E-Paper
Advertisement

Municipal polls : ఏరులై పారుతున్న మద్యం.. బీరు బిర్యానీ, డబ్బులు!

Municipal polls : ఏరులై పారుతున్న మద్యం.. బీరు బిర్యానీ, డబ్బులు!
Advertisement

రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల హడావుడి నెలకొన్న నేపథ్యంలో అభ్యర్థులు తమ గెలుపు కోసం నానా తంటాలు పడుతున్నారు. వారిని ప్రసన్నం చేసుకోవడానికి ఉదయం నుంచే ఓటర్ల ఇంటి ఎదుట బారులు తీరుతున్నారు. తమకు ఓటు వేసి గెలిపించాలని, సమస్యలు అన్నింటినీ తీరుస్తామని హామీలు ఇస్తున్నారు. ఇక ఓటర్లు సైతం ఎవరికి ఓటు వేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నట్టు తెలుస్తోంది. ఒక్కొక్కరు ఒక్కోలా తమ ప్రచారాన్ని కొనసాగిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక అధికార పార్టీ తరఫున అభ్యర్థితో పాటే స్టార్ క్యాంపెయినర్ ఓటర్ల సమస్యలను అడిగి తెలుసుకుంటూనే ఎన్నికలు ముగియగానే ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు.

ప్రతిపక్షాలది మరో తీరు..

కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఓటు వేస్తే మీ సమస్యలు పరిష్కారం కావని.. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఈ సమస్యలు అన్నింటినీ ముందే పరిష్కరించవచ్చు కదా? ఇపుడే చేయనప్పుడు ఎన్నికలు అయ్యాక చేస్తారని గ్యారెంటీ ఏంటని ఓటర్లను తికమక పెడుతున్నట్టు సమాచారం.తమకు ఓటు వేసి గెలిపిస్తే అందుబాటులో ఉంటామని, ప్రభుత్వంతో కొట్లాడి మరి అభివృద్ధికి కృషి చేస్తామని చెబుతున్నట్టు తెలుస్తోంది. ఇకపోతే స్థానికంగా ఉండే స్వతంత్రులు మాత్రం ప్రధాన పార్టీలకు భిన్నంగా.. తాను మీ అందరికీ పరిచయస్తుడిని అని.. మీ కళ్ల ముందే రోజు తిరుగుతానని.. ప్రధాన పార్టీ అభ్యర్థులకు ఓటు వేసి గెలిపిస్తే మరల వాళ్లు ఇంటి మొకం కూడా చూడరని.. అందుకే మీ అమూల్యమైన ఓటు తనకు వేసి గెలిపిస్తే వెంటనే పరిష్కరిస్తానని చెబుతున్నట్టు తెలుస్తోంది.

మద్యం, బీరు బిర్యానీ..

Advertisement

మున్సిపల్ ఎన్నికలు సార్వత్రిక ఎన్నికలను తలపిస్తున్నాయని టాక్ వినిపిస్తోంది. మున్సిపాలిటి కౌన్సిలర్, కార్పొరేటర్‌గా పోటీ చేస్తున్న అభ్యర్థులు తమ వెంట ప్రచారానికి వస్తున్న నేతలతో పాటు ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రధాన పార్టీల అభ్యర్థులు గుట్టుగా ఓట్ల కోసం తాయిళాల కింద బీరు, బిర్యానీ, డబ్బులు పంచుతున్నట్టు సమాచారం. ఈ విషయం తెలిసినా పోలీసు యంత్రాంగం అటు వైపు వెళ్లడం లేదని తెలుస్తున్నది. ప్రతి ఇంటికి ఓటర్లను లెక్కబెట్టి మరీ డబ్బుతో పాటు మద్యం, బిర్యానీ.. లేదంటే మహిళల కోసం బహుమతులు సైతం పంచి పెడుతున్నట్టు చర్చ జరుగుతున్నది.

Parvathipuram Manyam: ఆంధ్రప్రదేశ్‌లో షాకింగ్ ఘటన.. విద్యాసంస్థలో అశ్లీల డాన్సుల కలకలం!

Advertisement

ఎన్నికలకు ఇంకా రెండే రోజులు సమయం ఉన్నది. రేపటితో ప్రచారం ముగియనున్నది. ఈ క్రమంలోనే అభ్యర్థులు చివరిరోజున భారీగా డబ్బులు, మద్యం, బిర్యానీ ప్యాకెట్లు పంపిణీకి సిద్ధమైనట్టు తెలుస్తున్నది. ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు భారీగా ఖర్చు చేయాల్సి ఉంటుందని ముందుగానే పార్టీల నేతలు చెప్పడంతో వారు తమ ఆస్తులు అమ్ముకుని మరీ ఎన్నికల్లో బరిలో దిగారని టాక్. గెలుస్తామా? ఓడుతామా? అనేది లేకుండా విచ్చలవిడిగా ఓటర్లకు నగదు పంపిణీ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఓటుకు రూ.500 నుంచి 1000 వరకు పంచుతున్నట్టు తెలుస్తోంది. ఇక మందు బాబులకు మాత్రం ప్రత్యేకంగా బాటిల్స్ సైతం అందజేస్తున్నట్టు సమాచారం. మున్సిపల్ ఎన్నికలు జనరల్ ఎలక్షన్స్‌కు ఏమాత్రం తీసిపోవడం లేదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related News

స్పీడ్ పెంచిన రేవంత్ రెడ్డి.. రేపటి నుంచి సొంత గడ్డపై రెండు రోజుల పర్యటన !

అసదుద్దీన్ ఒవైసీ అసలైన దేశభక్తుడు.. సంతోష్‌నగర్ స్టీల్ ఫ్లైఓవర్ ప్రారంభంలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!

సాగర్‌కి శని పట్టింది.. ఆ ఇద్దరు మంత్రులే కారణం:మిర్యాల గూడలో రెచ్చిపోయిన KTR

31 ఏళ్ల కాంగ్రెస్ బంధం.. అధిష్టానానికి కొండా సురేఖ కన్నీటి లేఖ!

కేబినెట్ నుంచి ఔట్.. సురేఖకు ముందు బర్తరఫ్ అయిన మంత్రులు వీళ్లే!

రేవంతే పట్టుబట్టి నన్ను తీసేశారు..సీఎం పై సంచలన కామెంట్స్!

నన్ను అడగకుండా ఎలా బర్తరఫ్ చేస్తారు?.. అధిష్ఠానంపై మంత్రి కొండా సురేఖ ఫైర్!

సురేఖ అక్కా నేనున్నాను, పార్టీలోకి రావాలని కేఏపాల్ ఆహ్వానం

Big Stories

Advertisement
×