E-Paper
Advertisement

Adilabad : “నా చావుకు కారణం సీఎం”.. యువరైతు ఆత్మహత్య

Adilabad : “నా చావుకు కారణం సీఎం”.. యువరైతు ఆత్మహత్య
Advertisement

Adilabad : తన చావుకు సీఎం కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన ఆదిలాబాద్ ​జిల్లా జైనథ్ మండలంలో బోరజ్ గ్రామంలో జరిగింది. రమాకాంత్ అనే యువకుడు నిన్న సాయంత్రం బోరజ్ గ్రామ శివారులో పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రైతు మృతి చెందిన స్థలంలో ఓ సూసైడ్ నోట్ దొరికింది.

“అవ్వ బాపు నన్ను క్షమించండి. తప్పయ్యింది. చెల్లి, బావ మీకంటే నాకు ఎవరూ లేకుండె. సీఎం సార్​ భూమి ఉన్నోళ్లకు రైతుబంధు ఇస్తున్నరు. మా ఊరిలో నాలాంటి చాలా మంది దళితులు ఉన్నరు. నా చావుకు మీరే కారణం” అంటూ సూసైడ్ నోట్‌లో తనకు వచ్చిన భాష, పదాలతో రాశారు.

Advertisement

అయితే రైతుబంధు నిధులను వ్యవసాయ భూములు ఉన్న రైతులకు కేసీఆర్ ప్రభుత్వం ఇస్తుంది. అయితే భూమి లేని రైతులు, కౌలు రైతులకు ఎలాంటి ఆర్థిక సాయం అందడం లేదు. ఈ క్రమంలోనే వ్యవసాయం చేసే కౌలు రైతులు తమను ఆదుకోవాలని కోరుతున్నారు. మరోవైపు తమ కుమారుడికి దళితబంధు రాకపోవడంతోనే ఆత్మహత్య చేసుకొని ఉంటాడని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.

Related News

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

ఆదిభట్ల గౌరా ఎయిరోస్పేస్‌లో భారీ అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు, రంగంలోకి ఫైర్ ఫైటర్స్!

Big Stories

Advertisement
×