E-Paper
Advertisement

AISF Demands: విద్యారంగ సమస్యలపై చట్టసభల్లో మాట్లాడాలి.. కూనంనేని సాంబశివరావుకి ఏఐఎస్ఎఫ్ వినతి

AISF Demands: విద్యారంగ సమస్యలపై చట్టసభల్లో మాట్లాడాలి.. కూనంనేని సాంబశివరావుకి ఏఐఎస్ఎఫ్ వినతి
Advertisement

AISF Demands: రాష్ట్రంలో విద్యారంగ సమస్యలను అసెంబ్లీలో, శాసనమండలిలో ప్రస్తావించి, రాష్ట్ర బడ్జెట్ లో విద్యారంగానికి అధిక నిధులు కెటాయించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని CPI ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు గారికి, CPI ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం గారికి ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్ లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలని, విద్యారంగంలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని, ప్రాధమిక విద్య నుండి ఉన్నత విద్య వరకు ఖాళీగా వున్న టీచింగ్, నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయాలి ,ముఖ్యంగా ఉన్నత విద్యారంగంలో ప్రభుత్వ యూనివర్సిటీలు నిర్లక్ష్యానికి గురికాబడుతున్నాయి. యూనివర్సిటీల అభివృద్ధి కోసం ప్రత్యేక నిధులు కెటాయించాలి .గురుకుల పాఠశాలలకు శాశ్వత భవనాలు నిర్మించాలి 9,300వేల కోట్లు స్కాలర్షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు పెండింగ్ లో ఉన్నాయి. విద్యార్థులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Also Read: GHMC: జీహెచ్ఎంసీలో కొత్త విధానం నకిలీ బర్త్, డెత్ సర్టిఫికెట్లకు చెక్.. సీఆర్ఎస్ సిస్టమ్ అమలు!

5 లక్షల భరోసా కార్డు ఇంకెప్పుడు ఇస్తారు 

Advertisement

తమ కోర్సు పూర్తి చేసిన కూడా వారి సర్టిఫికెట్లు కళాశాల యాజమాన్యాలు ఇవ్వడం లేదు. ఉన్నత చదువులకు మరియు ఉద్యోగాల కోసం సన్నద్ధమవుతున్న వారికి ఇబ్బందికరంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో విద్యార్థులకు అనేక హామీలు ఇచ్చిందని ఇప్పటివరకు ఆ హామీల అమలుకు ప్రభుత్వంకు చేయకుండా వాటిపట్ల ఊసేత్తడం లేదని, విద్యార్థులకు ఇస్తామన్న ఎలక్ట్రిక్ స్కూటీలు, విద్యార్థులకు ఇస్తామన్న ల్యాప్టాప్ లు, ప్రతి విద్యార్థి ఇంటింటికి ఉచిత ఇంటర్నెట్, విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు ఇంకెప్పుడు ఇస్తారని ఈ బడ్జెట్లో హామీల వరకు నిధులు కేటాయించి అమలు చేయాలని, ప్రభుత్వం వెంటనే విద్యారంగ సమస్యలు పరిష్కరించి, బడ్జెట్ లో విద్యారంగానికి 30%నిధులు కేటాయించాలని లేనిపక్షంలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడిస్తామని మణికంఠ రెడ్డి హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఆఫీస్ బేరర్స్ రెహమాన్, గ్యార నరేష్, హైదరాబాద్ జిల్లా అధ్యక్ష ,కార్యదర్శి అనిల్, చైతన్య యాదవ్, ఉస్మానియా యూనివర్సిటీ అధ్యక్షుడు ఉప్పల ఉదయ్ కుమార్, నాయకులు జోసెఫ్,భాను,యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.

Also Read: Tanveer Ahmed: ఎవ‌డొస్తాడో రండి..తాలిబ‌న్ల అంతు చూస్తా, PSL 2026 కు ఎలాంటి ఢోకా లేదు

Related News

తెలంగాణ మహిళపై జమ్మూకశ్మీర్‌లో కేసు నమోదు..!

ఎంవీఎస్ఆర్ కాలేజీ దాండియా ప్రమాదంపై.. ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన!

ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగే సదస్సులకు.. సర్కార్ కొత్త నిబంధనలు!

సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై.. నిజామాబాద్ పోలీసులు యాక్షన్..!

కేసీఆర్‌ కుటుంబ ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి! – మాజీ మంత్రి రవీంద్ర నాయక్

సాలార్ జంగ్ మ్యూజియంకు సరికొత్త రూపు.. ఓయూ విద్యార్థులకు కీలక పిలుపు!

దేశంలో అలజడులు సృష్టించే కుట్రలు సాగనివ్వం: రాంచందర్ రావు

కేజీబీవీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు బిగ్ రిలీఫ్.. త్వరలో మళ్లీ ఆర్డర్లు?

Big Stories

Advertisement
×