E-Paper
Advertisement

Tanveer Ahmed: ఎవ‌డొస్తాడో రండి..తాలిబ‌న్ల అంతు చూస్తా, PSL 2026 కు ఎలాంటి ఢోకా లేదు

Tanveer Ahmed: ఎవ‌డొస్తాడో రండి..తాలిబ‌న్ల అంతు చూస్తా,  PSL 2026 కు ఎలాంటి ఢోకా లేదు
Advertisement

Tanveer Ahmed:   పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ( Pakistan Super League 2026 Tournament) మరో 8 రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 26వ తేదీ నుంచి ఈ మెగా ఈవెంట్ షురూ కానున్న నేపథ్యంలో కొత్త చిక్కులు వచ్చి పడ్డాయి. ఆఫ్ఘనిస్తాన్ లోని ( ( Afghanistan) కాబూల్ పైన (Kabul incident) ఇటీవల పాకిస్తాన్ దాడి చేసింది. ఈ నేపథ్యంలోనే పాకిస్తాన్ పైన రివేంజ్ తీర్చుకునేందుకు ఆఫ్గనిస్తాన్ తాలిబన్స్ ( Afghan Talibans) రంగం సిద్ధం చేసుకుంటున్నారు. ఏ క్షణమైనా పాకిస్తాన్ క్రికెట్ స్టేడియాలపై బాంబులు వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. అయితే దీనికి తాజాగా కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్ ( TANVEER AHMED). ఎవడొస్తాడో రండి.. తాలిబన్స్ అంతు చూస్తానంటూ సంచలన ప్రకటన చేశారు తన్వీర్ అహ్మద్. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటుకు ( PSL 2026) ఎలాంటి భద్రత ( PSL 2026 SECURITY) సమస్యలు లేవని చెప్పే క్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు తన్వీర్ అహ్మద్.

Also Read: Virender Sehwag: నేనైతే పాకిస్తాన్ బౌల‌ర్ల కెరీర్ నాశ‌నం చేసేవాడిని..300 స్ట్రైక్ రేట్ తో న‌ర‌కం చూపిస్తా

అస‌లు PSL 2026ను తాలిబ‌న్స్ ఎందుకు టార్గెట్ చేశారు ?

Advertisement

ఇటీవల ఆఫ్ఘనిస్తాన్ లోని కాబూల్ లో ఉన్న ఓ ఆసుపత్రి పై పాకిస్తాన్ అర్ధరాత్రి అటాక్ చేసింది. వైమానిక దాడులకు పాల్పడింది. ఈ సంఘటనలో ఆసుపత్రిలో ఉన్న దాదాపు 400 మంది ఆఫ్ఘనిస్తాన్ పౌరులు మరణించారు. మరో 300 మందికి పైగా ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు గాయపడ్డారు. ఇందులో మరికొంతమంది మరణించే అవకాశాలు ఉన్నట్లు చెబుతున్నారు. రంజాన్ కు ముందే ఈ దాడి జరిగిన నేపథ్యంలో ఆఫ్ఘనిస్తాన్ దేశంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ సంఘటనపై ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ ను కూడా స్పందించారు. పాకిస్తాన్ దేశానికి కొంచెం కూడా సిగ్గులేదని మండిపడ్డారు.

అటు అంతర్జాతీయంగా ఇతర దేశాలు కూడా పాకిస్తాన్ పై మండిపడుతున్నాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ పైన ఎలాగైనా రివేంజ్ తీర్చుకుంటామని ఇప్పటికే ఆఫ్గనిస్తాన్ తాలిబన్స్ ప్రకటన చేశారు. పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంటు పైన తమ కన్ను ఉంటుందని వెల్లడించింది. ఈ టోర్నమెంట్ జరిగే స్టేడియాలలో ఏ క్షణమైనా బాంబులు వేస్తామని వార్నింగ్ కూడా ఇచ్చింది ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబన్ సర్కార్. స్టేడియం బయట లేదా లోపల ఎక్కడైనా బాంబులు వేస్తామని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ఆస్ట్రేలియా లాంటి విదేశీ క్రికెటర్లు పాకిస్తాన్ లో పర్యటించకూడదని సూచనలు చేసింది.

