొడతారా..?
చెల్లి కవితను ఫోన్‌ని ట్యాపింగ్ చేసి కేటీఆరే అణగదొక్కారని, ఆమె వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం కేటీఆర్ కి లేదని అన్నారు అద్దంకి దయాకర్. తెలంగాణ ప్రజలను మోసం చేసిన దొంగలకు, సీఎం రేవంత్‌రెడ్డితో పోలిక పెట్టుకోవడానికి అర్హతే లేదన్నారు. ఆంధ్రా తెలంగాణ అంటూ మళ్లీ సెంటిమెంట్ రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. వాళ్లకి అనుకూలంగా ఉంటే మంచి మీడియానా? లేకపోతే చెడ్డ మీడియానా? అని నిలదీశారు. బీఆర్ఎస్ పార్టీని ఆ నలుగురు తప్ప.. ఎవరూ సపోర్ట్ చేయడం లేదని, కేసీఆర్‌ అసెంబ్లీకి రాలేక, బచ్చగాడిని పంపుతారా అని ఎద్దేవా చేశారు దయాకర్. బావ, బామ్మర్ధులతో పాటు చెల్లి ఇప్పుడు పోటీలోకి వచ్చిందని, అందరూ కలిసినా రేవంత్‌ని ఏం చేయలేకపోయారని చెప్పారు. పిచ్చిమాటలు మాట్లాడితే తడాఖా చూపిస్తామని హెచ్చరించారు.


ట్యాపింగ్ తోనే ఆమాత్రం మెజార్టీ..
“తెలంగాణ మీ జాగీరా?. సాగరహారం జరుగుతుంటే ఎక్కడ ఉన్నారు. సాగరహారం జరిగిన రోజుల్లో మీ మొహాలు ఎక్కడున్నాయి. తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన వాళ్లం మేము. బీఆర్ఎస్ పేరు పెట్టుకున్నాక తెలంగాణతో మీకు సంబంధం ఏంటి.” అని ప్రశ్నించారు అద్దంకి దయాకర్. గత ఎన్నికల్లో ఫోన్లు ట్యాప్ చేసి కొంతమందిని బెదిరించి బీఆర్ఎస్ ఆమాత్రం సీట్లు సంపాదించిందని ఎద్దేవా చేశారాయన. ఫోన్ ట్యాపింగ్ జరగకపోయి ఉంటే కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు గ్యారెంటీగా వచ్చేవని చెప్పారు.

Related News

Hyderabad Rains: రైన్ అలర్ట్.. ఆఫీసుల నుంచి త్వరగా ఇంటికి వెళ్లిపోండి, లేకుంటే చిక్కుకుపోతారు!

Telangana: అడ్వకేట్ వామనరావు దంపతుల కేసు.. ఇకపై సీబీఐ చేతికి, సుప్రీంకోర్టు ఆదేశం

KTR Vs Sanjay: బండి సంజయ్‌కు కేటీఆర్ నోటీసులు.. కేవలం వారం గడువు

Hyderabad News: హైదరాబాద్‌ ఖజానా జ్యువెలర్స్‌లో దోపిడీ.. సిబ్బందిపై దుండగులు కాల్పులు, పలువురికి గాయాలు?

ORR Closed: వాహనదారులు అలర్ట్.. ఆ ప్రాంతాల్లో ORR సర్వీసులు బంద్

Heavy rain: హైదరాబాద్‌లో భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన

Big Stories

×