BigTV English

Lok Sabha Election Result 2024: తెలంగాణలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం..

Lok Sabha Election Result 2024: తెలంగాణలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధం..

TS Election Counting Process(Telangana news live): తెలంగాణలో పార్లమెంటు ఎన్నికల పోలింగ్ గత నెల 13న జరిగిన విషయం తెలిసిందే. ఫలితాలు జూన్ 4 అనగా రేపు విడుదల కానున్నాయి. ఇందుకు సంబంధించి ఎన్నికల అధికారులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధమైనట్లు తెలిపారు. జూన్ 4 అనగా మంగళవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుందని తెలిపారు. రాష్ట్రంలో ఉన్న మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు సహా 525 మంది పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో 2,20,24,806 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.


ఓట్ల లెక్కింపునకు సంబంధించిన వివరాలు..

– రేపు ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం


– 120 హాళ్లలో 1855 టేబుళ్లపై ఓట్ల లెక్కింపు

– 2.18 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునకు 19 హాళ్లలో 276 టేబుల్స్ సిద్ధం

– ఆర్మూర్, భద్రచాలం, అశ్వారావుపేట అసెంబ్లీ సెగ్మెంట్లలో 13 రౌండ్లలో లెక్కింపు

– చొప్పదండి, దేవరకొండ, యాఖత్ పురా అసెంబ్లీ సెగ్మెంట్లలో 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు

– సాయంత్రం 4 గంటల వరకు ఓట్ల లెక్కింపు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం

– ఓట్ల లెక్కింపునకు సుమారు 10 వేల మంది సిబ్బంది నియామకం

– మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్, మద్యం దుకాణాలు బంద్

– కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత, సీసీ కెమెరాల నిఘా ఏర్పాటు

also Read: కవితకు నో రిలీఫ్, జులై మూడు వరకు.. అన్ని రోజులా..

కాగా, తెలంగాణలో మొత్తం 17 పార్లమెంటు నియోజకవర్గాలకు గత నెల 13 ఎన్నికల పోలింగ్ జరిగింది. పలువురు కీలక నేతలు బరిలో ఉన్నారు. దీంతో తెలంగాణలో ఈసారి కొంత ఆసక్తికరంగా పోటీ నెలకొన్నది. ఎవరు ఊహించని విధంగా అభ్యర్థులు పార్టీల నుంచి టికెట్లు తెచ్చుకుని బరిలో నిలబడ్డారు. నియోజకవర్గ ప్రజలు తమను ఖచ్చితంగా గెలిపిస్తారంటూ ఆశలు పెట్టుకున్నారు. రేపు ఫలితాలు విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో సంబంధిత అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ఇటు రాష్ట్ర ప్రజలు కూడా ఏ నియోజకవర్గంలో ఎవరు గెలవబోతున్నారంటూ ఇప్పటికే లెక్కలు వేసుకున్నారు. ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో మొత్తంగా ఏ పార్టీకి అధిక సీట్లు రాబోతున్నాయంటూ చర్చించుకుంటున్నారు.

Related News

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Hyderabad Drugs: హైదరాబాద్‌‌ డ్రగ్స్‌ ఉచ్చులో డాక్టర్లు.. 26 లక్షల విలువైన?

Big Stories

×