తాలిబన్లకు తన్వీర్ అహ్మద్ వార్నింగ్

Advertisement

పాకిస్తాన్ స్టేడియాలపై బాంబులు వేస్తామన్న ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లకు తన్వీర్ అహ్మద్ వార్నింగ్ ఇచ్చారు. పాకిస్తాన్ దగ్గర అధునాతన ఆయుధాలు ఉన్నాయని, స్పెషల్ ఆర్మీ కూడా రంగంలో దిగిందని హెచ్చరించారు. తమ ముందు ఆఫ్ఘనిస్తాన్ ఆటలు సాగబోమని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అత్యంత భద్రత కలిగిన దేశం పాకిస్తానే అంటూ తన్వీర్ అహ్మద్ వెల్లడించారు. ఆస్ట్రేలియా అలాగే ఇతర విదేశీ ప్లేయర్లు ఎలాంటి భయం లేకుండా పాకిస్తాన్ సూపర్ లీగ్ 2026 టోర్నమెంట్ ఆడుకోవచ్చు అని వెల్లడించారు. తమ దగ్గర పటిష్టమైన సెక్యూరిటీ సిబ్బంది ఉందని.. ప్రపంచంలోనే నెంబర్ వన్ ఆర్మీ రంగంలోకి దిగిందని తెలిపారు. ఎలాంటి బాంబు దాడులు పాకిస్తాన్ పైన జరగబోవని పేర్కొన్నారు త‌న్వీర్ అహ్మ‌ద్. ఇలాంటి టెన్షన్ లేకుండా PSL 2026 టోర్నమెంట్ ఆడాలని విదేశీ క్రికెటర్లకు సూచనలు చేశారు. అవ‌స‌ర‌మైతే నేనే తాలిబ‌న్ ల‌పై యుద్ధానికి దిగుతానంటూ ప‌రోక్షంగా ప్ర‌క‌ట‌న చేశారు త‌న్వీర్‌.

 

 

 

 

 

Related News

పాకిస్తాన్ జ‌ట్టులో కుదుపు…ఫాతిమా స‌నా కెప్టెన్సీ గ‌ల్లంతు

ధోని లేక ఒక్కొక్క‌డి సుఖాలు ఎక్కువ‌య్యాయి..లేకుంటే గంభీర్‌, అగార్క‌ర్ తోక‌లు క‌ట్ చేసేవాడు

పాకిస్తాన్ త‌యారు చేసిన బంతుల వ‌ల్లే, ఫిఫా వరల్డ్ కప్ స‌క్సెస్!

పిక్ పాకెట్ కేసులో పాక్ క్రికెట‌ర్ హసన్ అలీ..తోలు తీసిన ఇండియ‌న్‌ పోలీసులు !

పాకిస్తాన్ ద‌య వ‌ల్లే, మేం క్రికెట్ నేర్చుకున్నాం..ఆఫ్ఘనిస్తాన్ ప్లేయ‌ర్ సంచ‌ల‌నం !

‘వరల్డ్‌కప్‌’ ఫార్మాట్‌ మార్పు వెనుక అంబానీ కుట్ర‌లు..ఐసీసీతో BCCI కుమ్మ‌క్కై !

పియూష్ చావ్లాకు న‌ర‌కం చూపించిన‌ పాక్ బ్యాట‌ర్ న‌వాజ్..ఒకే ఓవ‌ర్ లో 20 ప‌రుగులు

ఇంగ్లాండ్ కు గుడ్ బై…శ్రీలంక జ‌ట్టులో చేరిపోయిన జోఫ్రా ఆర్చ‌ర్‌?

Big Stories

Advertisement
×