Visa-Free Destinations: ఫారిన్ టూర్ కు వెళ్లాలంటే కచ్చితంగా వీసా ఉండాల్సిందే. కానీ, కొన్ని దేశాలు భారతీయులను వీసా లేకుండానే తమ దేశంలోకి ఆహ్వానిస్తున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా 58 దేశాలకు భారతీయులు వీసా లేకుండా వెళ్లొచ్చు. ఈ దేశాల లిస్టులో ఆసియా, ఆఫ్రికా, కరేబియన్, పసిఫిక్ దీవులలో టాప్ డెస్టినేషన్స్ కూడా ఉన్నాయి.
వీసా లేకుండా ఇండియన్స్ వెళ్లే దేశాలు ఇవే!
1.అంగోలా
2.బార్బడోస్
3.భూటాన్
4.బొలీవియా (VOA)
5.బ్రిటిష్ వర్జిన్ దీవులు
6.బురుండి (VOA)
7.కంబోడియా (VOA)
8.కేప్ వెర్డే దీవులు (VOA)
9.కొమొరో దీవులు (VOA)
10.కుక్ దీవులు
11.జిబౌటి (VOA)
12.డొమినికా
13.ఇథియోపియా (VOA)
14.ఫిజి
15.గ్రెనడా
16.గినియా-బిస్సావు (VOA)
17.హైతీ
18.ఇండోనేషియా (VOA)
19.ఇరాన్
20.జమైకా
21.జోర్డాన్ (VOA)
22.కజకిస్తాన్
23.కెన్యా (ETA)
24.కిరిబాటి
25.లావోస్ (VOA)
26.మకావో (SAR చైనా)
27.మడగాస్కర్
28.మలేషియా
29.మాల్దీవులు (VOA)
30.మార్షల్ దీవులు (VOA)
31.మౌరిషస్
32.మైక్రోనేషియా
33.మంగోలియా (VOA)
34.మోంట్సెరాట్
35.మొజాంబిక్ (VOA)
36.మయన్మార్ (VOA)
37.నమీబియా (VOA)
38.నేపాల్
39.నియు
40.పలావు దీవులు (VOA)
41.ఖతార్ (VOA)
42.రువాండా
43.సమోవా (VOA)
44.సెనెగల్
45.సీషెల్స్ (ETA)
46.సియెర్రా లియోనా (VOA)
47.సోమాలియా (VOA)
48.శ్రీలంక (VOA)
49.సెయింట్ కిట్స్ మరియు నెవిస్ (ETA)
50.సెయింట్ లూసియా (VOA)
51.సెయింట్ విన్సెంట్ మరియు గ్రెనడిన్స్
52.టాంజానియా (VOA)
53.థాయిలాండ్
54.తిమోర్-లెస్టే (VOA)
55.ట్రినిడాడ్ మరియు టొబాగో
56.తువాలు (VOA)
57.వనాటు
58.జింబాబ్వే (VOA)
Read Also: నిన్న వైజాగ్.. ఈ రోజు బెంగళూరు.. వందేభారత్ రైళ్లలో కీలక మార్పులు!
ఈ దేశాల్లో వెళ్లే భారతీయ పర్యాటకుల కోసం కొన్ని పరిమితులు ఉన్నాయి. ఈ దేశాలు సాధారణంగా ఐదు వీసా విధానాలలో ఏదో ఒకదాన్ని అనుసరిస్థాయి.
1.వీసా రహితం: వీసా రహిత దేశాలకు వెళ్లేందుకు ఎలాంటి పరిమితులు ఉండవు. భారతీయ పాస్ పోర్టు ఉంటే సరిపోతుంది.
2.వీసా సహితం: వీసా సహిత దేశాలకు వెళ్లాలంటే ముందుగా వీసా పొందాల్సి ఉంటుంది. సాధారణం సంబంధిత దేశంలోని రాయబార కార్యాలయాలు, కాన్సులేట్ లలో వీసా ప్రక్రియ ఉంటుంది. ఆయా నిబంధనల ప్రకారం వీసా మంజూరు చేస్తారు.
3.వీసా ఆన్ అరైవల్ (VOA): వీసా ఆన్ అరైవల్ (లేదా VOA) అనేది ఆ దేశంలోకి వెళ్లిన తర్వాత వీసా తీసుకోవాల్సి ఉంటుంది. ప్రయాణానికి ముందు వీసా అనుమతులకు సంబంధించిన పత్రాలను రెడీ చేసుకోవాలి. ఆయా దేశాల విమానాశ్రయాలలో దిగగానే ఈ ప్రక్రియ కోసం ఒక విభాగాన్ని కేటాయిస్తాయి.
4.ఇ-వీసా: ఇ-వీసాలు అంటే ఈ దేశాలకు వెళ్లేందుకు వీసా అవసరమైనప్పటికీ, ప్రక్రియ ఆన్ లైన్ లో పూర్తవుతుంది.
5.ఎలక్ట్రానిక్ ట్రావెల్ అథారిటీ(ETA): సాధారణంగా స్వల్పకాలిక బసల కోసం వీటిని అందిస్తారు.
Read Also: రైల్లో నీలం, నల్ల బ్యాగులు కనిపిస్తే చాలు మాయం చేస్తారు.. ఎందుకంటే?