BigTV English

Govt Jobs: రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఎన్నికల కోడ్ ముగియగానే..

Govt Jobs: రాష్ట్రంలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్..ఎన్నికల కోడ్ ముగియగానే..

TGPSC Job Notifications 2024: లోక్‌సభ ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే రాష్ట్రంలో కొలువుల జాతర ప్రారంభం కానుంది. ఎన్నికల కోడ్ కారణంగా నిలిచిపోయిన పలు నోటిఫికేషన్ల ఫలితాల వెల్లడితో పాటు ఇప్పటికే నియామక పత్రాలు అందుకున్న అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇవ్వనున్నారు.


ఫ్రభుత్వ ఉద్యోగాల భర్తీ వేగంగా చేపట్టేందుకు టీజీపీఎస్సీ కార్యచరణ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. గురుకుల, పోలీసు నియామక బోర్డల పరిధిలోని నియమకాలు పూర్తి కాగా, టీజీపీఎస్సీ పరిధిలోని పలు నోటిఫికేషన్ల ఫలితాలు వెల్లడికానున్నాయి. టీజీపీఎస్సీ పరిధిలో దాదాపు 13 వేలకు పైగా పోస్టుకు సంబంధించిన తుది ఫలితాల వెల్లడి, ధ్రువ పత్రాలు పరిశీలన దశలో ఉన్నాయి. పరిశీలన పూర్తి అయిన ఉద్యోగాల తుది ఫలితాలను త్వరలో ప్రకటించనున్నారు.

ధ్రువపత్రాల పరిశీలన పూర్తి చేసి అనంతరం రెండు మూడు నెలల్లోనే నియమకాలను పూర్తి చేయాలన్న లక్ష్యంతో కమిషన్ పనిచేస్తోంది. గ్రూప్ – 4లో 8 వేల 180 పోస్టులు ఉన్నాయి. అయితే రాతపరీక్ష తర్వాత పోస్టుల ఆధారంగా జీఆర్ఎల్ కూడా విడుదల చేశారు. స్పోర్ట్స్ కేటగిరీలో సెలక్ట్ అయిన అభ్యర్థుల సర్టిఫికెట్స్ పరిశీలన పూర్తయింది. మిగతా అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలన ఈ నెలలో ప్రారంభించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది.


Also Read: ఎవరి ముద్రలివి? చిహ్నాల వెనుక చరిత్ర ఏంటో తెలుసా?

ప్రభుత్వ విభాగాల్లో 1,540 అసిస్టెంట్ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీరింగ్ పోస్టుకు సంబంధించి మెరిట్ అభ్యర్థుల సర్టిఫికెట్స్ పరిశీలన పూర్తయింది. అయితే తుది ఫలితాల కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. జూనియర్ లెక్చరర్ పోస్టుల కోసం పరీక్ష నిర్వహించగా అందుకు సంబంధించిన కీ కూడా అధికారులు విడుదల చేశారు. రవాణా శాఖలో 113 ఏఎంవీఐ పోస్టులకు జూన్ లో పత్రాల పరిశీలన జరగనుంది. వివిధ దశల్లో నియమాలను వేగంగా పూర్తి చేసి ఫలితాలను ప్రకటించాలని కమిషన్ భావిస్తోంది.

Tags

Related News

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Guvvala Balaraju: బీజేపీలో చేరిన గువ్వల.. కేటీఆర్‌పై హాట్ కామెంట్స్..

Big Stories

×