BigTV English

Sachin Tendulkar : అది సచిన్ విగ్రహమేనా? స్టీవ్ స్మిత్ లా అనిపిస్తోందే !

Sachin Tendulkar : అది సచిన్ విగ్రహమేనా?  స్టీవ్ స్మిత్ లా అనిపిస్తోందే !

Sachin Tendulkar : వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ముంబయి వాంఖేడి స్టేడియంలో క్రికెట్ దేవుడు సచిన్ టెండుల్కర్ కాంస్య విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సందర్భంగా నెట్టింట పలు కామెంట్లు వినిపిస్తున్నాయి. అయితే అది సచిన్ టెండుల్కర్ ఫేస్ లా లేదని, ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ స్టీవ్ స్మిత్ లా ఉందని సెటైర్లు పేలుస్తున్నారు.


అయితే మేకర్స్ మాత్రం సచిన్ టెండూల్కర్ నమూనాతో ఉన్న 50వేల చిత్రాలు చూసి, అందులో దీనిని సెలక్ట్ చేశామని అంటున్నారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ షిండే, బీసీసీఐ కార్యదర్శి జై, బీసీసీ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ శుక్లా సచిన్‌ కుటుంబ సభ్యులు, ఇంకా ఇండియా, శ్రీలంక జట్టు సభ్యుల సమక్షంలో కాంస్య విగ్రహావిష్కరణ జరిగింది. సచిన్‌ 50వ జన్మదినోత్సవం సందర్భంగా  సచిన్‌ టెండూల్కర్‌ స్టాండ్‌ సమీపంలో ముంబయి క్రికెట్‌ అసోసియేషన్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది.

ఇప్పుడిదే వివాదాస్పదమవుతోంది. జర్నలిస్టులు, క్రికెట్ నిపుణులు కూడా ముఖం చెక్కిన విధానంపై ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ విగ్రహాన్ని అహ్మద్‌నగర్‌కు చెందిన ప్రమోద్‌ కాంబ్లే తయారు చేశారు. సచిన్‌ ఐకానిక్‌ స్ట్రోక్‌ను విగ్రహంగా మలిచారు. సచిన్ ఫేవరెట్ షాట్లలో ఒకటైన దానిని ఎంపిక చేశారు. బౌలర్ తల మీదుగా లాఫ్టెడ్ షాట్ ఆడుతున్నట్టుగా, శరీరం కాస్త పక్కకి వంగినట్టు, బ్యాట్ ఆకాశం వైపు ఉన్నట్టుగా, ఫైనల్ గా చెప్పాలంటే ఒక సిక్సర్ కొడుతున్నట్టుగా చూపే భంగిమను ప్రతిమగా మలచారు.


ఈ సందర్భంగా 14 ఏళ్ల వయసులో తొలిసారి వాంఖడే స్టేడియంకి వచ్చిన తన  అనుభవాన్ని సచిన్ గుర్తు చేసుకున్నాడు. 1983లో వెస్టిండిస్‌ జట్టు భారత పర్యటనకు వచ్చినపుడు, తాను నార్త్‌ స్టాండ్‌కు వెళ్లానని చెప్పాడు. అప్పుడు డ్రెస్సింగ్‌ రూమ్‌ చేసేందుకు సునీల్‌ గవాస్కర్‌ ఆహ్వానించారని..అది మరిచిపోలేనని అన్నాడు. అందరూ పెద్దపెద్దవాళ్లు కూర్చున్నారు. ఎక్కడ కూర్చోవాలో తెలియక ఖాళీగా ఉన్న సీట్లో కూర్చున్నాను. అది సునీల్ గవాస్కర్ అది అని చెప్పారని అన్నాడు. 2007లో కెప్టెన్సీ ఆఫర్ వస్తే, ఇదే స్టేడియంలో  మహేంద్ర సింగ్ ధోనీ పేరు శరద్ పవార్ కి సూచించానని అన్నాడు.

Related News

IND Vs PAK : అభిషేక్ శర్మ ఫాలోయింగ్ చూడండి.. పాకిస్తాన్ లేడీ కూడా లవ్ యూ చెప్పింది!

IND Vs PAK : అంపైర్లు అమ్ముడుపోయారు.. అది నాటౌట్… షోయబ్ అక్తర్ సంచలన వ్యాఖ్యలు

IND Vs PAK : గేమ్ ఓడిపోయాం కానీ యుద్ధం గెలిచాం : రవూఫ్ భార్య

IND Vs PAK : దుబాయ్ స్టేడియంలో పాకిస్థాన్ ఫ్యాన్ పై దాడి… రంగంలోకి పోలీసులు!

Fakhar Zaman catch : టీమిండియా తొండాట‌…ఐసీసీకి పాకిస్థాన్ ఫిర్యాదు

Abhishek Sharma: అభిషేక్ శ‌ర్మకు గ్రౌండ్ లోనే ప్ర‌పోజ్‌..ఫ్లయింగ్ కిస్సులు ఇచ్చి మ‌రీ !

IND VS PAK: మ‌రోసారి టీమిండియా వ‌ర్సెస్ పాక్ మ్యాచ్‌..చ‌చ్చిన పామును మ‌ళ్లీ చంప‌డ‌మే

AK-47 Celebration: ధోని చేస్తే క‌రెక్ట్‌.. మేం చేస్తే త‌ప్పా…!

Big Stories

×