Addanki Dayakar: రేవంత్ సర్కార్ చేపట్టిన కుల గణనపై రాజకీయ పార్టీల మధ్య మాటల యుద్ధం కంటిన్యూ అవుతోంది. ఈ వ్యవహారంపై హాట్ కామెంట్స్ చేశారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్. తాము సాధించిన కులగణన విజయం కొందరు ప్రతిపక్ష నాయకులకు నచ్చట్లేదన్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు అద్దంకి దయాకర్. కేవలం మూడు నెలల్లోపు సర్వే రిపోర్టును ప్రజల ముందు పెట్టిన ఘనత రేవంత్ ప్రభుత్వానికి చెల్లిందన్నారు. ఈ సర్వేను ప్రజలంతా హర్షిస్తున్నారని చెప్పారు.
గత ప్రభుత్వంలో సకల జనుల సర్వే పేరిట రికార్డు నమోదు చేసిందని, కానీ దానికి సంబంధించిన డీటేల్స్ బయటకు రాలేదన్నారు. పబ్లిక్ డొమైన్‌లో సర్వే నివేదిక పెట్టలేదన్న విషయాన్ని గుర్తు చేశారు. ఆనాడు అసెంబ్లీలోగానీ కేబినెట్‌లో గానీ ఎక్కడా ప్రస్తావనకు రాలేదని వివరించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం చేయలేని పనిని మా ప్రభుత్వం కేవలం మూడు నెలల్లో చేసి చూసించిందన్నారు దయాకర్. బీసీలకు రిజర్వేషన్లు కల్పించే విషయంలో టెక్నికల్ ఇష్యూ ఉన్నా ఏ మాత్రం వెనక్కి తగ్గేది లేదని మనసులోని మాట బయటపెట్టారు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్.
ALSO READ: ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి, రెండురోజులు అక్కడే మకాం.. ఎందుకు?