YS Jagan on Sai Reddy: మాజీ సీఎం జగన్ మనసులో ఉన్న మాట బయటకు చెప్పేశారు. ఇప్పటికే వైసీపీ నుండి పలువురు నేతలు వలస వెళ్లిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని జగన్ ప్రస్తావించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఇన్ని రోజులు నాయకుల పార్టీ మార్పుపై సైలెంట్ గా ఉన్న జగన్ ఇప్పుడు కుండబద్దలు కొట్టేశారు. గురువారం మీడియా సమావేశంలో జగన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి. నిన్న జగన్ 2.O చూస్తారంటూ కామెంట్స్ చేసిన జగన్.. నేడు పార్టీ నాయకులు పార్టీ నుండి వెళ్లడంపై స్పందించారు.
మొదటగా జగన్.. కూటమి ప్రభుత్వం లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో దారుణమైన పాలన సాగుతుందని, 9 నెలల్లో ప్రజలకు అంతా అర్థమైందన్నారు. జమిలి ఎన్నికలు వస్తాయని మనకంటే ముందే ప్రజలు ఎదురు చూస్తున్నారని తెలిపారు. ఇవే ఎన్నికలు వస్తే కూటమి ఓటమి ఖాయమంటూ.. జగన్ జోస్యం చెప్పారు. చంద్రబాబు చొక్కా పట్టుకొని ప్రజలు ప్రశ్నించే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. తాను పదేపదే చెప్పానని, ప్రజలు అబద్దాలనే నమ్మి కూటమికి పట్టం కట్టినట్లు జగన్ తెలిపారు.
ఇక వైసీపీ నుండి ఇటీవల పలువురు నాయకులు వెళ్లడంపై జగన్ స్పందించారు. మనకు 11 మంది రాజ్యసభ ఎంపీలుంటే వారిలో ఇప్పటికే నలుగురు వెళ్లారని జగన్ అన్నారు. మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు, ఆర్ కృష్ణయ్య, విజయసాయి రెడ్డి ఇటీవల పార్టీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఇదే విషయంపై జగన్ మాట్లాడుతూ.. ఎంత మంది పార్టీ నుండి వెళ్లినా పార్టీకి వచ్చిన నష్టం ఏమి లేదన్నారు. రాజకీయాల్లో క్యారెక్టర్ ముఖ్యమని, ఆ క్యారెక్టర్ లేకుండ వెళ్లిన సాయిరెడ్డి కైనా.. ఇది అందరికీ వర్తిస్తుందన్నారు. మనకు దేవుడి దయ, ఆశీస్సులు ఉన్నాయని క్యాడర్ భయపడాల్సిన అవసరం లేదని జగన్ భరోసానిచ్చారు.
Also Read: Turmeric Purity Check: మీరు వాడే పసుపు స్వచ్ఛమైనదేనా ? చెక్ చేయండిలా !
మొత్తం మీద పార్టీ నుండి నాయకులు వెళ్ళడంపై క్యారెక్టర్ అనే పదాన్ని జగన్ సంభోధించడం ఇప్పుడు వైరల్ అవుతోంది. మొన్నటి వరకు పలువురు నాయకులు వదిలి వెళ్లినా స్పందించని జగన్.. సాయిరెడ్డి వెళ్లిన సంధర్భంగా కాస్త సీరియస్ గానే స్పందించారు. క్యారెక్టర్ లేని వారు రాజకీయాల్లో పనికిరారని జగన్ పరోక్షంగా చెప్పారని చెప్పవచ్చు. ఇప్పుడిప్పుడే పార్టీకి పూర్వ వైభవం తెచ్చేందుకు జగన్ ముందడుగు వేస్తున్న క్రమంలో, పార్టీకి రాజీనామాలు కొత్త తలనొప్పులు తెచ్చే పరిస్థితుల్లో జగన్ మాత్రం.. డోంట్ కేర్ తరహాలో కామెంట్స్ చేశారని చెప్పవచ్చు. మొత్తం మీద జగన్ చేసిన కామెంట్స్ పై సాయిరెడ్డి స్పందిస్తారా లేదా అన్నది తెలియాల్సి ఉంది.