Kane Williamson: కేన్ విలియమ్ సన్.. న్యూజిలాండ్ జట్టులో అత్యంత విశ్వసనీయ బ్యాటర్లలో ఒకరు. ఈ న్యూజిలాండ్ మాజీ కెప్టెన్ కి ఆ దేశంలోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన క్రేజ్ ఉంది. ముఖ్యంగా కేన్ విలియమ్ సన్ కి భారత్ లో చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇతడిని పొగడ్తలతో ఆకాశానికి ఎత్తేస్తారు. ఏదైనా మ్యాచ్ లో ఓటమి ఎదురైనా చెరిగిపోని చిరునవ్వుతో కనిపించే కేన్ విలియమ్ సన్ ని సూపర్ హీరోగా అభివర్ణిస్తారు అభిమానులు.
Also Read: Fact Check: ఎన్టీఆర్ పేరుతో ఫిఫా పోస్టర్.. అందరూ తప్పులో కలేశారు ?
ముఖ్యంగా తెలుగు క్రీడాభిమానులకు ఎవ్వరూ అంత ఈజీగా నచ్చరు. కానీ ఒక్కసారి నచ్చితే మాత్రం అస్సలు వదలరు. అలా తెలుగు క్రీడాభిమానుల అభిమానం చురగొన్న క్రికెటర్లలో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ ముందు వరుసలో ఉంటారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ {ఐపీఎల్} లో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించిన ఈ ఇద్దరు.. తెలుగు క్రీడాభిమానులకు ఎంతగానో చేరువయ్యారు. అయితే టీమ్ మేనేజ్మెంట్ తో గొడవల కారణంగా డేవిడ్ వార్నర్ హైదరాబాద్ జట్టుకి దూరం కాగా.. ఫామ్ కోల్పోయిన కేన్ విలియమ్ సన్ ని ఆరెంజ్ ఆర్మీ రిటైన్ చేసుకోలేదు.
దీంతో ఐపీఎల్ 2025 మెగా వేలంలో కేన్ విలియమ్స్ ని కొనడానికి ఏ జట్టు మేనేజ్మెంట్ ముందుకు రాకపోవడం ఆశ్చర్యానికి గురిచేసింది. అటు ఐపిఎల్ 2025 మెగా వేలంలో డేవిడ్ వార్నర్, జానీ బెయిర్ స్టో కూడా అమ్ముడుపోని ప్లేయర్ల లిస్టులో చేరారు. కానీ ప్రస్తుతం సౌత్ ఆఫ్రికా SA20 2025 సీజన్ లో తన అద్భుత ప్రదర్శనను కనబరుచుతూ దక్షిణాఫ్రికా ప్రేక్షకుల హృదయాల్లో మాత్రమే కాకుండా ప్రపంచ క్రికెట్ అభిమానులలో మంచి స్థానాన్ని సంపాదించుకున్నాడు విలియమ్ సన్.
సౌత్ ఆఫ్రికా 20 లీగ్ లో డర్బన్ సూపర్ జెయింట్స్ జట్టు తరపున ఆడుతున్న విలియమ్ సన్ ని తాజాగా ఆ జట్టు సభ్యుడు అయిన హెన్రిచ్ క్లాసెన్ ఇంటర్వ్యూ చేశాడు. ఈ సందర్భంగా క్లాసెన్.. విలియమ్ సన్ కి ఓ ఆసక్తికరమైన ప్రశ్న వేశాడు. నీకు బాగా నచ్చిన, ఇష్టమైన నిక్ నేమ్ ఏంటి..? అని కేన్ విలియమ్ సన్ ని ప్రశ్నించాడు క్లాసెన్. దీనికి కేన్ విలియమ్ సన్ సమాధానమిస్తూ.. ” నేను ఇండియాలో ఐపీఎల్ ఆడే సందర్భంలో అందరూ నన్ను కేన్ మామ, కేన్ మామ అని పిలిచేవారు. అప్పుడు నాకు దానికి అర్థం ఏమిటో తెలుసుకోవడానికి కొంత సమయం పట్టింది.
Also Read: Marcus Stoinis Retirement: ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. మార్కస్ స్టోయినిస్ రిటైర్మెంట్!
కానీ ఓ ప్లేయర్ అని సొంత మనిషిలా అనుకుంటున్నారని తెలిశాక ఆ నిక్ నేమ్ నాకు చాలా బాగా నచ్చింది. నాకు ఇష్టమైన ముద్దు పేరు అదే” అని తెలిపాడు కేన్ విలియమ్ సన్. దీంతో ఈ వీడియోని సన్ రైజర్స్ అభిమానులు వైరల్ చేస్తున్నారు. 2025 మెగా వేలంలో కేన్ విలియమ్సన్ అమ్ముడు పోలేదు. ఐపీఎల్ లో అతని సేవలు ఉపయోగించుకున్న జట్లు ఇప్పుడు అతడిని గాలికి వదిలేసాయి. కేన్ విలియంసన్ కెప్టెన్సీలో సన్రైజర్స్ హైదరాబాద్ రన్నరప్ గా నిలిచింది. అయితే సన్రైజర్స్ విడుదల చేయడంతో గత రెండు సీజన్లుగా గుజరాత్ తరపున ఆడాడు.